ఉత్కంఠభరితంగా... | Karthikeya movie release in August | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా...

Published Tue, Jul 15 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

ఉత్కంఠభరితంగా...

ఉత్కంఠభరితంగా...

 థ్రిల్లర్‌తో కూడిన వినోదాత్మక కథాంశంతో రూపొందిన చిత్రం ‘కార్తికేయ’. ఆ మధ్య విజయం సాధించిన ‘స్వామి రారా’ జంట నిఖిల్, స్వాతి ఇందులో హీరో హీరోయిన్లు. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉత్కంఠ రేపే కథ, కథనాలతో రూపొందించిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించాం.
 
  తొలి ప్రయత్నమే ద్విభాషా చిత్రం చేయడం ఆనందంగా ఉంది. శేఖర్ చంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్ 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. నిఖిల్, స్వాతి జంట యువతరాన్ని అలరిస్తుందనీ, వారి కెరీర్లో నిలిచిపోయే సినిమా అవుతుందనీ దర్శకుడు అభిప్రాయపడ్డారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, రాజా రవీంద్ర, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: శిరువూరి రాజేశ్‌వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement