సినిమా కథల్లోని పాత్రలకు జీవం పోసేది నటీనటులే! అయితే ఆహార్యం, తీరుతెన్నులతో ఆ ప్రాతకు ఒక గ్రామర్, గ్లామర్‌ను క్రియేట్ చేసి, నటీనటుల పనిని తేలిక చేసేది మాత్రం స్టయిలిస్ట్‌లే! అలా తెర వెనుక ఆ పాత్రను అద్భుతంగా పోషిస్తున్న స్టయిలిస్ట్.. మాలినీ కార్తికేయన్.
మాలినీ కార్తికేయన్‌కు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పుడు తనే సినిమా చూసినా.. అందులోని క్యారెక్టర్స్‌ని ఫలానా పాత్ర ఇలా ఉంటే బాగుండు.. అలా ఉంటే బాగుండు.. అంటూ విశ్లేషించేది. ఆ అలవాటే ఆమెకు ఫ్యాషన్‌పై మక్కువ కలిగేలా చేసింది. 2018లో ఎన్‌ఐఎఫ్‌టీ చెన్నైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ఫ్యాషన్ డిజైనర్ ఏకా లఖానీ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. మొదట ‘చెక్క చీవంద వానం’ సినిమాకు పనిచేసింది. కాని టైటిల్ కార్డ్ పడింది మాత్రం ‘వానం కొండాడట్టుం’ చిత్రంతో! నటీనటులను అందంగా తీర్చిదిద్దే మాలిని నైపుణ్యాన్ని మెచ్చిన సినీ ఇండస్ట్రీ అనతికాలంలోనే ఆమె చేతినిండా ప్రాజెక్ట్స్‌ను పెట్టింది.
‘ఆదిత్య వర్మ’, ‘99 సాంగ్స్’, ‘డిమోంటి కాలని 2’ సినిమాలకు, ‘క్వీన్’, ‘జెస్టినేషన్ అన్‌నోన్’ సిరీస్‌లకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది. ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కావటమే కాదు, అతిచిన్న వయసులోనే పెద్దపెద్ద స్టార్స్‌తో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది. అదే ‘పొన్నియిన్ సెల్వన్ ’ సినిమా. దానికి ఆమె వార్డ్‌రోబ్ సూపర్‌వైజర్‌గా పనిచేసింది. ఆ సినిమా సెట్స్ మీదున్నప్పుడే కరోనా వ్యాపించింది. సంప్రదింపులు, నటీనటుల లుక్ టెస్ట్‌లు.. ఇలా ప్రతిదీ జూమ్‌లోనే! తన అసైన్‌మెంట్స్ అన్నిటినీ అలాగే షెడ్యూల్ చేసుకుంది మాలిని.
కావలసిన కాస్ట్యూమ్స్‌ని కొరియర్ చేసింది. షూటింగ్ స్పాట్‌లోకి కొంతమందినే అనుమతించడంతో ఆ పనిభారాన్నీ మోసింది. అయితే దాన్నో కష్టంగా కాక.. ఒక అనుభవ జ్ఞానంగా మలచుకున్నానంటుంది మాలిని. ఆ సినిమాకు పనిచేయడం వల్లే ఆమెకు త్రిష, శోభితా ధూళిపాళకు స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది. అంతేకాదు రమ్యకృష్ణ, ఐశ్వర్యా అర్జున్, ప్రియా భవానీ శంకర్ లాంటి సెలబ్రిటీలు కూడా ఆమెను స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకునే స్థాయికి వెళ్లింది. విజయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, సిద్ధార్థ్ వంటి మేల్ సెలబ్రిటీ స్ కూడా మాలిని స్టయిలింగ్‌లో మ్యాన్లీ లుక్‌తో అభిమానులను అలరించారు.
‘లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. వేసుకున్న కాస్ట్యూమ్స్ కంఫర్ట్‌గా ఉంటేనే అందం.. ఆత్మవిశ్వాసం!
– మాలినీ కార్తికేయన్.
Comments
Please login to add a commentAdd a comment