మొన్న ఓటమి.. నిన్న విజయం.. ఈ సారి మనదే ‘షూటౌట్‌’! | FIH Pro League: Indian Women Hockey Team Beat Germany In Shoot Out | Sakshi
Sakshi News home page

FIH Pro League: శనివారం ఓటమి.. ఆదివారం విజయం.. ఈ సారి మనదే ‘షూటౌట్‌’!

Mar 14 2022 7:20 AM | Updated on Mar 14 2022 7:27 AM

FIH Pro League: Indian Women Hockey Team Beat Germany In Shoot Out - Sakshi

FIH Pro League- భువనేశ్వర్‌: శనివారం ఓటమికి కారణమైన ‘షూటౌట్‌’ ఆదివారం వచ్చేసరికి విజయాన్నందించింది! ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో జర్మనీని చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌ తరహాలోనే నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో ‘షూటౌట్‌’ అనివార్యమైంది. ముందుగా మ్యాచ్‌ 29వ నిమిషంలో జర్మనీ తరఫున ఫెలీషియా వీడర్‌మన్‌ గోల్‌ సాధించగా... 40వ నిమిషంలో నిషా గోల్‌ సాధించి భారత్‌ను బరిలో నిలిపింది.

షూటౌట్‌లో భారత్‌ మూడు ప్రయత్నాల్లోనూ బంతి గోల్‌ పోస్ట్‌లోకి పంపించడంలో సఫలం కాగా... జర్మనీని మన గోల్‌ కీపర్‌ సవిత సమర్థంగా అడ్డుకుంది. షూటౌట్‌లో భారత్‌ తరఫున కుమారి సంగీత, టెటె సలీమా, సోనిక గోల్స్‌ సాధించారు.  తాజా గెలుపుతో భారత్‌ ఖాతా లో 2 పాయింట్లు చేరాయి. ప్రొ లీగ్‌లో భాగంగా భారత్‌ తమ తర్వాతి పోరులో ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై తలపడుతుంది.

చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతాలో మరో రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement