Karthikeyan
-
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్‌గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్‌ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్‌కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్‌గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్‌ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్‌ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్‌గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్‌ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్‌ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్‌ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం!
గతంలో పలు విజయవంతమైన చిత్రాలను తీసుకొచ్చిన బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ అధినేత ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్న తాజా చిత్రం వీరపథం కాట్రుమళై. ఈ చిత్రం దేర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురి జీవితాలను ఆవిష్కరించేదిగా ఉంటుంది. దీని ద్వారా సలీం ఆర్ బాషా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన ఇంతకుముందు మయక్కం అదు మాయం అని షార్ట్ ఫిలింను రూపొందించారు. జీవి చిత్రం ఫేమ్ వెట్రి, ముదలుమ్ నీ ముడివుమ్ నీ చిత్రం ఫేమ్ కిషన్ దాస్ హీరోలుగా నటిస్తురన్నారు. ఈ చిత్రంలో దీప్తి ఒరండేలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్ర దర్శకుడు సలీం ఆర్ బాషా మాట్లాడుతూ ఇది వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రమన్నారు. వారి భావాలు, ఎదుర్కొనే సమస్యల సమాహారంగా కథ ఉంటుందన్నారు. ఇక్కడ మనుషులు పూర్తిగా మంచి వారిగా ఉండరు, పూర్తిగా చెడ్డవారు గాను ఉండరని పేర్కొన్నారు. వారి పరిస్థితుల ప్రభావం బట్టి మనస్తత్వాలు మారుతుంటాయని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. జీవితం ఒకరిపై క్రూరత్వాన్ని మరొకరిపై దయ కురిపిస్తుందన్నారు. ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం వీరపథం కాట్రుమళై అని తెలిపారు. తమ సంస్థ నుంచి బలమైన కథా చిత్రాలను నిర్మించాలన్న విషయంలో ధృడంగా ఉంటామని నిర్మాత పేర్కొన్నారు. అదే విధంగా ఇందులో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేన్నారని, ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు చిత్రాన్ని కథను చెప్పిన దాని కంటే బాగా తెరకెక్కిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Stills from the upcoming psychological drama, #EerappadhanKaattruMazhai. Dir by @RBaadshah60574 Starring @act_vetri, @kishendas & @thedeepthie Produced by @BigPrintoffl DOP @AmaltomySB Music @raam_records#EKM @DoneChannel1 pic.twitter.com/yURJ49npxq — M.L.Prabhakaran. (@muniPrabhakaran) December 22, 2023 -
హీరోగా మారిన న్యాయవాది.. సినిమా రిలీజయ్యేది అప్పుడే!
ఏ రంగంలోనూ లేనటువంటి ఆసక్తి, ఆకర్షణ సినిమాకు ఉంది. అందుకే అవి ఇతర రంగాల్లోని ప్రతిభావంతులను తనవైపు లాక్కుంటుంది. అలా చాలా మంది వ్యాపారులు, ఇంజనీర్లు సినీ రంగంలోకి వస్తున్నారు. తాజాగా కార్తికేయన్ అనే యువ న్యాయవాది నిర్మాతగానూ, కథానాయకుడిగానూ రంగ ప్రవేశం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించి, థర్డ్ ఐ సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'సూరగన్'. సతీష్ గీత కుమార్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన ఇంతకుముందు పలు షార్ట్ ఫిలింస్ చేశారు. నటి సుభిక్ష, దియా, విన్సెంట్ అశోకన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ డిసెంబర్ 1వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. చిత్ర కథానాయకుడు కార్తికేయన్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి అందరూ అంకిత భావంతో పని చేశారన్నారు. విన్సెంట్ అశోకన్ చెప్పినట్లుగా తామందరం నటుడు విజయ్ కాంత్‌లా శ్రమించామని చెప్పారు. అందరూ వారి సొంత చిత్రంగా భావించి పని చేశారన్నారు. డబ్బు మాత్రమే ఉంటే చాలదని, ప్రేమ, శ్రమ, నమ్మకమే ఏదైనా చేయగలవని, అవి తమ టీమ్‌లో ఉన్నాయని చెప్పారు. అయితే కొందరి వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయని, తాము అలాంటివి అధిగమించినట్లు పేర్కొన్నారు. చదవండి: దిశా పటానిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? -
విశాల్ అలా అనడం కూడా సనాతనమే : నిర్మాత
తమిళసినిమా: సనాతనం గురించి రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు మరో రకం సనాతనం అని నిర్మాత, నటుడు కార్తికేయన్ వెంకట్రామన్ అన్నారు. ఈయన అంగ్రి ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎల్ఏల్పీ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎనక్కు ఎండే కిడైయాదు. నూతన దర్శకుడు విక్రమ్ రమేష్ కథా, కథనం, దర్శకత్వం వహిస్తూ కథానాయికుడిగా నటిస్తున్న ఇందులో నటి స్వయం సిద్ధా నాయకిగా నటించారు. దళపతి రత్నం ఛాయాగ్రహణం, కళాచరణ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 6వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, నటుడు కార్తికేయన్ వెంకట్రామన్ మాట్లాడుతూ తాను స్వతహాగా న్యాయవాదినని, అయితే సినిమాపై ఆసక్తితోనే నటుడినవ్వాలని థియేటర్ ఆర్టిస్టుగా శిక్షణ పొందినట్లు తెలిపారు. విక్రమ్ రమేష్ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర నిర్మాణం చేపట్టానని, పలు సమస్యలకు ఎదురొడ్డి నిలిచి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు యువకుల మధ్య చిన్న పోరాటమే ఈ చిత్ర కథ అని తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో నటుడు విశాల్ మూడు నాలుగు కోట్ల రూపాయలతో చిత్రం చేద్దామంటూ కొందరు వస్తున్నారని, అలా ఎవరూ రావద్దని అనడం కూడా ఒక రకమైన సనాతనమే అని అభిప్రాయపడ్డారు. ఇక్కడ అలా చెప్పే హక్కు ఎవరికీ లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
కొత్త టిగోర్ ఈవీని టీజ్ చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన కొత్త టిగోర్ ఈవీని లాంచ్ చేయడానికి ఒక రోజు(ఆగస్టు 18) ముందు దానికి సంబందించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ లో పోస్ట్ చేసిన వీడియోలో కొండ పైకి ఎక్కుతున్న నెక్సన్ ఈవీ కారుతో పాటు మరో ఎలక్ట్రిక్ కారు వెళుతునట్లు చూపించారు. అందులో చూపించిన మరో కారు కొత్త టిగోర్ ఈవీ జిప్ట్రాన్. ఈ జిప్ట్రాన్ టెక్నాలజీ టాటా నెక్సన్ ఈవితో ప్రారంభం అయ్యింది. టాటా మోటార్స్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టిగోర్ ఈవీ సెడాన్ ను ప్రవేశపెట్టింది. జిప్ట్రాన్ టెక్నాలజీతో కొత్త టిగోర్ ఈవీ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఆటోమేకర్ నమ్ముతోంది. జిప్ ట్రాన్ టెక్నాలజీ అధిక ఓల్టేజి 300+ ఓల్ట్ గల ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ప్రస్తుత టిగోర్ ఈవిలో ఉండే 72వీ ఎసీ ఇండక్షన్ టైప్ మోటార్ కంటే ఈ మోటార్ మరింత శక్తివంతమైనదని పేర్కొన్నారు. రాబోయే ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని భావిస్తున్నారు. జిప్ట్రాన్ ఈవీలు ఒకే ఛార్జ్ తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని టాటా మోటార్స్ గతంలో పేర్కొంది. డిజైన్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ కారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బంపర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావచ్చు. రాబోయే టిగోర్ ఈవి వైవిధ్యమైన రంగులలో లభించవచ్చు. క్యాబిన్ లోపల కూడా అవుట్ గోయింగ్ ఫ్లీట్-స్పెక్ టిగోర్ ఈవితో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. Fasten your seatbelts. The all-new EV from Tata Motors is here! #Ziptron #ZiptronElectricAscent #TataMotors #ElectricVehicle #TataMotorsEV pic.twitter.com/OKMuKrK4BD — Tata Motors Electric Mobility (@TatamotorsEV) August 11, 2021 -
‘దిశ’ నిర్దేశం నగరం నుంచే!
సాక్షి, సిటీబ్యూరో: ‘దిశ’ కేసులో కీలక పరిణామమైన చలాన్పల్లి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు గురువారం ముగ్గురు సభ్యులతో కూడిన ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్.వీఎస్ సిర్పుర్కార్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్. రేఖా బల్దౌతాలతో పాటు సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్‌లతో కూడిన ఈ బృందం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుందని, ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ట్రైమెన్ కమిషన్‌లో ఒకరైన కార్తికేయన్ గతంలో సిటీలోని సీఆర్పీఎఫ్ యూనిట్ ఐజీగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించారు. అప్పట్లో ఈ దర్యాప్తునూ హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో మానవబాంబు థాను దుశ్చర్యకు రాజీవ్ గాంధీ మృతి చెందారు. అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ భీష్మనారాయణ్ సింగ్ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించే బాధ్యతలను ఐపీఎస్ అధికారి డీఆర్ కార్తికేయన్‌కు అప్పగించారు. అప్పట్లో కార్తికేయన్ సెంట్రల్ సర్వీసెస్‌లో ఉండి చంద్రాయణగుట్ట కేంద్రంగా పని చేసే సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు నేతృత్వం వహిస్తున్నారు. 1991 మే 22న అప్పటి సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కేపీఎస్ గిల్, సీబీఐ డైరెక్టర్ విజయకరణ్ ఆయనకు ఫోన్ చేసి, సిట్‌కు నేతృత్వం వహించమని కోరారు. అనంతరం కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడంతో కార్తికేయన్ బాధ్యతలు స్వీకరించారు. సిట్ కోసం చెన్నైలోని ‘మల్లిగై’ భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం కేటాయించినా కార్తికేయన్ మాత్రం హైదరాబాద్‌ను విడిచిపోవాలని భావించలేదు. అందుకే సీఆర్పీఎఫ్ హైదరాబాద్ ఐజీగా కొనసాగేలా ఉత్తర్వులు పొందారు. అంతే కాకుండా, రాజీవ్‌గాంధీని హత్య చేయడానికి రంగంలోకి దిగిన ఎల్టీటీఈ బృందం శ్రీలంకలో ఉన్న ఆ సంస్థ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ అనుచర గణంతో ప్రైవేట్ రేడియోలకు సంబంధించిన వైర్లెస్ల ద్వారా సంప్రదింపులు జరిపేవారు. ఇవన్నీ పూర్తిగా కోడ్ భాషలో ఉండేవి. హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పరారీలో ఉన్న కీలక నిందితులు శివరాసన్, శుభలను పట్టుకోవాలంటే వారు వినియోగిస్తున్న రేడియో స్టేషన్ ఉనికిని కనిపెట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలతో పాటు హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబొరేటరీస్‌కు చెందిన నిపుణులను చెన్నై తీసుకెళ్లారు. మరోపక్క రేడియో సిగ్నల్స్‌ను గుర్తించడానికి అవసరమైన హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ రిసీవర్లను సైతం హైదరాబాద్ నుంచే ఖరీదు చేసింది. 1991 మే లో సిట్‌కు సారథ్యం వహించిన తర్వాత కొన్ని నెలల పాటు హైదరాబాద్‌లోని తన కార్యాలయం, కుటుంబం వద్దకు రావడం మర్చిపోయిన కార్తికేయన్ ఆగస్టులో ఒకసారి వచ్చారు. అప్పుడే సిట్ బలగాలు శివరాసన్, శుభ తదితరుల ఆచూకీ కనుగొన్నాయి. చెన్నై సహా పలు ప్రాంతాల్లో తిరిగిన వీరు బెంగళూరు చేరుకున్నారు. అక్కడి కోననకుంటెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రహస్య స్థావం ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై సిట్, ఎన్ఎస్జీ బలగాలు దాడికి ఉపక్రమించడంతో అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు కార్తికేయన్ హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయినా... నిందితులు సైనైడ్ వినియోగించడంతో సజీవంగా చిక్కలేదు. ఆ కేసు దర్యాప్తులో సిట్ వందల సంఖ్యలో భౌతిక సాక్ష్యాలను సేకరించింది. వీటిలో అనేకం హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కు వచ్చాయి. వీటిని విశ్లేషించిన నిపుణులు చార్జ్‌షీట్ దాఖలుకు అవసరమైన నివేదికలు అందించారు. మరోపక్క మానవబాంబుగా మారి ఛిద్రమైపోయిన థాను శరీర భాగాలుగా అనుమానించిన తల, ఎడమ చేయి, రెండు తొడలు, కాళ్లు, మరికొన్ని చర్మపు ముక్కలను నగరంలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించారు. ఇక్కడి నిపుణులు పరీక్షలు పూర్తి చేసి అవి ఒకే వ్యక్తికి చెందినవిగా నిర్థారించారు. అనేక నివేదిక ఆధారంగా సిట్ అధికారులు 1992 మే 20న పది వేల పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ తతంగం మొత్తం పూర్తయ్యే వరకు కార్తికేయన్ హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ ఐజీగానే ఉన్నారు. -
రన్నరప్ కార్తికేయన్ మురళి
న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ కార్తికేయన్ మురళి జిబ్రాల్టర్ అంతర్జాతీయ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల కార్తికేయన్ మురళి మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కార్తికేయన్ చివరి ఐదు రౌండ్లలో ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు లారినో నిటో డేవిడ్ (స్పెయిన్), ఫాబియన్ లిబిస్జెవ్స్కీ (ఫ్రాన్స్), రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్), మాక్సిమ్ మత్లకోవ్ (రష్యా), మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)లను ఓడించడం విశేషం. ఇందులో మమెదోవ్, మాక్సిమ్, లాగ్రెవ్ ఎలోరేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉంది. రన్నరప్‌గా నిలిచిన కార్తికేయన్‌కు 20 వేల పౌండ్లు (రూ. 18 లక్షల 61 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 8.5 పాయింట్లతో ఆర్తమియెవ్ వ్లాదిస్లావ్ (రష్యా) చాంపియన్‌గా నిలిచాడు. 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో ఎనిమిదో స్థానాన్ని సంపాదించాడు. అంతేకాకుండా టోర్నీ మొత్తంలో ఒక్క గేమ్‌లో కూడా అతను ఓడిపోలేదు. మొత్తం పది గేముల్లో లలిత్ ఎనిమిదింటిని గ్రాండ్మాస్టర్లతో ఆడాడు. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్), సేతురామన్ (భారత్), గవైన్ జోన్స్ (ఇంగ్లండ్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), సో వెస్లీ (అమెరికా), ఇవాన్ సారిచ్ (క్రొయేషియా)లతో ‘డ్రా’ చేసుకోగా... ఇవాన్ చెపరినోవ్ (జార్జియా), అలెగ్జాండర్ ఇండిక్ (సెర్బియా)లపై గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి ఆరు పాయింట్లతో 49వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో 76వ ర్యాంక్‌లో నిలిచారు. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి ఆరు పాయింట్లతో 47వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సీఆర్జీ కృష్ణ 5.5 పాయింట్లతో 82వ ర్యాంక్‌ను పొందాడు. ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు సేతురామన్ (భారత్), కాటరీనా లాగ్నో (రష్యా)లపై సీఆర్జీ కృష్ణ గెలుపొందినా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్‌కు అవసరమైన చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను పొందలేకపోయాడు. టోర్నీ మొత్తంలో 150 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో 94 మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. భారత్ నుంచి 26వ మంది పోటీపడ్డారు. -
విలన్ పాత్రకి ఎవరి స్ఫూర్తీ లేదు – ప్రభుదేవా
‘‘ఎంటర్టైనింగ్, మాస్ అంశాలతో తెరకెక్కిన మంచి చిత్రం ‘మెర్క్యురి’. నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. విలన్‌గా చేయడం ఎగ్జయిట్మెంట్ అనిపించింది. ఆ పాత్ర చేయడానికి ఎవరి స్ఫూర్తీ లేదు. కార్తీక్ సుబ్బరాజ్‌పై నమ్మకంతోనే చేశా. సినిమా చూస్తున్నంత సేపు పాత్రలు మాత్రమే కనపడతాయి’’ అని ప్రభుదేవా అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యురి’. పెన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలింస్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలవుతోంది. తెలుగులో కె.ఎఫ్.సి. ప్రొడక్షన్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ– ‘‘యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. కమల్‌హాసన్‌గారి ‘పుష్పకవిమానం’ తర్వాత వస్తోన్న మూకీ సినిమా ‘మెర్క్యురి’. కమర్షియల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఇండియన్ సినిమాను తర్వాతి లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘పిజ్జా’ తెలుగులోనూ మంచి హిట్ అయింది. ‘మెర్క్యురి’ లాంటి వైవిధ్యమైన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇందులో పాటలు, డ్యాన్సులు ఉండవు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి నందిని భర్త కార్తికేయన్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం చెన్నైలోని ఓ లాడ్జిలో కార్తికేయన్ మరణించగా, మంగళవారం లాడ్జి సిబ్బంది అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అత్తమామలే కారణమని ఆయన సూసైడ్ నోట్లో రాశాడు. కాగా కార్తికేయన్ చావుకు తన తల్లిదండ్రులు కారణం కాదని నందిని చెబుతోంది. ఆయనకు అవినీతి వ్యాపార కార్యకలాపాలతో సంబంధముందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను ఈ విషయం గురించి కార్తికేయన్‌ను నిలదీయగా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, దీంతో తాను తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని చెప్పింది. కార్తికేయన్‌కు వివాహేతర సంబంధముందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని చెప్పింది. ఈ విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేదని, తన భర్త దుబాయ్‌కు వెళ్లాడని అబద్ధం చెప్పానని తెలిపింది. ఈ రహస్యాలన్నింటినీ తనలో దాచుకున్నానని, తన తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయాలను బయట పెడుతున్నానని నందిని చెప్పింది. తన భర్తకు ఆర్థిక సాయం కూడా చేశానని, సమస్యలు పరిష్కారమయ్యాక మళ్లీ కలిసుందామని చెప్పానని తెలిపింది. నందిని (32) శర్వాణన్ మీనాక్షి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. కార్తికేయన్ ఓ జిమ్‌ను నిర్వహించేవాడు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సమస్యలు వచ్చాయి. -
యువతి శవంపై కూర్చొని క్షుద్రపూజలు
కేకే.నగర్ : పెరంబలూరు ఎంఎం.నగర్లో నివసిస్తున్న మంత్రవాది కార్తికేయన్(32) ఆత్మలతో మాట్లాడేందుకు క్షుద్ర పూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతడు మరొక క్షుద్ర మాంత్రికుడు సతీష్ సహాయంతో ఆత్మహత్య చేసుకున్న తేనాంపేట ఎంఎం.గార్డెన్‌కు చెందిన యువతి అభిరామి మృతదేహాన్ని స్మశానం నుంచి వెలికితీసి కారులో పెరంబలూరుకు పంపినట్లు తెలుస్తోంది. ఈ మృతదేహంపై కూర్చొని కార్తికేయన్ 45 రోజులకు పైగా అర్ధరాత్రి పూజలు జరిపారు. ఈ క్రమంలో అభిరామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పెరంబలూరు పోలీసులు కార్తికేయన్, అతని భార్య నజీమా సహా ఆరుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం అభిరామి మృతదేహానికి పెరంబలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పునః పోస్టుమార్టం జరిపారు. అనంతరం అభిరామి తల్లి కామాక్షి, అన్న తిరువరంగన్లు మృతదేహాన్ని తీసుకుని ఆత్తూరు రోడ్డుపై గల స్మశానంలో అంత్యక్రియలు జరిపి అస్థికలను తీసుకుని చెన్నై బయలుదేరారు. తమ కుమార్తెకు కలిగిన దుస్థితిని తలచుకుని అభిరామి తల్లి బోరున విలపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె అన్న కన్నీటితో ప్రార్థించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. -
యువతుల కోసం వశీకరణ కాటుక
చెన్నై: తమిళనాడు పెరంబలూరులో సంచలనం సృష్టించిన క్షుద్రపూజల కార్తికేయన్ ఉదంతంలో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షుద్రపూజలకు పాల్పడిన అతడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెరంబలూరు ఎంఎం నగర్‌కు చెందిన కార్తికేయన్ (32) తన ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (చదవండి...పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా) ఇలా వుండగా పోలీసులు తాజాగా జరిపిన విచారణలో ఇతగాడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు సమాచారం. కాగా ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్‌ను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే అతడు నివాసం ఉంటున్న ఇంట్లో యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
తమిళనాడులో నరబలి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరంబలూరులో ఓ ఇంట్లో యువతి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఒకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా పూర్తిగా కుళ్లిన యువతి మృతదేహం పడి ఉంది. మృతదేహం చుట్టూ, ఇతర గదుల్లో పూజాసామగ్రి చిందరవందరగా పడి ఉంది. ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్ అనే అతడిని తొమ్మిదిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కనుగొన్న ఇల్లు ఎవరిదో తెలియరాలేదు. కార్తికేయన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య
టీనగర్: తురైపాక్కంలో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. మహాబలిపురం సమీపంలోగల బకింగ్‌హామ్ కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. తురైపాక్కంలోగల టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్ కార్తికేయన్(31). తురైపాక్కం పాత మహాబలిపురం రోడ్డులో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. రెండవ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన కార్తికేయన్ తర్వాత ఇంటికి చేరుకోలేదు. దీనిపై అతని తల్లి తురైపాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహాబలిపురం సమీపంలోని తెర్కుపేట ప్రాంతంలోని బకింగ్‌హాం కాలువలో కార్తికేయన్ మృతదేహం కనిపించింది. మహాబలిపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్తికేయన్ మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. హత్యకు గురైన కార్తికేయన్ సొంతవూరు నైవేలి. ఇతడు కొన్ని రోజుల క్రితం స్నేహితులతో అద్దె ఇంట్లో బసచేశాడు. ఈ తర్వాత వేరొక ఇంట్లో అద్దెకు ఉండేందుకు రూ.50 వేలను తల్లి వద్ద తీసుకువచ్చాడు. ఆ తర్వాతనే ఈ హత్య జరిగింది. ఇలాఉండగా స్నేహితుని కోసం రూ.50 వేలను ఇంటి నుంచి కార్తికేయన్ తీసుకువచ్చాడని, నగదు కోసం ఈ హత్య జరిగి ఉండొచ్చని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జపాన్ సూపర్ ఫార్ములాకు సిద్ధంగా ఉన్నా
వచ్చే నెల జపాన్ లో జరగనున్న సూపర్ ఫార్ములా రేస్ కోసం సిద్ధమవుతున్నట్లు భారత ఫార్ములా వన్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ తెలిపాడు. తమిళనాడులో జరుగుతున్న ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన కార్తికేయన్ ఎప్పటి లానే.. భారత్ లో ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసి.. జపాన్ లో రేసింగ్ ప్రాక్టీస్ కు వెళుతున్నట్లు వివరించాడు. క్విజ్ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించిన కార్తికేయన్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించాడు. ఏరంగంలో అయినా రాణించాలంటే పట్టుదలగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించాడు. -
కార్తికేయన్‌కు మూడో స్థానం
సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ సుజుకా: ఆరంభంలో కాస్త వెనుకబడ్డా కీలక సమయంలో పుంజుకున్న భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్... సుజుకా సర్క్యూట్లో ఆదివారం జరిగిన సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచాడు. 43 ల్యాప్‌ల ఈ రేసులో కార్తికేయన్ 1:14.29 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరాడు. ఫార్ములావన్ కాకుండా సింగిల్ సీటర్ సిరీస్‌లో పొడియం (టాప్-3) చేరడం భారత డ్రైవర్‌కు ఇదే తొలిసారి. రెండో గ్రిడ్ నుంచి ప్రధాన రేసును మొదలుపెట్టిన కార్తికేయన్ తొలి ల్యాప్ ముగిసేసరికి మూడు స్థానాలు వెనుకబడ్డాడు. అయితే తర్వాత అద్భుతమైన టైమింగ్‌తో రేసులో దూసుకుపోయాడు. ఆండ్రీ లోటెరర్ 1:14.01 సెకన్లతో అగ్రస్థానంలో నిలువగా, కజుకి నకజిమా 1:14.10 సెకన్లతో రెండో స్థానాన్ని సాధించాడు. ఈ విజయంపై కార్తికేయన్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. -
నిర్మాత దర్శకుడినెప్పుడూ మెచ్చుకోడు
చిత్ర నిర్మాత ఎప్పుడూ మెచ్చుకోరని యువ దర్శకుడు జయం రాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం కార్తికేయన్. కలర్ స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం.చందు దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీత బాణీలందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ నిర్మాత తండ్రి అయినా ఆ చిత్ర దర్శకుడిని మెచ్చుకునే ప్రశ్నే ఉండదన్నారు. చిత్ర బడ్జెట్ పెంచావ్, నిర్మాణంలో జాప్యం అయ్యింది వంటి విమర్శలు దర్శకుడు భరించాల్సిందేనని చెప్పారు. అలాంటిది ఈ కార్తికేయన్ చిత్ర నిర్మాత, దర్శకుడిని అభినందించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. చిత్ర హీరో నిఖిల్ తెలుగులో పది చిత్రాలకు పైగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, హీరోయిన్ స్వాతి తమిళ పరిశ్రమకు సుపరిచితురాలని పేర్కొన్నారు. తన తొలి చిత్రం జయంలో కార్తికేయన్ వేలాయుధం ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడీ చిత్రమే కార్తికేయన్ పేరుతో రూపొందుతోందని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు జయంరాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటి తులసి, స్వాతి, నిఖిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
కార్తికేయ మూవీ స్టిల్స్
-
కార్తికేయన్‌కు ఆరో స్థానం
సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ ఫుజి(జపాన్): భారత స్టార్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ రెండో రౌండ్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఆదివారం ఫుజి స్పీడ్‌వేలో జరిగిన 35 ల్యాప్‌ల రేస్‌లో కార్తికేయన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆదివారం ఉదయం జరిగిన 25 ల్యాప్‌ల స్ప్రింట్ రేస్‌లో గ్రిడ్‌లో తొమ్మిదో స్థానం నుంచి రేస్ ప్రారంభించిన ఈ మాజీ ఫార్ములావన్ డ్రైవర్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని జట్టు సహచరుడు జేపీ డి ఒలివెరా(బ్రెజిల్) ఉదయం జరిగిన రేస్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మధ్యాహ్నం జరిగే రెండో రేస్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచాడు. -
నిఖిల్, స్వాతి జంటగా కార్తికేయన్
టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ తొలిసారి కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈయన నటి స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం కార్తికేయన్. తెలుగులో కార్తికేయ పేరుతో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని మాగ్నాపసిని ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత బి వి శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. కథ, దర్శకత్వం బాధ్యతలను ఎం.చందు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ వైవిధ్యభరిత కథా కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కార్తికేయన్ అని తెలిపారు. చిత్ర షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తి అయ్యిందని చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ భాషాభేదం లేకుండా ఏ ప్రాంతానికి చెందిన కళాకారులైనా తమిళ చిత్ర పరిశ్రమ ఆదరిస్తోందన్నారు. తాను ఈ కార్తికేయన్ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని మే చివరి వారంలో గానీ, జూన్ తొలి వారంలో గానీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
పెళ్లిమీద పెళ్లికి సిద్ధం.. కటకటాలపాలైన పెళ్లికొడుకు
చెన్నై, సాక్షి ప్రతినిధి : చట్టబద్ధంగా ప్రేమ పెళ్లి చేసుకున్న మరుసటి రోజే సంప్రదాయబద్ధమైన పెళ్లికి సిద్ధమై పీటలపై కూచున్నాడు. మొదటి భార్య రంగప్రవేశంతో ఈ మాయదారి పెళ్లికొడుకు కటకటాలపాలయ్యూడు. ఈ సంఘటన కాంచీపురంలో గురువారం జరిగింది. చెన్నై నంగనల్లూరుకు చెందిన రంగనాయుడు, మల్లిక దంపతుల కుమారుడు కార్తికేయన్ (25) చెన్నై అడయారు ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. పునిదతోమైయార్ మలైకు చెందిన కాల్‌సెంటర్ ఉద్యోగిని ఫిలోమినా (24)తో ఆరేళ్లు ప్రేమాయణం నడిపాడు. ప్రేయసి ఒత్తిడితో ఈనెల 6న సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు. కార్తికేయన్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న ఫిలోమినా తమ పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని భర్త కార్తికేయన్‌తో వాగ్వాదానికి దిగింది. ఆమె కోరిక మేరకు ఈనెల 13వ తేదీ చెన్నై రాయపురంలోని సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందారు. మరోవైపు తిరువణ్ణామలై జల్లా సెయ్యూరు తాలూకాకు చెందిన యువతి (22)తో కార్తికేయన్ రెండో వివాహానికి సిద్ధమయ్యూడు. ఈనెల13వ తేదీ సాయంత్రం తన తల్లిదండ్రులు, బంధుమిత్ర పరి వారంతో కాంచీపురంలోని కల్యాణమండపానికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి కోలాహలంగా రిసెప్షన్ జరుపుకున్నాడు. గురువారం ఉదయం 7.30 - 9.30 గంటల మధ్య ముహూర్తం నిర్ణరుుంచారు. విషయం తెలుసుకున్న భార్య ఫిలోమినా ఉదయం 6 గంటలకు కంచికి చేరుకుని పోలీసులకు తన వద్దనున్న ఆధారాలతో కార్తికేయన్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులను వెంటపెట్టుకుని కల్యాణ మండపంలోకి ప్రవేశించి అందరి సమక్షంలో కార్తికేయన్‌ను నిలదీసింది. ఈ హఠాత్పరిణామంతో హతాశుడైన కార్తికేయన్ తనకు ఫిలోమినాతో పెళ్లరుున సంగతిని అంగీకరించాడు. మరికొద్ది సేపట్లో జరగాల్సిన పెళ్లి నిలిచిపోరుుంది. కార్తికేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తనను మోసగించిన కార్తికేయన్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పెళ్లికుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఫాస్ట్‌గా పాస్‌పోర్ట్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు అమలు ద్వారా పౌరులకు సకాలంలో పారదర్శక సేవలను అందించగలుగుతున్నామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి పీఎస్. కార్తికేయన్ తెలిపా రు. తద్వారా పోలీసు పరిశీలన సమయాన్ని మినహాయిస్తే 14 రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ను పంపిణీ చేయగలుగుతున్నామని వెల్లడించా రు. మంగళవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు ద్వారా 11 లక్షల పాస్‌పోర్ట్‌లను పంపిణీ చేశామని, ఒక్క జూలైలోనే 40 వేల మందికి పంపించామని వివరించారు. పౌరుల పట్ల స్నేహయుతంగా వ్యవహరించే చర్యల్లో భాగంగా పాస్‌పోర్ట్ మేళాలను నిర్వహించడం ద్వారా రద్దీని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. పాస్‌పోర్ట్ అర్జీదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా నగరంలోని లాల్బాగ్, మారతహళ్లి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వసతులను పెంచామని తెలిపారు. లాల్‌బాగ్‌లో 45 రోజుల్లో, మారతహళ్లిలో 30 రోజుల్లో అపాయింట్మెంట్లను విడుదల చేస్తునామని చెప్పారు. ఈ రెండు కేంద్రాల్లో ఏటీఎంలను నెలకొల్పడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పోలీసు పరిశీలన కోసం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ పరిధిలోని 102 పోలీసు స్టేషన్లలో ‘డెరైక్ట్ టు ఠాణా’ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పౌరుల ప్రయోజనార్థం తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలు ప్రతిపాదనలు చేశా మని ఆయన వివరించారు. ఇందులోని ముఖ్యాంశాలు.. = పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ఏటా 30 వేల అదనపు అపాయింట్మెంట్లకు అవకాశం ఉంటుంది. = పోలీసు శాఖ సహకారంతో పోలీసు పరిశీలన కాలాన్ని తగ్గించాలి. దీని వల్ల పాస్‌పోర్ట్ అందించే కాలాన్ని బాగా తగ్గించడానికి వీలవుతుంది. = కర్ణాటక ఈ-గవర్నెన్స్ శాఖ సహకారంతో బెంగళూరు వన్, కర్ణాటక వన్ కేంద్రాల సేవలను కూడా వినియోగించుకోవాలి.