
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌లో భారత మహిళా హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటింది. విశ్వ క్రీడల్లో భారత కీర్తిని ఇనుమడింపజేస్తూ 41 ఏళ్ల తర్వాత తొలిసారిగా క్వార్టర్స్ చేరి గెలుపొంది.. సెమీస్‌లో అడుగుపెట్టింది. గుర్జీత్ కౌర్ గోల్, సవిత అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకోవడంతో 1-0 తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి గెలుపును సొంతం చేసుకుంది. 60 నిమిషాల ఆటలో ఏ దశలో ఆసీస్‌ను కోలుకోకుండా చేసి అద్వితీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేసిన మహిళా హాకీ జట్టు.. మ్యాచ్ సందర్భంగా వారి భావోద్వేగాల సమాహారం ఫొటోల రూపంలో..
Comments
Please login to add a commentAdd a comment