స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. ! | Kollywood Star Hero Ajith Kumar latest Movie with Mythri Movie Makers | Sakshi
Sakshi News home page

Ajith Kumar: టాలీవుడ్ ‍అగ్ర నిర్మాణ సంస్థతో జతకట్టనున్న అజిత్!

Published Mon, Apr 1 2024 2:54 PM | Last Updated on Mon, Apr 1 2024 3:06 PM

Kollywood Star Hero Ajith Kumar latest Movie with Mythri Movie Makers - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్‌గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

దీంతో అజిత్‌ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్‌ హీరోగా మార్క్‌ ఆంటోని వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే టైటిల్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్‌ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్‌ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్‌ ఇంతకుముందు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్‌ మళ్లీ ఇప్పుడు గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement