రూ.2లక్షలకుపైన నగదు కొనుగోళ్లపై ఊరట
న్యూఢిల్లీ: నగదు చెల్లింపు ద్వారా కొనుగోళ్లపై విధించిన మూలాధార పన్ను (టీసీఎస్)పై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆభరణాలు సహా, ఇతర సేవలకుగాను వస్తువులు కొనుగోళ్లపై ఆంక్షలను ఎత్తివేసింది. రూ.2 లక్షలకు మించి జరిపే కొనుగోళ్ళపై 1 శాతం మూలాధార పన్నును తొలగించింది. 2017-18 బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ ఒక శాతం టీసీఎస్‌ను తాజా కేంద్రం ‘ఆర్థిక బిల్లు 2017‘ ఆమోదం సందర్భంగా రద్దు చేసింది.
ఇటీవల రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017-18 బడ్జెట్లో ప్రతిపాదించిన కేంద్రం ఈ పరిమితిని రూ. 2 లక్షలకు కుదించింది. అయితే రెండు లక్షలకు మించిన నగదు కొనుగోళ్లపై పన్నును రద్దు చేసింది. ఆభరణాలు సహా వస్తువులు, ఇతర సేవలపై టీసీఎస్‌ను ఆర్థిక బిల్లు 2017 కు సవరణ ద్వారా తొలగించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలకు లోకసభలో బుధవారం ఆమోదించారు.
ఆదాయం పన్ను శాఖ 1 జూలై 1, 2012 నుంచి బులియన్ నగదు కొనుగోళ్లు రూ. 2లక్షలకుమించితే, ఆభరణాల కొనుగోలు రూ.5 లక్షలు మించితే 1 శాతం టిసిఎస్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.