మహబూబ్‌నగర్‌లో నిర్మించిన ఏవీడీ థియేటర్‌లో విజయ్ మాతృమూర్తి మాధవి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారించాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న విజయ్ తాజాగా థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్‌ను ఏవీడీ (ఏషియన్ విజయ్ దేవరకొండ)గా పేరుతో నిర్మించాడు. ఈ థియేటర్‌ను నిన్న ప్రారంభించాడు.
ఆ థియేటర్‌లో తొలిసారి తన గురువు సినిమాను ప్రదర్శనకు ఉంచాడు. తనకు సినిమా అవకాశాలతో గుర్తింపు ఇచ్చిన శేఖర్ కమ్ములకు కృతజ్ఞతగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ సినిమాను ప్రదర్శించాడు. అయితే శుక్రవారం తన తల్లి మాధవి జన్మదినం సందర్భంగా ఆ టాకీస్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా థియేటర్ హాల్‌లో తల్లి మాధవి ఉన్న ఫొటోను పంచుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే మమ్ములు. ఈ ఏవీడీ (థియేటర్) నీకోసం. నీవు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతా. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్ ప్రారంభానికి విజయ్ అందుబాటులో లేడు.
Happy Birthday mummuluu ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) September 24, 2021
This one is for you! #AVD
If you workout and stay healthy, I will work harder and give you more memories 😘🤗 pic.twitter.com/edGhLLnGn0
Comments
Please login to add a commentAdd a comment