టీనగర్: తురైపాక్కంలో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. మహాబలిపురం సమీపంలోగల బకింగ్‌హామ్ కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. తురైపాక్కంలోగల టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్ కార్తికేయన్(31). తురైపాక్కం పాత మహాబలిపురం రోడ్డులో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. రెండవ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన కార్తికేయన్ తర్వాత ఇంటికి చేరుకోలేదు. దీనిపై అతని తల్లి తురైపాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహాబలిపురం సమీపంలోని తెర్కుపేట ప్రాంతంలోని బకింగ్‌హాం కాలువలో కార్తికేయన్ మృతదేహం కనిపించింది.
మహాబలిపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్తికేయన్ మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. హత్యకు గురైన కార్తికేయన్ సొంతవూరు నైవేలి. ఇతడు కొన్ని రోజుల క్రితం స్నేహితులతో అద్దె ఇంట్లో బసచేశాడు. ఈ తర్వాత వేరొక ఇంట్లో అద్దెకు ఉండేందుకు రూ.50 వేలను తల్లి వద్ద తీసుకువచ్చాడు. ఆ తర్వాతనే ఈ హత్య జరిగింది. ఇలాఉండగా స్నేహితుని కోసం రూ.50 వేలను ఇంటి నుంచి కార్తికేయన్ తీసుకువచ్చాడని, నగదు కోసం ఈ హత్య జరిగి ఉండొచ్చని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య
Published Mon, Nov 7 2016 3:27 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
Advertisement
Advertisement