డాంఘయీ సిటీ (దక్షిణ కొరియా): లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు అసలు సమరంలో మాత్రం తడబడింది. ఫలితంగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సునీత లాక్రా బృందం ఆదివారం జరిగిన ఫైనల్లో 0–1తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన మన అమ్మాయిలు కొరియా డిఫెన్స్ ఛేదించడంలో విఫలమయ్యారు. మ్యాచ్ తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభం నుంచే ఒత్తిడి పెంచిన ఆతిథ్య కొరియా జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదే పదే దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో యంగ్‌సిల్ లీ (24వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేసి కొరియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. భారత స్ట్రయికర్ వందన కటారియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’, లాల్‌రేమ్‌సియామికి ‘అప్‌కమింగ్ ప్లేయర్’ పురస్కారాలు దక్కాయి
Comments
Please login to add a commentAdd a comment