పెళ్లిమీద పెళ్లికి సిద్ధం.. కటకటాలపాలైన పెళ్లికొడుకు
Published Fri, Nov 15 2013 3:50 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : చట్టబద్ధంగా ప్రేమ పెళ్లి చేసుకున్న మరుసటి రోజే సంప్రదాయబద్ధమైన పెళ్లికి సిద్ధమై పీటలపై కూచున్నాడు. మొదటి భార్య రంగప్రవేశంతో ఈ మాయదారి పెళ్లికొడుకు కటకటాలపాలయ్యూడు. ఈ సంఘటన కాంచీపురంలో గురువారం జరిగింది. చెన్నై నంగనల్లూరుకు చెందిన రంగనాయుడు, మల్లిక దంపతుల కుమారుడు కార్తికేయన్ (25) చెన్నై అడయారు ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. పునిదతోమైయార్ మలైకు చెందిన కాల్‌సెంటర్ ఉద్యోగిని ఫిలోమినా (24)తో ఆరేళ్లు ప్రేమాయణం నడిపాడు. ప్రేయసి ఒత్తిడితో ఈనెల 6న సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు. కార్తికేయన్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న ఫిలోమినా తమ పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని భర్త కార్తికేయన్‌తో వాగ్వాదానికి దిగింది. ఆమె కోరిక మేరకు ఈనెల 13వ తేదీ చెన్నై రాయపురంలోని సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందారు.
మరోవైపు తిరువణ్ణామలై జల్లా సెయ్యూరు తాలూకాకు చెందిన యువతి (22)తో కార్తికేయన్ రెండో వివాహానికి సిద్ధమయ్యూడు. ఈనెల13వ తేదీ సాయంత్రం తన తల్లిదండ్రులు, బంధుమిత్ర పరి వారంతో కాంచీపురంలోని కల్యాణమండపానికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి కోలాహలంగా రిసెప్షన్ జరుపుకున్నాడు. గురువారం ఉదయం 7.30 - 9.30 గంటల మధ్య ముహూర్తం నిర్ణరుుంచారు. విషయం తెలుసుకున్న భార్య ఫిలోమినా ఉదయం 6 గంటలకు కంచికి చేరుకుని పోలీసులకు తన వద్దనున్న ఆధారాలతో కార్తికేయన్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులను వెంటపెట్టుకుని కల్యాణ మండపంలోకి ప్రవేశించి అందరి సమక్షంలో కార్తికేయన్‌ను నిలదీసింది. ఈ హఠాత్పరిణామంతో హతాశుడైన కార్తికేయన్ తనకు ఫిలోమినాతో పెళ్లరుున సంగతిని అంగీకరించాడు. మరికొద్ది సేపట్లో జరగాల్సిన పెళ్లి నిలిచిపోరుుంది. కార్తికేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తనను మోసగించిన కార్తికేయన్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పెళ్లికుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Advertisement