రూ.2లక్షలకుపైన నగదు కొనుగోళ్లపై ఊరట | Govt strikes out 1% TCS on cash purchase above Rs 2 lakh | Sakshi
Sakshi News home page

రూ.2లక్షలకుపైన నగదు కొనుగోళ్లపై ఊరట

Published Thu, Mar 23 2017 8:19 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

రూ.2లక్షలకుపైన నగదు కొనుగోళ్లపై ఊరట - Sakshi

రూ.2లక్షలకుపైన నగదు కొనుగోళ్లపై ఊరట

న్యూఢిల్లీ: నగదు చెల్లింపు ద్వారా   కొనుగోళ్లపై  విధించిన  మూలాధార పన్ను (టీసీఎస్‌)పై కేంద్రప్రభుత్వం వెనక్కి  తగ్గింది.  ఆభరణాలు సహా, ఇతర సేవలకుగాను వస్తువులు కొనుగోళ్లపై ఆంక్షలను ఎత్తివేసింది. రూ.2 లక్షలకు మించి జరిపే కొనుగోళ్ళపై 1 శాతం మూలాధార పన్నును తొలగించింది.  2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించిన  ఈ ఒక శాతం టీసీఎస్‌ను తాజా కేంద్రం ‘ఆర్థిక బిల్లు 2017‘ ఆమోదం  సందర్భంగా  రద్దు చేసింది.

ఇటీవల రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించిన  కేంద్రం ఈ పరిమితిని  రూ. 2 లక్షలకు కుదించింది.   అయితే  రెండు లక్షలకు మించిన నగదు కొనుగోళ్లపై పన్నును  రద్దు చేసింది. ఆభరణాలు సహా వస్తువులు, ఇతర సేవలపై టీసీఎస్‌ను  ఆర్థిక బిల్లు 2017 కు సవరణ ద్వారా తొలగించింది. ఈ నిబంధన ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  ఈ మేరకు చట్ట సవరణలకు  లోకసభలో  బుధవారం ఆమోదించారు.
 
ఆదాయం పన్ను శాఖ 1 జూలై 1, 2012  నుంచి  బులియన్ నగదు కొనుగోళ్లు  రూ. 2లక్షలకుమించితే, ఆభరణాల  కొనుగోలు  రూ.5 లక్షలు మించితే  1 శాతం టిసిఎస్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement