కమల్‌ క్రేజీ ప్రాజెక్ట్.. ఇక శుభం కార్డ్ పడినట్లేనా? | Kollywood Super Star Kamal Haasan Movie Makers Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Kamal Haasan: కమల్‌ క్రేజీ ప్రాజెక్ట్.. ఇక శుభం కార్డ్ పడినట్లేనా?

Published Thu, Jan 25 2024 6:48 PM | Last Updated on Thu, Jan 25 2024 7:32 PM

Kollywood Super Star Kamal Haasan Movie Makers Tweet Goes Viral - Sakshi

గతేడాది విక్రమ్‌ సినిమాతో హిట్‌ కొట్టిన కమల్‌ హాసన్‌ అదే జోరు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం ప్రాజెక్ట్ థగ్‌ లైఫ్‌తో బిజీగా ఉన్నారు.  కమల్– మణిరత్నం కాంబోలో ‘నాయగన్‌’–1987 (నాయకుడు) తర్వాత 37 ఏళ్లకు రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో పాటు కమల్ హాసన్‌ మరో ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా దీనిపై నెట్టింట మరో చర్చ మొదలైంది. అదేంటో ఓసారి తెలుసుకుందాం. 

కమల్‌కు చెందిన నిర్మాణసంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై హెచ్‌.వినోద్‌ దర్శకుడిగా గతేడాది ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. కమల్‌హాసన్‌ 233వ ప్రాజెక్ట్‌గా ఇది ప్రచారంలో ఉంది. కమల్‌ కోసం వినోద్‌ పవర్‌ఫుల్‌ పాత్ర సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలో తమ బ్యానర్‌లో రానున్న చిత్రాలను ఉద్దేశించి రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ట్విటర్‌ పోస్ట్‌ ఆ వార్తలకు బలం చేకూర్చుతోంది. ట్విటర్‌లో రాస్తూ..' థగ్‌ లైఫ్‌’, కమల్‌ 237, శివకార్తికేయన్‌ 21, శింబు 48 త్వరలో తమ బ్యానర్‌ నుంచి విడుదల కానున్నట్లు వెల్లడించింది. అయితే ఈ లిస్ట్‌లో కమల్‌-233 ప్రాజెక్ట్‌  లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ  నెట్టింట తెగ వైరలవుతోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై చిత్రబృందం, వినోద్‌ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement