ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం! | Kollywood Producer I B Karthikeyan latest Movie | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం!

Dec 22 2023 5:02 PM | Updated on Dec 22 2023 7:30 PM

Kollywood Producer I B Karthikeyan latest Movie   - Sakshi

గతంలో పలు విజయవంతమైన చిత్రాలను తీసుకొచ్చిన బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత ఐబీ కార్తికేయన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం వీరపథం కాట్రుమళై. ఈ చిత్రం దేర్‌ ప్రాంతాలకు చెందిన ముగ్గురి జీవితాలను ఆవిష్కరించేదిగా ఉంటుంది. దీని ద్వారా సలీం ఆర్‌ బాషా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన ఇంతకుముందు మయక్కం అదు మాయం అని షార్ట్‌ ఫిలింను రూపొందించారు. జీవి చిత్రం ఫేమ్‌ వెట్రి, ముదలుమ్‌ నీ ముడివుమ్‌ నీ చిత్రం ఫేమ్‌ కిషన్‌ దాస్‌ హీరోలుగా నటిస్తురన్నారు. ఈ చిత్రంలో దీప్తి ఒరండేలు హీరోయిన్‌గా కనిపించనుంది. 

ఈ చిత్ర దర్శకుడు సలీం ఆర్‌ బాషా మాట్లాడుతూ ఇది వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రమన్నారు. వారి భావాలు, ఎదుర్కొనే సమస్యల సమాహారంగా కథ ఉంటుందన్నారు. ఇక్కడ మనుషులు పూర్తిగా మంచి వారిగా ఉండరు, పూర్తిగా చెడ్డవారు గాను ఉండరని పేర్కొన్నారు. వారి పరిస్థితుల ప్రభావం బట్టి మనస్తత్వాలు మారుతుంటాయని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. జీవితం ఒకరిపై క్రూరత్వాన్ని మరొకరిపై దయ కురిపిస్తుందన్నారు.

ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం వీరపథం కాట్రుమళై అని తెలిపారు. తమ సంస్థ నుంచి బలమైన కథా చిత్రాలను నిర్మించాలన్న విషయంలో ధృడంగా ఉంటామని నిర్మాత పేర్కొన్నారు. అదే విధంగా ఇందులో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేన్నారని, ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు చిత్రాన్ని కథను చెప్పిన దాని కంటే బాగా తెరకెక్కిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement