women hockey team
-
హాకీ జాతీయ జట్టులో యలమంచిలి క్రీడాకారిణి
యలమంచిలి రూరల్: విశాఖ జిల్లాలో హాకీ క్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పట్టణం యలమంచిలి.. ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి జాతీయ జట్టుకు ఎంపికై పుట్టిన ఊరు ఖ్యాతిని ఇనుమడింపజేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మడగల భవాని భారత మహిళల హాకీ టీంకు ఎంపికైంది. త్వరలో ప్రారంభం కానున్న ఐర్లాండ్ టూర్లో పాల్గొననుంది. బాబూరావు, వరలక్ష్మి దంపతుల ముద్దుల కుమార్తె భవాని యలమంచిలి క్రీడామైదానంలో సాధన చేసి అంచలంచెలుగా ఎదిగింది. మండలస్థాయి.. ఆపై జిల్లాస్థాయిలో రాణించిన ఆమె ఏపీ తరపున సబ్ జూనియర్ హాకీ క్రీడలో పాల్గొని 2019లో ఢిల్లీ అకాడమీకి ఎంపికయింది. అక్కడ కూడా రాణించి ఇప్పుడు ఏకంగా ఇండియా హాకీ టీంలో స్థానం సంపాదించిందని పట్టణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొటారు నరేష్, ఏపీ అసోసియేషన్ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు. వెటరన్స్ అడుగుజాడల్లో.. మా ఇంటి ముందు క్రీడా మైదానంలో చాలామంది హాకీ ఆడేవారు. వారిని చూసి నాకూ ఆసక్తి కలిగింది. 11 ఏళ్ల వయసులో హాకీ స్టిక్ పట్టాను. అప్పట్లో సరిగా ఆడలేకపోయేదాన్ని. హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొటారు నరేష్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందా. ఆయన శిక్షణలో ఈ స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మడగల భవాని -
కాంస్య పతక పోరులో భారత్‌కు నిరాశ
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో రెండోసారి కాంస్య పతకం సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ‘షూటౌట్’లో 0–3తో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా షర్మిలా దేవి, కెప్టెన్ సలీమా తెతె, సంగీత కుమారి విఫలమవ్వగా... ఇంగ్లండ్ తరఫున కేటీ కర్టిస్, స్వయిన్, మ్యాడీ ఆక్స్ఫర్డ్ సఫలమయ్యారు. ఫలితం తేలిపోవడంతో మరో రెండు షాట్లను తీసుకోలేదు. అంతకుముందు భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (21వ, 47వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు మిలీ గిజిలో (18వ ని.లో), క్లాడియా స్వయిన్ (58వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల వరకు భారత్ 2–1తో ఆధిక్యంలో ఉన్నా చివర్లో తడబడి ఇంగ్లండ్‌కు స్కోరును సమం చేసే అవకాశమిచ్చింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2013లో భారత్ చేతిలో కాంస్య పతక పోరులో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లయింది. 2013లో భారత్ ‘షూటౌట్’లో ఇంగ్లండ్‌ను ఓడించి కాంస్య పతకం గెలిచింది. ఈసారి మాత్రం భారత్ ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. జర్మనీతో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 3–1తో గెలిచి నాలుగో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. -
భారత ‘కెప్టెన్’ రీ ఎంట్రీ.. అయితే సారథి మాత్రం..
FIH Pro League 2021-2022- న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ స్టార్ స్ట్రయికర్, గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాణి రాంపాల్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్‌తో ఈనెల 8, 9 తేదీల్లో రెండు మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో రాణి రాంపాల్ కెప్టెన్సీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ తర్వాత తొడ కండరాలు సహా ఇతరత్రా గాయాలతో ఆమె మళ్లీ మైదానంలోకే దిగలేదు. ఇప్పుడు ఫిట్నెస్ సంతరించుకోవడంతో జట్టుకు ఎంపికైంది. కానీ సీనియర్ గోల్‌కీపర్ సవితనే సారథిగా కొనసాగించనున్నారు. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజని, దీప్ గ్రేస్, గుర్జీత్, నిక్కీ, ఉదిత, రష్మిత, సుమన్ దేవి, నిషా, సుశీలా చాను, జ్యోతి, నవజ్యోత్ కౌర్, మోనిక, నమిత, సోనిక, నేహ, మహిమ, ఐశ్వర్య, నవ్‌నీత్ కౌర్, రజ్విందర్ కౌర్, రాణి రాంపాల్, మరియానా కుజుర్. అజేయంగా ముందుకు... పాట్చెఫ్స్ట్రూమ్: జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. మలేసియాతో మంగళవారం జరిగిన పూల్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గి ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ తొమ్మిది పాయింట్లతో పూల్ ‘టాపర్’గా నిలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. మలేసియాతో జరిగిన పోరులో భారత్ తరఫున ముంతాజ్ (10వ, 26వ, 59వ ని.లో) మూడు గోల్స్ సాధించగా... మరో గోల్‌ను సంగీత కుమారి (11వ ని.లో) చేసింది. చదవండి: IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్! ఆర్సీబీ సంచలన విజయం -
మొన్న ఓటమి.. నిన్న విజయం.. ఈ సారి మనదే ‘షూటౌట్’!
FIH Pro League- భువనేశ్వర్: శనివారం ఓటమికి కారణమైన ‘షూటౌట్’ ఆదివారం వచ్చేసరికి విజయాన్నందించింది! ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని చిత్తు చేసింది. తొలి మ్యాచ్ తరహాలోనే నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ముందుగా మ్యాచ్ 29వ నిమిషంలో జర్మనీ తరఫున ఫెలీషియా వీడర్మన్ గోల్ సాధించగా... 40వ నిమిషంలో నిషా గోల్ సాధించి భారత్‌ను బరిలో నిలిపింది. షూటౌట్లో భారత్ మూడు ప్రయత్నాల్లోనూ బంతి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫలం కాగా... జర్మనీని మన గోల్ కీపర్ సవిత సమర్థంగా అడ్డుకుంది. షూటౌట్లో భారత్ తరఫున కుమారి సంగీత, టెటె సలీమా, సోనిక గోల్స్ సాధించారు. తాజా గెలుపుతో భారత్ ఖాతా లో 2 పాయింట్లు చేరాయి. ప్రొ లీగ్‌లో భాగంగా భారత్ తమ తర్వాతి పోరులో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై తలపడుతుంది. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
ఒలింపిక్స్ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది. నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని, అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్సర్ చేరుకున్నారు. కామన్వెల్త్ ఆసియన్ గేమ్స్ వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని, హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు వందన కటారియాకు డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ వాయిద్యాలతో గ్రామస్తులు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసారు. Amid 'dhols', Indian Women Hockey team's Vandana Katariya receives a warm welcome at Dehradun Airport, Uttarakhand. "We were broken after losing the bronze medal match, didn't win a medal but have won hearts. The team performed well at #Tokyo2020, " she says pic.twitter.com/VEa5jv8mLs — ANI (@ANI) August 11, 2021 Odisha CM Naveen Patnaik felicitated Men and Women hockey players from the state- Deep Grace Ekka, Namita Toppo, Birendra Lakra and Amit Rohidas for their performance at #Tokyo2020; handed over a cash award of Rs 2.5 crores to Birendra Lakra & Amit Rohidas. pic.twitter.com/Wt6ks6gYsC — ANI (@ANI) August 11, 2021 Family members of Indian men and women hockey players from Punjab receive them at Amritsar "We'll start training from next month. We have a busy year ahead due to Commonwealth & Asian Games. Confidence of team is high," says men's hockey team player Gurjant Singh pic.twitter.com/CpZDqXmSPr — ANI (@ANI) August 11, 2021 -
BIG STORY : రాతియుగం నాటి కులం కంపు వదులుకోని అర్భకులు
-
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి ►ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా పరాజయం పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన భజరంగ్.. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజి ముందు భజరంగ్ నిలవలేకపోయాడు. కాగా కాంస్య పతక పోరు కోసం భజరంగ్ పూనియా రేపు మరో మ్యాచ్ ఆడనున్నాడు. Tokyo Olympics 2020 Live Updates: గోల్ఫ్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశం కనబడుతోంది. మూడో రౌండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్ పతకం సాధించేలా కనిపిస్తోంది. వాతావరణం అనుకూలించకుంటే, శనివారం జరుగనున్న నాలుగో రౌండ్ ఫలితం తేలనట్లయితే, మూడో రౌండ్ ఫలితాలను బట్టి అదితి అశోక్‌కు మెడల్ వచ్చే అవకాశం ఉంది. సెమీస్ చేరిన భజరంగ్ ► పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీస్ చేరాడు. ఇరాన్ రెజ్లర్‌పై 2-1 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు. ► రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సత్తా చాటాడు. కజికిస్థాన్ రెజ్లర్ అక్మతలీవ్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పోరాడి ఓడిన భారత్ ►కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల జరిగిన హోరాహోరీ పోరులో బ్రిటన్ విజయం సాధించింది. 4-3 తేడాతో భారత్‌పై గెలుపొందింది. నాలుగో క్వార్టర్ ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బ్రిటన్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన రాణి సేన.. ఈ ఓటమి కారణంగా రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరిగిరానుంది. ►మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమంగా ఉన్నాయి. నిరాశ పరిచిన సిమీ బిస్లా ►రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సారా హమీద్ చేతిలో భారత మహిళా రెజ్లర్ సీమీ బిస్లా ఓటమి పాలైంది. బ్రిటన్‌తో భారత్ హోరాహోరీ ►రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-2తో ఆధిపత్యం ప్రదర్శించగా... మూడో క్వార్టర్ ఆరంభంలోనే గోల్ కొట్టి 3-3కి భారత్ ఆధిక్యాన్ని బ్రిటన్ తగ్గించేసింది. ►బ్రిటన్‌తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకున్న రాణి సేన క్వార్టర్ ముగిసే సరికి వరుస గోల్స్ చేసి 3-2తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు. ► శుక్రవారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో భారత్-గ్రేట్ బ్రిటన్ మధ్య కాంస్యపు పోరు. ► బ్రిటన్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్.. సేవ్ చేసిన నవనీత్ ►లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. Let's own the stage. 💪 🇬🇧 0:0 🇮🇳https://t.co/FEfTJeC69a#GBRvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/sC5lUzw937 — Hockey India (@TheHockeyIndia) August 6, 2021 ►ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. ► పురుషుల 50 కి.మీ నడకలో భారత్‌కు నిరాశ. 50 కి.మీ నడకను పూర్తిచేయలేకపోయిన గురుప్రీత్‌సింగ్. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ►ఉ.7 నుంచి హాకీ మహిళల కాంస్య పతక పోరు (భారత్ Vs బ్రిటన్) ►ఉ. 8 గంటలకు రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగం (సీమీ బిస్లా) ►ఉ.8:45కు రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగం (బజరంగ్ పునియా) ►మ.ఒంటిగంట నుంచి మహిళల 20 కి.మీ వడక (ప్రియాంక, భావన) ►మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్ పురుషుల సెమీస్ ►మధ్యాహ్నం 3:15 నుంచి రెజ్లింగ్ మహిళల సెమీస్ సాయంత్రం 5 గంటలకు పురుషుల 4x400 మీటర్ల హీట్స్ -
అమ్మాయిలు చరిత్ర సృష్టించేనా?
కొత్త చరిత్ర సృష్టించడానికి, చరిత్రలో నిలిచిపోవడానికి భారత మహిళల హాకీ జట్టు ఒకే ఒక్క విజయం దూరంలో ఉంది. ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై టీమిండియా మరింత దృష్టి పెట్టాలి. ఫినిషింగ్ లోపాలను సవరించుకోవాలి. క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళలు పట్టుదలతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడితే కాంస్య పతకం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఫైనల్‌కు చేరుకోకపోవడంతో బ్రిటన్ కనీసం కాంస్య పతకంతోనైనా తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కాంస్య పతక పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. -
ఆ విజయ నాదం ప్రపంచం నలుమూలలా వినిపించేలా..
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాలాంటి జట్టును మట్టికరిపించి.. సెమీ ఫైనల్‌కు చేరింది. దాదాపు 20 ఏళ్లు వెంటాడిన ఓటమి వారి సమిష్టి కృషి, శ్రమ ముందు తలదించింది. విజయం సొంతమయ్యింది. ఇక ఆ క్షణం వారి స్పందన ఎలా ఉంటుందో వర్ణించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఈ క్షణాల కోసం వారు ఎన్ని త్యాగాలు చేశారో.. ఎన్ని అడ్డంకులను దాటుకున్నారో వారికే తెలుసు. వాటన్నింటిని ఈ విజయం మరిపించింది. ఆ క్షణం వారి మనసులోని భావాన్ని వ్యక్తం చేయడానికి మాటలు చాలవు.. అసలు పదాలు దొరకవు. విజయానందాన్ని వ్యక్తం చేయడానికి వెర్రిగా కేకలు వేశారు. గెలుపు కోసం సమిష్టిగా ఎలా కృషి చేశారో.. విజయం సాధించిన అనంతరం అందరూ కలిసి ఐక్యంగా సంతోషాన్ని పంచుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుని అభినందించుకున్నారు. వారి కేకలతో స్టేడియం మార్మోగిపోయింది. ఆ విజయ నాదం ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనించింది. 132 కోట్ల మంది ఆశలని.. సంతోషాన్ని ఆ కొద్ది మందే ప్రపంచానికి వెల్లడించారు. కోచ్‌లు కూడా తమ వయసును మర్చిపోయి.. సంతోషంతో గెంతులేశారు. ఆ క్షణానా వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని దేనితో వేల కట్టలేం.. పోల్చలేం.. తూచలేం. ఇక వారి సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజనులు వారికి అభినందనలు తెలపుతూ వారి సంతోషంలో తాము భాగం అయ్యారు. ఇక సెమీస్‌లో భారత మహిళా జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.ద -
రాణి బేటా.. లక్ష్యం కోసం పోరాడు
గెలిచినప్పుడు పొగడడం. ఓడినప్పుడు తిట్టడం.. మనకు బాగా అలవాటైన విషయమే. అయితే ఫలితం ఎలా ఉండబోతున్నా సరే.. కోట్లాది మందిలో ‘పతా(త)క’ ఆశలు చిగురింపజేసిన ఆమెది గుర్తు చేసుకోవాల్సిన గతం. ఆమె పేరు రాణి రాంపాల్(26). ఆసీస్‌పై ప్రతీకార విజయంతో నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ సెమీస్ బరిలో భారత హాకీ టీంను నిలిపిన సారథి గాథే ఇది. సాక్షి, వెబ్‌డెస్క్: ఆ ఇంటికి కరెంట్ లేదు. వానొస్తే చొచ్చుకొచ్చే వరద-బురద. ప్రశాంతంగా పడుకుందామంటే దోమల బెడద. అలాంటి ఇంట్లో తల్లి నాలుగు ఇళ్లలో పని మనిషిగా, తండ్రి బండిలాగి రోజూ 80రూ. సంపాదిస్తేనే తప్ప పూట గడవని ఇంట్లో పుట్టింది రాణి రాంపాల్. ఆ పరిస్థితులు ఆమెకు నచ్చలేదు. ఈ బీదతనం నుంచి బయటపడాలి.. అందుకోసం గుర్తింపు దక్కేలా ఏదో ఒకటి సాధించాలని పసిప్రాయంలోనే అనుకుంది. క్లిక్ చేయండి: రియో ఒటమికి స్వీట్ రివెంజ్ కరిగిపోయిన కోచ్ హర్యానా షాహబాద్ మార్కండ(కురుక్షేత్ర) దగ్గర్లోని ఓ ఇరుకు కాలనీలో ఆ ఇల్లు(రాణి పుట్టింది అక్కడే). ఆ ఇంటికి దగ్గర్లో ఓ హాకీ అకాడమీ. తోటి పిల్లలతో ఆటలాడాల్సిన వయసులో.. కర్రా-బంతి ఆసక్తిగా గమనించేది చిన్నారి రాణి. ఉండబట్టలేక ఓరోజూ ధైర్యం చేసి తనకూ ఆట నేర్పమని కోచ్ బల్దేవ్ సింగ్‌ను అడిగింది. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ప్రతీరోజూ అడుగుతూనే వచ్చింది. ‘చెప్తే అర్థంకాదా అమ్మా.. బాగా బలహీనంగా ఉన్నావ్’ అంటూ కసురుకున్నాడు ఆ కోచ్. అయినా ఆ ఆరేళ్ల చిన్నారి విరిగిన ఓ హాకీ స్టిక్‌తో అదే గ్రౌండ్లో.. ఆయన ముందే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. అది గమనించి కరిగిపోయి.. ఆమెకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ, నిక్కర్లు వేసుకుని ఆడే ఆటకు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఏదైతేనేం బతిమిలాడి వాళ్లను ఒప్పించింది. మన అమ్మాయిల సత్తా..ఫొటోలు కష్టం ఫలించింది పొద్దున్నే లేచి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఆకాశంలోని చుక్కల గడియారాన్ని చూసి టైంకి లేపేది ఆ తల్లి. హకీ శిక్షణ ఊరికే అయినా.. రోజూ అర లీటర్ పాలు వెంటతెచ్చుకోవాలనే నిబంధన ఆ చిన్నారిని ఇబ్బంది పెట్టింది. ఇంట్లో వాళ్లేమో 200మి.లీ పాలప్యాకెట్ కొనిచ్చేవాళ్లు. అందులో నీళ్లు కలిపేసి గప్‌చుప్‌గా తాగేసి ప్రాక్టీస్‌లోకి దూకేసేది ఆమె. ఆట కోసం కష్టపడుతున్న ఆమెకు నెమ్మదిగా కోచ్ సహకారం కూడా దక్కడం మొదలైంది. హకీ కిట్స్, షూస్ కొనివ్వడంతో పాటు మంచి డైట్ అందించేందుకు కొన్నాళ్లపాటు ఇంట్లో ఉండనిచ్చాడు ఆయన. అలా గురువు సహకారంతో కఠిన శిక్షణ తీసుకుందామె. అలా చిన్న వయసుకే టౌన్ టీంలో చోటు సంపాదించుకుంది. ఆటతో సొంత ఇంటి కల ఓ టోర్నీలో గెలుపు ద్వారా రూ.500 సంపాదన వచ్చిందామెకు. ఒక్కరోజులో అంత చూడడం ఆ తండ్రికి అదే మొదటిసారి. ఏదో ఒకరోజు సొంత ఇంటికి వెళ్తాం అని తల్లిదండ్రులకు మాట ఇచ్చిందామె. అందుకోసమే అప్పటి నుంచి కష్టపడింది. స్పానర్షిప్ కోసం ఓ ఫౌండేషన్ సాయం చేసింది. స్టేట్ ఛాంపియన్స్‌లో కష్టపడి.. నేషనల్ టీంకు 14 ఏళ్ల వయసులో ఎంపికైందామె. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు(రియో) ఎంపికైన టీమిండియా విమెన్ హాకీ టీంలో ఆమె సభ్యురాలైంది. ఆపై తన సత్తాతో టీంకు కెప్టెన్ అయ్యింది. తన ఆటకు దక్కిన ప్రతిఫలంతో నాలుగేళ్ల తర్వాత సొంత ఇంటి కల నెరవేర్చుకుంది. మధ్యలో మధ్యలో విజయాలు మహిళా హాకీపై భారతీయుల్లో అంచనాలు కలిగించాయి. కానీ, తన బాకీ ఇక్కడితోనే అయిపోలేదని చెప్తోంది రాణి. దేశానికి, తనను ప్రోత్సహిస్తున్న కోచ్‌కు ఏదో ఒకటి చేయాలని అనుకుంటోంది. ఒలింపిక్స్‌లో పతాకం ద్వారా ఆ రుణం తీర్చాలనుకుంటోంది. ఆ లక్ష్యం కోసం పోరాడుతున్న రాణి బేటాకి, సవితా, గుర్జీత్ లాంటి యువ హాకీ క్రీడాకారిణులకు .. ఆమె తల్లిదండ్రులతో పాటు కోట్లాది మంది దీవెనలూ కచ్చితంగా ఉంటాయి. -
డూ ఆర్ డై.. ఉత్కంఠ.. ఎట్టకేలకు విజయం: సవిత
టోక్యో: ‘‘సమిష్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా చేతుల్లో ఉన్నది 60 నిమిషాల సమయం. దానిని సద్వినియోగం చేసుకునేందుకు 100 శాతం శ్రమించాలనుకున్నాం. జట్టుగా ఆడాం. ఒకరికొకరం సహాయం చేసుకున్నాం. గోల్ మిస్ అవుతుంది అనుకున్నపుడు.. డిఫెన్స్‌పై దృష్టి సారించాం. మా వ్యూహం ఫలించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అని భారత మహిళా హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పునియా హర్షం వ్యక్తం చేసింది. అదే విధంగా... ‘‘ఈ మ్యాచ్ ‘‘డూ ఆర్ డై’’ సిట్యుయేషన్ అని కోచ్ చెప్పారు. ఈ 60 నిమిషాలే కీలకం అని కోచ్ చెప్పారు’’ అని హాకీ కోచ్ జోర్డ్ మారిజ్నే చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నెంబర్ 2 ఆస్ట్రేలియాపై ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్ 1-0తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో ఏకైక గోల్ చేసిన భారత హాకీ క్రీడాకారిణి గుర్జీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘ఈ విజయంతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపునకై జట్టంతా ఎంతో కఠిన శ్రమ చేసింది. కోచింగ్ స్టాఫ్ సహా మిగతా సభ్యులమంతా ఒక కుటుంబంలాగా కలిసే ఉంటాం. సమిష్టిగా పోరాడి సెమీస్‌కు చేరుకున్నాం. భారత మహిళా హాకీ జట్టుకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా విజయం కోసం ప్రార్థించినందుకు కృతజ్ఞతలు’’ అని హర్షం వ్యక్తం చేసింది. నమ్మకమే గెలిపించింది ‘‘మనం ఏది నమ్ముతామో అది నిజం అవుతుంది అంటారు కదా. మా విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నాం. గతం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఓటమి చెందినంత మాత్రాన విశ్వాసం కోల్పోకూడదని అమ్మాయిలకు చెప్పాను. అవసరమైన సమయంలో ఎలా స్పందించామనేదే ముఖ్యం. ఐర్లాండ్ చేతిలో ఇలాంటి విషయాలను ప్రతిబింబించే సినిమాను వాళ్లకు చూపించాను. నిజంగా అది మాకు హెల్్ప అయిందనే అనుకుంటున్నాను. ఈ రోజు మేం గెలిచాం’’ అని భారత మహిళా హాకీ జట్టు కోచ్ జోర్డ్ మారిజ్నే చెప్పుకొచ్చాడు. కాగా భారత మహిళా జట్టు అర్జెంటీనాతో సెమీస్‌లో తలపడనుంది. The new definition of 𝐖𝐀𝐋𝐋 💙#AUSvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/woXyJulwvG — Hockey India (@TheHockeyIndia) August 2, 2021 -
హాకీలో స్వర్ణం ఆశలు: మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీస్‌లోకి ఎంటరవ్వడం మాత్రమే కాదు సరికొత్త చరిత్రను లిఖించుకుంది. దీనిపై హాకీ మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్ స్పందించారు. మ్యాచ్ మొత్తంలో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘనత అంతా డీఫెన్స్, గోల్ కీపర్ గుర్‌జీత్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ విజయంతో బంగారం పతకం ఆశలకు మహిళల జట్టు మరింత చేరుకుందన్నారు. హాకీలో స్వర్ణం భారత్‌కు వారసత్వంగా వస్తోంది. గోల్డ్ సాధించి ఈ లెగసీని మహిళల జట్టు సాధించనుందనే ఆశాభావాన్ని ధ్యాన్ చంద్ వ్యక్తం చేశారు. భారత మహిళల హాకీ జట్టుపై దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులతోపాటు భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఫారెల్ కూడా హాకీ జట్టును అభినందించారు. 'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా' సవితా పునియాను ఓడించలేమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సెమీ, గ్రాండ్ ఫైనల్స్‌కు శుభాకాంక్షలు అందించారు. అమ్మాయిలు మీరు చరిత్ర సృష్టించారు! నమ్మశక్యంకానీ ఆటతీరును ప్రదర్శించారు. ఇక గోల్డ్ మెడల్ తీసుకురండి" అని భారత మాజీ ఆటగాడు లాజరస్ బార్లా ట్వీట్ చేశారు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్‌లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్ అంటూటోక్యో 2020 ఫర్ ఇండియా ట్వీట్ చేయడం విశేషం. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. I didn't see a single weak spot in the game. Australian team was left hopeless. The credit goes to defence and the goalkeeper. We are too close to winning a medal. Getting gold medal in Hockey is India's legacy and we all hope for the best: Ashok Dhyan Chand, ex-Hockey captain pic.twitter.com/iaQTzThBsJ — ANI (@ANI) August 2, 2021 Girls you created HISTORY! Unbelievable performance. Let's do it this time, bring the yellow metal home.#Olympics2020 #Hockey https://t.co/EYd0GJ8BhV — Lazarus Barla (@LazarusBarla) August 2, 2021 -
ఫ్యామిలీ నన్ను క్షమించండి: భారత మహిళా హాకీ జట్టు కోచ్
న్యూఢిల్లీ: భారత మహిళా హాకీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించిన రాణి సేనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో గెలుపొంది... తొలిసారిగా సెమీస్ చేరిన క్రమంలో యావత్ భారతావని మహిళా హాకీ జట్టును కీర్తిస్తోంది. ఇక ప్రపంచ నంబర్ 2 ఆస్ట్రేలియాపై పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరుస్తూ అద్వితీయ విజయం సొంతం చేసుకున్న తీరుపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘చక్ దే ఇండియా’’ అంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు సభ్యుల భావోద్వేగాలను ప్రతిబింబించే వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇలాగే అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరి.. స్వర్ణం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు భారత మహిళా హాకీ జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు. 130 కోట్ల మంది భారతీయులు మీ వెన్నంటే! ‘‘అద్భుతమైన ప్రదర్శన!!! టోక్యో ఒలింపిక్స్-2020లోభాగంగా భారత మహిళా హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 130 కోట్ల మంది భారతీయులు.. ‘‘మీ వెన్నంటే మేమున్నాం’’ అని చెబుతున్నాం’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. కల నెరవేరింది! ‘‘భారత్ కల నెరవేరింది. ఆస్ట్రేలియాను భారత మహిళా హాకీ జట్టు ఓడించింది! టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళా హాకీ జట్లు సెమీ ఫైనల్ చేరడం గొప్ప విషయం. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు’’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇంకొంత ఆలస్యమవుతుంది మరి! భారత మహిళా హాకీ జట్టు విజయంతో ప్రధాన కోచ్ జోర్డ్ మారిజ్నే సంతోషంలో తేలిపోతున్నారు. ఇన్నాళ్ల శ్రమకు సెమీ ఫైనల్లో ప్రవేశం రూపంలో ఫలితం దొరకడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మ్యాచ్ గెలిచిన అనంతరం.. భారత మహిళా హాకీ జట్టుతో ఉన్న ఫొటోను పంచుకున్న జోర్డ్.. ‘‘ఇంటికి రావడం మరింత ఆలస్యం అవుతుంది కదా! నన్ను క్షమించండి కుటుంబ సభ్యులారా!’’ అంటూ తన ఫ్యామిలీని ఉద్దేశించి సరదాగా ట్వీట్ చేశారు. ఇక హాకీ ఇండియా సైతం.. సోమవారం నాటి 60 నిమిషాల ఆట చిరస్మరణీయం అంటూ వుమెన్ ఇన్ బ్లూను ప్రశంసించింది. అదే విధంగా భారత క్రీడా మంత్రిత్వ శాఖ.. ‘‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి! అంతా నీలమయం అయ్యింది! అమ్మాయిలూ.. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది!’’అంటూ అభినందనలు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రధాని మోదీ అభినందనలు భారత హాకీ జట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరిన నేపథ్యంలో.. కొత్త చరిత్ర సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Splendid Performance!!! Women’s Hockey #TeamIndia is scripting history with every move at #Tokyo2020 ! We’re into the semi-finals of the Olympics for the 1st time beating Australia. 130 crore Indians 🇮🇳 to the Women’s Hockey Team - “we’re right behind you”! pic.twitter.com/vusiXVCGde — Anurag Thakur (@ianuragthakur) August 2, 2021 Sorry family , I coming again later 😊❤️ pic.twitter.com/h4uUTqx11F — Sjoerd Marijne (@SjoerdMarijne) August 2, 2021 A goal that will go in the history books! 🙌 Watch Gurjit Kaur's brilliant drag flick that led #IND to a 1-0 win over #AUS in an epic quarter-final 😍#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #Hockey | #BestOfTokyo pic.twitter.com/MkXqjprLxo — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 2, 2021 v -
సెమీస్‌కు భారత మహిళా హాకీ జట్టు.. ఫొటో హైలెట్స్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో భారత మహిళా హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటింది. విశ్వ క్రీడల్లో భారత కీర్తిని ఇనుమడింపజేస్తూ 41 ఏళ్ల తర్వాత తొలిసారిగా క్వార్టర్స్ చేరి గెలుపొంది.. సెమీస్‌లో అడుగుపెట్టింది. గుర్జీత్ కౌర్ గోల్, సవిత అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకోవడంతో 1-0 తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి గెలుపును సొంతం చేసుకుంది. 60 నిమిషాల ఆటలో ఏ దశలో ఆసీస్‌ను కోలుకోకుండా చేసి అద్వితీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేసిన మహిళా హాకీ జట్టు.. మ్యాచ్ సందర్భంగా వారి భావోద్వేగాల సమాహారం ఫొటోల రూపంలో.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. తొలిసారి సెమీస్‌కు!
మహిళల హాకీ నేపథ్యంలో వచ్చిన ‘చక్‌దే ఇండియా’ సినిమా క్లైమాక్స్ గుర్తుందా? ప్రపంచకప్ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలువడం చూపించారు. అదంతా సినిమా డ్రామాగా చూపించారే తప్ప ఆస్ట్రేలియాను ఓడించడం వాస్తవం కాదు. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయిల జట్టు దానిని నిజం చేసి చూపించింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్, అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి భారత మహిళల జట్టు పెను సంచలనం సృష్టించింది. తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మరో మ్యాచ్ గెలిస్తే భారత జట్టుకు పతకం ఖాయమవుతుంది. టోక్యో: ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన భారత అమ్మాయిల శక్తి ప్రజ్వరిల్లింది. టోర్నీలోనే అజేయమైన ఆస్ట్రేలియా జట్టును బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రాణి రాంపాల్ నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో మేటి జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఆట 22వ నిమిషంలో భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ స్కూప్ షాట్‌తో ఆస్ట్రేలియా గోల్‌పోస్ట్‌లోనికి పంపించింది. ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని టీమిండియా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిల ఆటతీరును అసాధారణం, అసమానం అన్నా తక్కువే అవుతుంది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన జట్టును తొలిసారి క్వార్టర్స్ చేరిన జట్టు కంగుతినిపించడం నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్ చూసిన వారెవరికైనా ఫైనల్ గెలిచినంత తృప్తి కలుగుతుందంటే అతిశయోక్తి కానే కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను చూస్తే ‘చక్ దే ఇండియా’ సినిమా గుర్తుకు రాక తప్పదు. అమ్మాయిలకు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన ఘనతే గొప్పదైతే... అందులో అజేయమైన ప్రత్యర్థిని ఓడిస్తే ఇంకెంత గొప్ప విజయమవుతుందో మన ఊహే తేల్చాలి మరి! ఎందుకంటే మహిళల హాకీలో ప్రపంచ రెండో ర్యాంకర్ జట్టు ఆస్ట్రేలియా మూడుసార్లు చాంపియన్. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టు కూడా! ఇంకా చెప్పాలంటే లీగ్దశలో ఐదు మ్యాచ్‌లాడితే ప్రత్యర్థికి ఒకే ఒక్క గోల్ ఇచ్చింది. ఇలాంటి దుర్భేద్యమైన జట్టును ఒలింపిక్స్‌లో తొలిసారి క్వార్టర్స్ చేరిన భారత్ 1–0తో కంగుతినిపించడం నిజంగా మహాద్భుతం. అమ్మాయిల ప్రదర్శనను వేనోళ్ల కొనియాడినా... ఆకాశానికెత్తినా తక్కువే. నాలుగు క్వార్టర్లుగా గంటపాటు జరిగిన మ్యాచ్‌లో రాణి రాంపాల్ సేన ఏ నిమిషాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఒక్క క్షణం కూడా అలసత్వం కనబరచలేదు. ముఖ్యంగా భారత గోల్ కీపర్ సవిత పూనియా గోల్‌పోస్ట్ వద్ద గోడ కట్టేసింది. అసాధారణమైన ఆస్ట్రేలియన్ అటాక్‌ను ఆ గోడ లోపలికి రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ చేసింది. కానీ మ్యాచ్‌ను గెలిపించింది మాత్రం ముమ్మాటికీ సవితనే! లేదంటే వాళ్లకు దక్కిన 7 పెనాల్టీ కార్నర్లలో ఏ రెండూ భారత గోల్‌పోస్ట్‌ను ఛేదించినా అమ్మాయిల ఆట అక్కడే ముగిసేది. ఇప్పుడు సెమీస్ దాకా చేరిందంటే సవిత అడ్డుగోడగా నిలవడమే కారణం. ఆఖరిదాకా పోరాటమే... తొలి క్వార్టర్ నుంచి ప్రత్యర్థికి దీటుగా భారత మహిళల జట్టు దాడులకు పదునుపెట్టింది. కెప్టెన్ రాణి రాంపాల్, వందన కటారియా, షర్మిలా దేవి ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా దూసుకెళ్లినా... ఆసీస్ గోల్‌కీపర్ రాచెల్ లించ్ అడ్డుకుంది. రెండో క్వార్టర్లో ఆస్ట్రేలియన్లకు లభించిన పెనాల్టీ కార్నర్లను సవిత చాకచక్యంగా ఆపేసింది. ఆట 22వ నిమిషంలో భారత్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ప్రత్యర్థి జట్టుకే వరుసగా పెనాల్టీ కార్నర్ అవకాశాలొచ్చినా దీప్ గ్రేస్ ఎక్కా, గోల్ కీపర్ సవిత పకడ్బందీగా అడ్డుకున్నారు. చివరి క్వార్టర్లో భారత అమ్మాయిల తెగువ అద్భుతం. ఆఖరి 8 నిమిషాల్లో అయితే ఆస్ట్రేలియన్లకు ఏకంగా నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. మ్యాచ్ ముగిసే దశలో, ఒత్తిడి పెరుగుతున్న సమయంలో సవిత పట్టుదలకు డిఫెన్స్ శ్రేణి అండదండలు లభించడంతో ఆస్ట్రేలియన్ల ఆటలేమీ సాగలేదు. రేపు జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అర్జెంటీనా 3–0తో జర్మనీపై; నెదర్లాండ్స్ 3–0తో న్యూజిలాండ్‌పై; డిఫెండింగ్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 2–0తో స్పెయిన్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరాయి. రెండో సెమీఫైనల్లో బ్రిటన్‌తో నెదర్లాండ్స్ ఆడుతుంది. మనం గెలవగలం ఫలితంతో సంతోషంగా ఉన్నా. జట్టును చూసి గర్వపడుతున్నా. ఏ ఒక్కరో కాదు... ప్రతీ ఒక్కరు మైదానంలో జట్టు గెలిచేందుకే చెమటోడ్చారు. నిజం చెబుతున్నా మ్యాచ్ ఎక్కడా ఆషామాషీగా జరగలేదు. అసాంతం పోటాపోటీగానే సాగింది. మాపై మేం గట్టి నమ్మకంతో ఉన్నాం. సాధించగలమనే పట్టుదలతో ఉన్నాం. ఆద్యంతం అదె పట్టు వీడకుండా శ్రమించాం. ముఖ్యంగా ఆట 60 నిమిషాలపైనే దృష్టిపెట్టాం. ఆ తర్వాత సంగతి అనవసరం అనుకున్నాం. ఎక్కడా పొరబడలేదు. అనుకున్నట్లే ఆడాం. అందరం పట్టుదలతోనే రాణించాం. –రాణి రాంపాల్ కెప్టెన్ మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈసారి రన్నరప్‌తో సరి
డాంఘయీ సిటీ (దక్షిణ కొరియా): లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు అసలు సమరంలో మాత్రం తడబడింది. ఫలితంగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సునీత లాక్రా బృందం ఆదివారం జరిగిన ఫైనల్లో 0–1తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన మన అమ్మాయిలు కొరియా డిఫెన్స్ ఛేదించడంలో విఫలమయ్యారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభం నుంచే ఒత్తిడి పెంచిన ఆతిథ్య కొరియా జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదే పదే దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో యంగ్సిల్ లీ (24వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేసి కొరియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. భారత స్ట్రయికర్ వందన కటారియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’, లాల్రేమ్సియామికి ‘అప్‌కమింగ్ ప్లేయర్’ పురస్కారాలు దక్కాయి -
భారత మహిళల సంచలనం
కకమిగహర (జపాన్): భారత మహిళల హాకీ జట్టు అసాధారణ విజయంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. శనివారం పూల్ ‘ఎ’లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10–0 గోల్స్‌తో సింగపూర్‌పై ఘన విజయం సాధించింది. నవ్‌నీత్ కౌర్ (3వ, 41వ నిమిషాల్లో), రాణి రాంపాల్ (15వ, 18వ ని.లో), నవజ్యోత్ కౌర్ (30వ, 50వ ని.లో) తలా రెండేసి గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి (18వ ని.లో), దీప్ గ్రేస్ ఎక్కా (25వ ని.లో), గుర్జీత్ కౌర్ (41వ ని.లో), సోనిక (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్ రాణి రాంపాల్ తన కెరీర్లో 100 గోల్స్‌ను పూర్తి చేసుకుంది. -
జపాన్, భారత్ హోరాహోరీగా...
చాలా కాలం తర్వాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు పోరాట పటిమను ప్రదర్శించింది. మన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న జపాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ ను భారత మహిళలు 2-2తో డ్రా చేసుకున్నారు. గ్రూప్-బీ లో భాగంగా జపాన్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఇరుజట్లు చెరో రెండు గోల్స్ సాధించడంతో మ్యాచ్ చివరికి డ్రా అయింది. జపాన్ తరఫున ఇమి నిషికోరి 15వ నిమిషంలో, మియి నకాషిమా 28వ నిమిషంలో గోల్స్ చేసి భారత్ పై ఒత్తిడి పెంచారు. వెంటనే తేరుకున్న భారత క్రీడాకారిణులు రాణి రాంపాల్ 31వ నిమిషంలో, లిలిమా మింజ్ 40వ నిమిషంలో భారత్ కు గోల్స్ అందించి సమం చేశారు. రెండో అర్ధభాగంలో ఇరుజట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినా మూడో గోల్ నమోదు కాలేదు. -
కెనడాపై భారత్ ఘనవిజయం
మన్హీమ్ (అమెరికా): అమెరికా పర్యటనలో ఉన్న భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2తో సునాయాసంగా నెగ్గింది. వందన కటారియా (9, 51వ నిమిషాల్లో), దీపిక (38, 49) రెండేసి గోల్స్‌తో చెలరేగగా పూనమ్ రాణి (58) మరో గోల్ సాధించింది. కెనడా నుంచి స్టెఫానీ నోర్లాండర్ (17), బ్రెన్నీ స్టెయిర్స్ (38) గోల్స్ చేశారు. తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చినా విఫలమైంది. అయితే తొమ్మిదో నిమిషంలోనే వందన ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచింది. ఇక చివరి క్వార్టర్లో భారత్ ఏకంగా మూడు గోల్స్‌తో దాడి చేసి కెనడాను కోలుకోనీయలేదు. -
భారత మహిళలకు మరో ఓటమి
హాస్టింగ్స్: న్యూజిలాండ్‌లో జరుగుతోన్న హాక్స్‌బే కప్ టోర్నమెంట్లో భారత మహిళల హాకి జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ 1-2తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. తొలుత చైనా కన్నా ముందే 19వ నిమిషంలో రాణి చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ 1-0 ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. వెంటనే చైనా క్రీడాకారిణి యూ కియాన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే చివరి క్వార్టర్లో వాంగ్ మెంగ్యూ(85వ ని.) గోల్ చేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. దీనికి ముందు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.