నాసిక్: నిధులు దొరుకుతాయనే కొందరి మూఢ విశ్వాసం తొమ్మిదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఘోరం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా పొహనె షివార్ గ్రామంలో ఈ నెల 16న చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఒక బాలుడిని నిర్బంధించి తాంత్రిక పూజల్లో భాగంగా గొంతుకోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గుంతలో సగం వరకు పూడ్చిపెట్టారు. ఈ నెల 18న ఈ దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిధి దొరుకుతుందనే మూఢ నమ్మకంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment