టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ తొలిసారి కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈయన నటి స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం కార్తికేయన్. తెలుగులో కార్తికేయ పేరుతో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని మాగ్నాపసిని ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత బి వి శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. కథ, దర్శకత్వం బాధ్యతలను ఎం.చందు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ వైవిధ్యభరిత కథా కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కార్తికేయన్ అని తెలిపారు. చిత్ర షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తి అయ్యిందని చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ భాషాభేదం లేకుండా ఏ ప్రాంతానికి చెందిన కళాకారులైనా తమిళ చిత్ర పరిశ్రమ ఆదరిస్తోందన్నారు. తాను ఈ కార్తికేయన్ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని మే చివరి వారంలో గానీ, జూన్ తొలి వారంలో గానీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
నిఖిల్, స్వాతి జంటగా కార్తికేయన్
Published Mon, Apr 14 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM
Advertisement
Advertisement