Tokyo Olympics 2020: Indian Wrestler Bajrang Punia reaches Semis - Sakshi
Sakshi News home page

Tokyo Olympics 2020: సెమీస్‌లో భజరంగ్‌ పూనియా ఓటమి

Published Fri, Aug 6 2021 7:12 AM | Last Updated on Fri, Aug 6 2021 3:23 PM

Tokyo Olympics Day 15 August 6 Updates And Highlights Telugu - Sakshi

సెమీస్‌లో భజరంగ్‌ పూనియా ఓటమి
►ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్‌ స్టార్ రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా పరాజయం పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్‌ అజ‌ర్‌బైజాన్ రెజ్ల‌ర్ హ‌జి అలియేవ్‌తో జ‌రిగిన సెమీస్ బౌట్‌లో భజరంగ్‌ 5-12 తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యాడు. అంత‌కుముందు జ‌రిగిన రెండు బౌట్ల‌లోనూ గెలిచి గోల్డ్‌పై ఆశ‌లు రేపిన భ‌జ‌రంగ్‌.. ఇప్పుడు బ్రాంజ్ మెడ‌ల్ కోసం శ‌నివారం త‌ల‌ప‌డ‌నున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన ప్ర‌త్య‌ర్థి హ‌జి ముందు భ‌జ‌రంగ్ నిల‌వ‌లేక‌పోయాడు. కాగా కాంస్య పతక పోరు కోసం భజరంగ్‌ పూనియా రేపు మరో మ్యాచ్‌ ఆడనున్నాడు.

Tokyo Olympics 2020 Live Updates: గోల్ఫ్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశం కనబడుతోంది. మూడో రౌండ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్‌ పతకం సాధించేలా కనిపిస్తోంది. వాతావరణం అనుకూలించకుంటే, శనివారం జరుగనున్న నాలుగో రౌండ్‌ ఫలితం తేలనట్లయితే, మూడో రౌండ్ ఫలితాలను బట్టి అదితి అశోక్‌కు మెడల్ వచ్చే అవకాశం ఉంది.

సెమీస్‌ చేరిన భజరంగ్‌


► పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా సెమీస్‌ చేరాడు. ఇరాన్ రెజ్లర్‌పై 2-1 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు.

► రెజ్లింగ్‌ పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా సత్తా చాటాడు. కజికిస్థాన్‌ రెజ్లర్ అక్మతలీవ్‌పై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.

పోరాడి ఓడిన భారత్‌
►కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్‌ మహిళల జట్ల జరిగిన హోరాహోరీ పోరులో బ్రిటన్‌ విజయం సాధించింది. 4-3 తేడాతో భారత్‌పై గెలుపొందింది. నాలుగో క్వార్టర్‌ ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గోల్‌ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బ్రిటన్‌  కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన రాణి సేన.. ఈ ఓటమి కారణంగా రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరిగిరానుంది.

►మూడో క్వార్టర్‌ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమంగా ఉన్నాయి.

నిరాశ పరిచిన సిమీ బిస్లా
►రెజ్లింగ్‌ మహిళల 50 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సారా హమీద్‌ చేతిలో భారత మహిళా రెజ్లర్‌ సీమీ బిస్లా ఓటమి పాలైంది.

బ్రిటన్‌తో భారత్‌ హోరాహోరీ
►రెండో క్వార్టర్‌ ముగిసే సరికి భారత్‌ 3-2తో ఆధిపత్యం ప్రదర్శించగా... మూడో క్వార్టర్‌ ఆరంభంలోనే గోల్‌ కొట్టి 3-3కి భారత్‌ ఆధిక్యాన్ని బ్రిటన్‌ తగ్గించేసింది.

►బ్రిటన్‌తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్‌ వరకు బ్రిటన్‌ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకున్న రాణి సేన క్వార్టర్‌ ముగిసే సరికి వరుస గోల్స్‌ చేసి 3-2తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ రెండు, వందనా కటారియా ఒక గోల్‌ చేశారు.

► శుక్రవారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్‌ పిచ్‌లో భారత్‌-గ్రేట్‌ బ్రిటన్‌ మధ్య కాంస్యపు పోరు.

► బ్రిటన్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్‌.. సేవ్‌ చేసిన నవనీత్‌

►లీగ్‌ దశలో బ్రిటన్‌ చేతిలో 1–4 గోల్స్‌ తేడాతో ఓడిపోయిన భారత్‌ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్‌ కౌర్, వందన కటారియా, కెప్టెన్‌ రాణి రాంపాల్, గోల్‌కీపర్‌ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు.


►ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్‌ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడనుంది.

► పురుషుల 50 కి.మీ నడకలో భారత్‌కు నిరాశ. 50 కి.మీ నడకను పూర్తిచేయలేకపోయిన గురుప్రీత్‌సింగ్‌.

టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్‌ షెడ్యూల్‌
►ఉ.7 నుంచి హాకీ మహిళల కాంస్య పతక పోరు (భారత్‌ Vs బ్రిటన్‌)
►ఉ. 8 గంటలకు రెజ్లింగ్‌ మహిళల 50 కిలోల విభాగం (సీమీ బిస్లా)
►ఉ.8:45కు రెజ్లింగ్‌ పురుషుల 65 కిలోల విభాగం (బజరంగ్‌ పునియా)
►మ.ఒంటిగంట నుంచి మహిళల 20 కి.మీ వడక (ప్రియాంక, భావన)
►మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్‌ పురుషుల సెమీస్‌
►మధ్యాహ్నం 3:15 నుంచి రెజ్లింగ్‌ మహిళల సెమీస్‌
సాయంత్రం 5 గంటలకు పురుషుల 4x400 మీటర్ల హీట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement