కార్తికేయన్‌కు ఆరో స్థానం | karthikeyan in sixth place positon | Sakshi
Sakshi News home page

కార్తికేయన్‌కు ఆరో స్థానం

Published Mon, May 19 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

భారత స్టార్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. ఆదివారం ఫుజి స్పీడ్‌వేలో జరిగిన 35 ల్యాప్‌ల రేస్‌లో కార్తికేయన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని పాయింట్ల ఖాతా తెరిచాడు.

సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్
 ఫుజి(జపాన్): భారత స్టార్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. ఆదివారం ఫుజి స్పీడ్‌వేలో జరిగిన 35 ల్యాప్‌ల రేస్‌లో కార్తికేయన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని పాయింట్ల ఖాతా తెరిచాడు.
 
 ఆదివారం ఉదయం జరిగిన 25 ల్యాప్‌ల స్ప్రింట్ రేస్‌లో గ్రిడ్‌లో తొమ్మిదో స్థానం నుంచి రేస్ ప్రారంభించిన ఈ మాజీ ఫార్ములావన్ డ్రైవర్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని జట్టు సహచరుడు జేపీ డి ఒలివెరా(బ్రెజిల్) ఉదయం జరిగిన రేస్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మధ్యాహ్నం జరిగే రెండో రేస్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement