హీరోగా మారిన న్యాయవాది.. సినిమా రిలీజయ్యేది అప్పుడే! | Lawyer Karthikeyan Turns Hero for Sooragan Movie | Sakshi
Sakshi News home page

నటుడిగా అవతారమెత్తిన న్యాయవాది

Nov 24 2023 8:10 AM | Updated on Nov 24 2023 8:10 AM

Lawyer Karthikeyan Turns Hero for Sooragan Movie - Sakshi

తాజాగా కార్తికేయన్‌ అనే యువ న్యాయవాది నిర్మాతగానూ, కథానాయకుడిగానూ రంగ ప్రవేశం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించి, థర్డ్‌ ఐ సినీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిం

ఏ రంగంలోనూ లేనటువంటి ఆసక్తి, ఆకర్షణ సినిమాకు ఉంది. అందుకే అవి ఇతర రంగాల్లోని ప్రతిభావంతులను తనవైపు లాక్కుంటుంది. అలా చాలా మంది వ్యాపారులు, ఇంజనీర్లు సినీ రంగంలోకి వస్తున్నారు. తాజాగా కార్తికేయన్‌ అనే యువ న్యాయవాది నిర్మాతగానూ, కథానాయకుడిగానూ రంగ ప్రవేశం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించి, థర్డ్‌ ఐ సినీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం 'సూరగన్‌'. సతీష్‌ గీత కుమార్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన ఇంతకుముందు పలు షార్ట్‌ ఫిలింస్‌ చేశారు.

నటి సుభిక్ష, దియా, విన్సెంట్‌ అశోకన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ డిసెంబర్‌ 1వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. చిత్ర కథానాయకుడు కార్తికేయన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి అందరూ అంకిత భావంతో పని చేశారన్నారు.

విన్సెంట్‌ అశోకన్‌ చెప్పినట్లుగా తామందరం నటుడు విజయ్‌ కాంత్‌లా శ్రమించామని చెప్పారు. అందరూ వారి సొంత చిత్రంగా భావించి పని చేశారన్నారు. డబ్బు మాత్రమే ఉంటే చాలదని, ప్రేమ, శ్రమ, నమ్మకమే ఏదైనా చేయగలవని, అవి తమ టీమ్‌లో ఉన్నాయని చెప్పారు. అయితే కొందరి వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయని, తాము అలాంటివి అధిగమించినట్లు పేర్కొన్నారు.

చదవండి: దిశా పటానిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement