మృతిచెందిన ఇందిర (ఫైల్) పక్కన పోలీసుల విచారణ
సాక్షి, చెన్నై : మహిళా పోలీసు మృతదేహంతో 25 రోజులుగా ప్రార్థనలు నిర్వహించిన ఇద్దరిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతో ఇలా జరిపినట్లు విచారణలో తేలింది. టీ.నగర్‌లోని దిండుగల్ నందవనపట్టికి చెందిన అన్నై ఇందిర (38) పోలీసు కంట్రోల్‌రూంలో పనిచేసేది. భర్తను విడిచి తన బిడ్డతోపాటు అక్క వాసుకి, కుటుంబ స్నేహితుడు సుదర్శనంతో కలిసి ఉండేది.
మెడికల్ లీవులో ఉన్న ఇందిర సెలవులు ముగిసినా విధులకు హాజరుకాలేదు. దీంతో గురువారం ఇద్దరు మహిళా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూశారు. ఆ సమయంలో ఇంటిలోని ఓ గది తలుపులు తాళం వేసి ఉంది. దీంతో అనుమానించిన మహిళా పోలీసులు గదిలోకి వెళ్లి చూశారు. ఇందిర మృతదేహం వస్త్రాలతో చుట్టి ఉంది. దీనిపై వాసుకి, సుదర్శనం వద్ద విచారించగా ఇందిర డిసెంబర్ 7న మృతిచెందిందని, ఏసుక్రీస్తులా ఆమె మళ్లీ బతుకుతుందని, అందుకోసం రోజూ ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment