సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: చేతబడి నెపంతో ఓ మరగుజ్జును హత్య చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నల్ జిల్లా, పెంటపల్లి గ్రావనికి చెందిన నక్కాకృష్ణ (30), ప్రకాష్‌నగర్‌లో ఉంటూ పూల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కృష్ణ మేనత్త బాలమ్మ, బాబాయ్ వెంకటస్వామి వరుసగా చనిపోయారు. వెంకటస్వామి కుమారుడు చందు (30), కూతురు శుభాకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి కృష్ణ కూడా హాజరయాడు. అయితే నెల వ్యవధిలోనే చందు కూతురు సైతం అనారోగ్యానికి గురైంది.
అయితే నక్కా కృష్ణ తండ్రికి చేతబడి చేయటం వస్తోందని తండ్రి ద్వారానే కృష్ణ అలవాటు చేసుకొని తన కూతురుకు చేతబడి చేశాడని కక్ష పెంచుకున్నాడు. కృషను ఎలాగైనా చంపేయాలని నిరయించుకున్నాడు. క్రమంలో జనవరి 4వ తేదీన చందు ప్రకాష్‌నగర్‌కు వచ్చి రాత్రైయిందని ఇక్కడే పడుకుంటానని కృషతో నమ్మబలికాడు. తాను అనుకున్న పథకం ప్రకారమే సమీపంలో ఉన్న రోకలి బండతో నక్కాకృష తలపై బాదడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఓ గోనెసంచిలో మూటగట్టి నల్ల చెరువులో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సమీపంలోని సీసీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించటంతో సోమవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు, సీఐ నర్సింగ్‌రావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
చదవండి:
Banjara Hills: ఒక స్కూటీ.. 130 చలానాలు
బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment