
నిందితుడు ప్రదీప్
సాక్షి, మైసూరు(కర్ణాటక): చిన్నాన్న అనే పదానికి అతడు మచ్చ తెచ్చాడు. భార్య అక్క కుమార్తె అయిన మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. అబార్షన్ కోసం ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కామాంధుడు భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నంజనగూడు తాలూకాలోని హారోపుర గ్రామంలో చోటు చేసుకుంది.
నిందితులు ప్రదీప్ (26) మైసూరు కేఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హారోపురలో చిన్న అంగడి పెట్టుకున్న ప్రదీప్ భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో భర్తకు వంట చేసి పెడుతుందని అక్క కుమార్తె (14)ను ఉంచి వెళ్లింది. ఇదే అదనుగా అతడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టడంతో గర్భం దాల్చింది. బిళిగెరె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment