Olympics medal
-
ఒలింపిక్స్‌లో నారీ భేరీ: మువ్వన్నెల కీర్తి పతాకలు
అమ్మాయిలకు ఆటలేంటి... ఈ మాట కాలమానాలకు అతీతంగా నాటి తరం నుంచి నేటి తరం వరకు వినిపిస్తూనే ఉంది. ఇలాంటి ఆలోచనకు దేశం, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేదు... మీ ఇంట్లోనో, పక్కింట్లోనో, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కూడా మీరు వినే ఉంటారు. ఆటతో ఆకాశపు అంచును అందుకున్నా... అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేసినా ఆడపిల్లకు అవసరమా అనే వాక్యం ఎక్కడినుంచో వెతుక్కుంటూనే వస్తుంది. అలా అని అమ్మాయి ఆగిపోలేదు. అలా ఆటల్లో దూసుకుపోతూనే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారతనారి తన సత్తా చాటి మువ్వన్నెల కీర్తి పతాకను ఎగురవేసింది. అడ్డంకులు సృష్టించడం కాదు... అవకాశాలు ఇస్తే ఎంతటి ఘనతనైనా సాధించగలనని చూపించింది. వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న మెగా స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్‌ను ఈ సారి నిర్వహణ కమిటీ మహిళల కోణంలో కాస్త ప్రత్యేకంగా మార్చింది. జెండర్ ఈక్వాలిటీ పాటిస్తూ పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్ల సంఖ్య కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మహిళలు కూడా ప్రముఖంగా కనిపించేలా... పురుషులు మాత్రమే ఇప్పటి వరకు పాల్గొన్న కొన్ని ఈవెంట్లలో సమానంగా మహిళలను కూడా చేర్చి మిక్స్డ్ ఈవెంట్లుగా మలచింది. ఇలాంటి ఈవెంట్ల సంఖ్య 18 కావడం విశేషం. అన్నింటికి మించి క్రీడల ప్రారంభోత్సవం రోజున తమ దేశ పతాకాన్ని తీసుకొని నడిచే అరుదైన గౌరవం కూడా స్త్రీలకే అందించింది. గతంలో ఒకే ఒక్క ఫ్లాగ్ బేరర్ ఉంటుండగా... టోక్యోలో ఒక దేశం నుంచి ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్ జెండా పట్టుకొని నడిచే అవకాశం కల్పించడం ఒలింపిక్స్ స్థాయిని పెంచాయి. పీవీ సింధు (బ్యాడ్మింటన్ సింగిల్స్, కాంస్యం) ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటే చాలు జీవితం ధన్యమైనట్లుగా భావించి∙ఒలింపియన్ అనే గుర్తింపుతో తిరిగేవారు ఎంతో మంది. కానీ రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటే రెండు సార్లూ పతకంతో తిరిగి రావడం అసాధారణం. అలాంటి ఘనతను తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సాధించింది. చాలా మంది క్రీడాకారుల కష్టాల నేపథ్యంతో పోలిస్తే... అలాంటివేమీ లేవు కాబట్టి సింధుకు అంతా పూలబాటే అనుకుంటే పొరపాటు. ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత ప్లేయర్ల ఆట మాత్రమే మాట్లాడుతుంది. వారి ఆర్థిక, సామాజిక అంశాలేవీ ప్రత్యర్థికి కనిపించవు. అంటే ఒక పతకం గెలుపు వెనుక ఉండే ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, అంకితభావమే ఆటగాళ్లను నడిపిస్తాయి. తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు ఆ తర్వాత ఇక చాలంటూ ఆగిపోలేదు. మరో ఒలింపిక్ పతకానికి గురి పెట్టింది. టోక్యో క్రీడలకు కొన్ని నెలల ముందునుంచైతే ఒక్క రోజు కూడా ఆమె విరామం తీసుకోలేదు. ఆటతో పాటు ఫిట్నెస్ కోసం గంటల కొద్దీ కఠోర సాధన చేసింది. అవే ఆమెను ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా తీర్చి దిద్దాయి. ఒలింపిక్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ – రజతం, 49 కేజీల విభాగం) ప్రపంచ క్రీడల్లో అతి పెద్ద వేదికపై ఘోర వైఫల్యం తర్వాత ఒక క్రీడాకారిణి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తిరిగి కోలుకొని ఆటపై దృష్టి పెట్టాలంటే, అదీ పతకం కోసం పోరాడాలంటే ఎంతటి పట్టుదల ఉండాలి! మణిపురి మణిపూస మీరాబాయి చాను అలాంటి పోరాటతత్వం తనలో ఉందని నిరూపించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో చాను తన ఈవెంట్‌ను కూడా పూర్తి చేయలేకపోయింది. ఆరు ప్రయత్నాల్లో ఒకే ఒక్కసారి మాత్రమే ఆమె నిర్ణీత బరువును ఎత్తగలిగింది. ఆ పోరు తర్వాత మొదలైన కన్నీటి ప్రవాహం ఎప్పుడో గానీ ఆగలేదు. అన్నీ మరచి ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని భావించిన చాను మళ్లీ పైకెగసింది. అనూహ్యంగా దూసుకొచ్చిన స్టార్ ప్లేయర్ మాదిరిగా కాకుండా తన కెరీర్లో ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ మళ్లీ ఆటపై మెల్లగా తన ముద్ర చూపించింది. ఇప్పుడు టోక్యోలో అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ పతకాన్ని అందుకుంది. ఊరికి సమీపంలో అడవినుంచి కట్టెలు కొట్టి తెచ్చే కుటుంబంలో ఒకరిగా ఉంటూ అవే కట్టెల మోపులను మోయడంతో మొదలైన ఆమె బరువులెత్తే ప్రస్థానం ఒలింపిక్ రజతం వరకు సాగింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఏనాడూ వెనక్కి తగ్గని మీరాబాయి లాంటి అమ్మాయి ఎందరికో స్ఫూర్తి. లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్ – 69 కేజీలు, కాంస్యం) ఇద్దరు అక్కలు కిక్ బాక్సింగ్ ఆడారు. వారిని చూసి తాను బాక్సింగ్ వైపు వచ్చింది. అయితే సహజంగానే చిరు వ్యాపారి అయిన తండ్రికి తమ ముగ్గురు అమ్మాయిలను ఆటల్లో పెట్టే స్తోమత లేదు. మొదటి ఇద్దరు జాతీయ స్థాయి ఆటతోనే ముగించారు. కానీ ఆ తండ్రి మూడో కూతురిని మాత్రం అంతర్జాతీయ స్థాయికి చేర్చాలని మనసులో గట్టిగా అనుకున్నాడు. లవ్లీనా కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఒలింపిక్స్‌లో ఆడి నా కల నెరవేర్చమ్మా అన్న నాన్నకు మాట ఇచ్చిన లవ్లీనా పాల్గొనడంతోనే సరి పెట్టలేదు. పతకం తెచ్చి మరీ మురిపించింది. అసోంలో వెనుకబడిన గోలాఘాట్ ప్రాంతంనుంచి వచ్చి లవ్లీనా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడం వెనుక అద్భుతాలు ఏమీ లేవు. అడుగడుగునా ఆమె కష్టం మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో సహచరులంతా ప్రత్యేక శిక్షణ కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో లవ్లీనా కరోనా బారిన పడింది. దాంతో ఆ అవకాశం చేజారింది. అక్కడకు వెళ్లి తన ఆట అత్యుత్తమంగా మారేదని, కచ్చితంగా ఒలింపిక్ పతకం సాధించేదాన్నని ఆమె అనుకుంది. అయితే ఆ నిరాశను దూరం చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇక్కడే ఉండి తన పంచ్‌లకు పదును పెట్టింది. ఇప్పుడు అసోం గర్వపతాకగా నిలిచింది. పతకం సాధించిన రోజునుంచి ఇప్పటి వరకు లవ్లీనా తన పురోగతిలో లెక్క లేనన్ని సార్లు నాన్న గురించి చెప్పడం చూస్తేనే ఆమెను ప్రోత్సహించడంలో తండ్రి పాత్ర ఏమిటో అర్థమవుతుంది. మేరీ కోమ్ (బాక్సింగ్ – 51 కేజీలు, క్వార్టర్ ఫైనల్) బాక్సింగ్‌లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి విజయం వెనుక ఎంత శ్రమ దాగి ఉంటుందో ఊహించడం కష్టం. మణిపూర్‌లోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేరీ కోమ్ భారత బాక్సింగ్‌కు పర్యాయపదంగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనే కాంస్యం సాధించి మేరీకోమ్ మరో పతకం కోసం ఈ సారీ పోరాడినా దురదృష్టవశాత్తూ చేజారింది. అయితే ఏం... మేరీకోమ్ క్రీడా పటిమను ఆ పతకంతో తూచలేం కదా! ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తాను నమ్మిన ఆటలో తనపై నమ్మకంతో ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం. టోక్యోలో పతకం గెలవకపోయినా తన ఆటతో మేరీకోమ్ అందరికీ ప్రేరణనిచ్చింది. అదితి అశోక్ (గోల్ఫ్ – నాలుగో స్థానం) గోల్ఫ్‌లో భారతదేశం మొత్తం పతకం కోసం ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. కానీ 23 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా మన క్రీడాభిమాల దృష్టినంతా తన వైపు తిప్పుకునేలా చేయగలిగింది. బెంగళూరుకు చెందిన అదితి అశోక్ తన అసాధారణ ఆటతో టోక్యో ఒలింపిక్స్‌లో చివరి వరకు పోరాడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ స్థానంలో ఉన్నా... ఆమె పట్టుదల ముందు ఆ అంకె బాగా చిన్నదైపోయింది. ఒక్క స్ట్రోక్...ç Üరిగ్గా చెప్పాలంటే కొన్ని మిల్లీ మీటర్ల తేడాతో అదితి కాంస్య పతకాన్ని కోల్పోయింది. అయినా సరే ఆటపై తన ముద్ర చూపించి అందరి మనసులు గెలుచుకోగలిగింది. గోల్ఫ్‌పై అందరూ చర్చించేలా చేయగలిగింది. భవానీ దేవి (ఫెన్సింగ్) ఎవ్వరూ నడవని దారిలో నడవడమే ఆమెకు తెలిసిన ఆట.. ఆమె స్పోర్ట్స్ ఫిలాసఫీ కూడా. అందుకే అరుదైన క్రీడ ఫెన్సింగ్‌లోకి అడుగు పెట్టింది భవానీ దేవి. ఖరీదైన క్రీడే అయినా కత్తితో సహవాసం చేయడంలో ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ ఆటకు సంబంధించి ఏమాత్రం సౌకర్యాలు లేని పరిస్థితులు, ఫలితాలు అసలే కనిపించని చోట తన ముద్ర చూపించడం కోసం ఎంతో కష్టపడింది. చివరకు పురుషుల విభాగంలోనూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒలింపిక్స్‌లోకి ప్రవేశించిన తొలి భారత ఫెన్సర్‌గా కీర్తి గడించింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆమె, రెండో పోరులో తగ్గింది. అయితే భవాని ఎదిగిన తీరును చూస్తే ఈ ఓటమి అసలు లెక్కలోనిదే కాదు. కొత్త ఆలోచనలతో, ధైర్యంతో ముందుకు సాగాలని భావించే ప్రతీ అమ్మాయికి ఫెన్సర్ భవానీ ఒక ఆదర్శం. కమల్‌ప్రీత్ కౌర్ (డిస్కస్ త్రో – ఆరో స్థానం) పంజాబ్‌లోని కబర్వాలా గ్రామంలో కమల్ కుటుంబానికి 26 ఎకరాల పొలం ఉంది. పాడి గేదెలు, ఇతర పశుసంపదకు లోటు లేదు. హాయిగా పెళ్లి చేసుకొని దర్జాగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటే నేను ఆటలు ఆడతానని కమల్ చెప్పింది. అయినా సరే, దేనికి లోటు లేదు కాబట్టి సరదాగా ఆడుతుందేమో అనుకున్నారు కానీ ఎంతో శ్రమ దాగి ఉండే అథ్లెటిక్స్ను ప్రొఫెషన్‌గా ఎంచుకుంటుందని వారు ఊహించలేదు. కమల్ ఏకంగా డిస్కస్ త్రోను విసరడాన్నే సాధన చేసింది. పట్టుదలగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన త్రోతో ఒలింపిక్స్ వరకు చేరింది. టోక్యో పోటీలకు ముందు ఆమెపై పెద్దగా అంచనాలు లేవు కానీ క్వాలిఫయింగ్‌లో కమల్ జోరు ఆశలను పెంచింది. చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా... డిస్కస్ త్రోలో ఒక భారత త్రోయర్ సాధించిన ఈ ఘనత చాలా గొప్పదే. అందుకే ఆమె ఈవెంట్ జరిగిన రోజు ఫలితంతో సంబంధం లేకుండా ఆ ఊర్లో సంబరాలు జరిగాయి. కమల్ ఇంట్లో మిఠాయి తినందే ఊళ్లోవాళ్లెవ్వరూ ఆ ఇంటి గుమ్మం దాటలేదు. డబ్బుకు కొదవ లేకున్నా... ప్లేయర్‌గా ఆమె కూడా సగటు అథ్లెట్‌గానే పలు ఇబ్బందికర పరిస్థితులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. ఒక దశలో కమల్‌ను సహచర మహిళా అథ్లెట్లు మగాడు అంటూ, పాల్గొనే అర్హత లేదంటూ ఫిర్యాదుల వరకు వెళ్లినా అన్నీ తట్టుకొని నిలిచింది. ఆమె పోరాటం నిజంగా అందరిలో స్ఫూర్తి నింపేదే. ఆ 16 మంది... ఒలింపిక్స్‌లో గెలుపు ఒక్కటే గొప్పతనాన్ని నిర్దేశించదు. పతకాల పట్టికలో తమ పేరు లిఖించుకోలేకపోయినా... ఆటపై బలమైన ముద్ర వేయగలగడం వారు సాధించిన విజయం. అలా చూస్తే భారత మహిళల హాకీ సాధించిన ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. 1980 తర్వాత ఎనిమిది ఒలింపిక్స్‌లలో అసలు అర్హతే సాధించలేకపోయింది. ఎట్టకేలకు 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా దక్కింది 12వ స్థానమే. అక్కడినుంచి ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానంలో నిలవగలిగిందంటే మన మహిళల ప్రస్థానం ఎలా సాగిందో అర్థమవుతుంది. కాంస్యపతక పోరులోనూ అద్భుతంగా ఆడినా దురదృష్టవశాత్తూ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే మన అమ్మాయిల ఆటను చూసినవారు మాత్రం స్థానంతో సంబంధం లేకుండా జేజేలు పలకకుండా ఉండలేకపోయారు. రాణి రాంపాల్ (హరియాణా) 26 ఏళ్ల రాణి జీవితంలో దాదాపు సగభాగం అంతర్జాతీయ హాకీకే అంకితం కావడం విశేషం. 14 ఏళ్లకే తొలి మ్యాచ్ ఆడిన రాణి చాలా మందిలాగే విరిగిన హాకీ స్టిక్‌తో ఆట మొదలు పెట్టి ఆపై దూసుకుపోయింది. నిక్కీ ప్రధాన్ (జార్ఖండ్) నక్సలైట్లకు అడ్డాలాంటి ప్రాంతంనుంచి వచ్చి దేశానికి హాకీలో ప్రాతినిధ్యం వహించి తొలి హాకీ క్రీడాకారిణిగా నిలిచింది. ఆటపై పిచ్చితో హాకీ స్టిక్ కొనడం కోసమే కార్మికురాలిగా కూడా పని చేసింది. రాంచీ అకాడమీలో చేరిన తర్వాతే తొలిసారి ఆమెకు హాకీ స్టిక్, షూ లభించాయి. నిషా వార్సి (హరియాణా) టైలర్‌గా పని చేస్తున్న తండ్రి హాకీ ఆడేందుకు ప్రోత్సహించాడు. ఆటలో వేగంగా ఎదుగుతున్న సమయంలో 2015లో పక్షవాతంతో తండ్రి కుప్పకూలడంతో తల్లితో పాటు ఒక ఫోమ్ ఫ్యాక్టరీలో పని చేయాల్సి రావడంతో కీలక సమయంలో అవకాశం కోల్పోయింది. అయితే పట్టుదలగా తిరిగొచ్చి ఆటలో సత్తా చాటింది. సుశీలా చాను (మణిపూర్) భారత జట్టులో సీనియర్ క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. దీప్ గ్రేస్ ఎక్కా (ఒడిశా) అన్న దినేశ్ ఎక్కా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో స్ఫూర్తి పొందిన దీప్ తాను అదే స్థాయికి ఎదిగేందుకు చాలా కష్టపడింది. ఇంట్లో పనులు చేసుకోకుండా ఆటలేంటి అంటూ ఊరంతా వెక్కిరించినా... కుటుంబ సభ్యుల మద్దతుతో ఆమె ముందుకు ఉరికింది. నేహా గోయల్ (హరియాణా) ఇంట్లో తాగుబోతు తండ్రితో బాధలు పడలేక ఎక్కువ సమయం బయట గడిపే క్రమంలో నేçహాకు హాకీ పరిచయమైంది. సైకిల్ చక్రంలో ఒక పుల్లను బిగిస్తే ఐదు రూపాయలు ఇచ్చే ఫ్యాక్టరీలో తల్లితో కలసి పని చేసిన ఆమె, రెండు పూటలా మంచి భోజనంపై ఆశతో హాకీ హాస్టల్లో చేరి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఉదితా దుహన్ (హరియాణా) తండ్రి హ్యండ్ బాల్ క్రీడాకారుడు కావడంతో ఆటలపై ఆసక్తి పెంచుకున్న ఉదిత... హాకీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. జూనియర్ స్థాయిలో రాణించి సీనియర్ టీమ్‌లోకి ఎదిగింది. లాల్రెమ్సియామి (మిజోరం) తన రాష్ట్రం నుంచి హాకీ జాతీయ జట్టుకు ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సియామి... కెరీర్ ఆరంభంలో హిందీ, ఇంగ్లీష్లలో ఏదీ రాకపోవడంతో చాలా కాలం సైగల భాషతోనే సహచరులతో సంభాషించేది. వందనా కటారియా (ఉత్తరాఖండ్) ఒలింపిక్స్ సమయంలో ఎక్కువగా చర్చలోకి వచ్చిన పేరు. ఆమె ఆటను బట్టి కాకుండా కులం పేరుతో వందన దూషణకు గురైంది. హరిద్వార్‌లో చుట్టుపక్కల వాళ్లంతా వెక్కిరించినా తండ్రి అండగా నిలబడి హాకీ నేర్పించాడు. ఆమె ఆటలో ఎదిగేందుకు తాను చేయగలిగినంతా చేసిన ఆయన మూడు నెలల క్రితం వందన... జాతీయ శిబిరంలో ఉన్న సమయంలో చనిపోయాడు. దురదృష్టవశాత్తు అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన వందన... దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యట్రిక్ సాధించి కన్నీళ్లపర్యంతమైంది. సలీమా టెటె (జార్ఖండ్) హాకీ ఆటకు సంబంధించి ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా... రాళ్లు, రప్పలను కాస్త జరిపి మట్టి మైదానాన్ని సిద్ధం చేసుకుంటే తప్ప ఆడలేని పరిస్థితిలో సలీమా హాకీకి ఆకర్షితురాలు కావడం విశేషం. పొలంలో పని చేసి సంపాదించిన డబ్బుతో ఆమె స్టిక్ కొనుక్కుంది. నవనీత్ కౌర్ (హరియాణా) 2013నుంచి భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడుతున్న కొందరిలో నవనీత్ కూడా ఉంది. రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న కౌర్... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మోనికా మలిక్ (హరియాణా) భారత జట్టులో ఉన్నత విద్యావంతురాలు. పోలీస్ అయిన తండ్రి ప్రోత్సాహంతో హాకీలోకి వచ్చి సత్తా చాటిన మోనికా ఎంబీఏ పూర్తి చేసింది. షర్మిలా దేవి (హరియాణా) జాతీయ స్థాయి హాకీ ఆటగాడైన తాతతో కలసి తొలిసారి మైదానానికి వెళ్లిన షర్మిలలో ఆటపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. అన్ని వైపులనుంచి దక్కిన ప్రోత్సాహంతో పూర్తిగా హాకీపైనే దృష్టి పెట్టింది. సవితా పూనియా (హరియాణా) తాత ప్రోత్సాహం, తండ్రి సహకారంతో సవితా హాకీలోకి అడుగు పెట్టింది. అయితే గోల్‌కీపర్‌కు ఉండే భారీ కిట్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం బాగా ఇబ్బందిగా మారి ఒక దశలో ఆటను వదిలేద్దామని అనుకుంది. అయితే అప్పటికే స్థానిక పోటీల్లో గోల్ కీపర్‌గా వచ్చిన గుర్తింపునకు తగిన ప్రోత్సాహం కూడా దక్కడంతో ఆటను కొనసాగించింది. సుదీర్ఘ కాలంగా భారత గోల్‌కీపర్‌గా జట్టు విజయాల్లో ప్రధాన భాగంగా మారింది. గుర్జీత్ కౌర్ (పంజాబ్) తాను చదువుతున్న హాస్టల్ సమీపంలో హాకీ గ్రౌండ్ ఉండటంతో ఆటకు ఆకర్షితురాలైన గుర్జీత్... ఒక్కసారి హాకీ స్టిక్ తీసుకున్న తర్వాత వెనుదిరిగిచూడలేదు. ఆసీస్‌పై విజయంలో ఆమె చేసిన గోల్ కీలక పాత్ర పోషించింది. నవజోత్ కౌర్ (హరియాణా) మెకానిక్ అయిన తండ్రి తన పిల్లల్లో ఒక్కరైనా క్రీడల్లో ఉండాలని కోరుకున్నాడు. ఆయన కల నెరవేర్చే క్రమంలో నవజోత్ హాకీ స్టిక్ అందుకుంది. 2012 నుంచి టీమ్‌లో ఆమె కీలక సభ్యురాలు. -
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి ►ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా పరాజయం పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన భజరంగ్.. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజి ముందు భజరంగ్ నిలవలేకపోయాడు. కాగా కాంస్య పతక పోరు కోసం భజరంగ్ పూనియా రేపు మరో మ్యాచ్ ఆడనున్నాడు. Tokyo Olympics 2020 Live Updates: గోల్ఫ్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశం కనబడుతోంది. మూడో రౌండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్ పతకం సాధించేలా కనిపిస్తోంది. వాతావరణం అనుకూలించకుంటే, శనివారం జరుగనున్న నాలుగో రౌండ్ ఫలితం తేలనట్లయితే, మూడో రౌండ్ ఫలితాలను బట్టి అదితి అశోక్‌కు మెడల్ వచ్చే అవకాశం ఉంది. సెమీస్ చేరిన భజరంగ్ ► పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీస్ చేరాడు. ఇరాన్ రెజ్లర్‌పై 2-1 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు. ► రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సత్తా చాటాడు. కజికిస్థాన్ రెజ్లర్ అక్మతలీవ్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పోరాడి ఓడిన భారత్ ►కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల జరిగిన హోరాహోరీ పోరులో బ్రిటన్ విజయం సాధించింది. 4-3 తేడాతో భారత్‌పై గెలుపొందింది. నాలుగో క్వార్టర్ ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బ్రిటన్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన రాణి సేన.. ఈ ఓటమి కారణంగా రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరిగిరానుంది. ►మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమంగా ఉన్నాయి. నిరాశ పరిచిన సిమీ బిస్లా ►రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సారా హమీద్ చేతిలో భారత మహిళా రెజ్లర్ సీమీ బిస్లా ఓటమి పాలైంది. బ్రిటన్‌తో భారత్ హోరాహోరీ ►రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-2తో ఆధిపత్యం ప్రదర్శించగా... మూడో క్వార్టర్ ఆరంభంలోనే గోల్ కొట్టి 3-3కి భారత్ ఆధిక్యాన్ని బ్రిటన్ తగ్గించేసింది. ►బ్రిటన్‌తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకున్న రాణి సేన క్వార్టర్ ముగిసే సరికి వరుస గోల్స్ చేసి 3-2తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు. ► శుక్రవారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో భారత్-గ్రేట్ బ్రిటన్ మధ్య కాంస్యపు పోరు. ► బ్రిటన్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్.. సేవ్ చేసిన నవనీత్ ►లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. Let's own the stage. 💪 🇬🇧 0:0 🇮🇳https://t.co/FEfTJeC69a#GBRvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/sC5lUzw937 — Hockey India (@TheHockeyIndia) August 6, 2021 ►ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. ► పురుషుల 50 కి.మీ నడకలో భారత్‌కు నిరాశ. 50 కి.మీ నడకను పూర్తిచేయలేకపోయిన గురుప్రీత్‌సింగ్. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ►ఉ.7 నుంచి హాకీ మహిళల కాంస్య పతక పోరు (భారత్ Vs బ్రిటన్) ►ఉ. 8 గంటలకు రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగం (సీమీ బిస్లా) ►ఉ.8:45కు రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగం (బజరంగ్ పునియా) ►మ.ఒంటిగంట నుంచి మహిళల 20 కి.మీ వడక (ప్రియాంక, భావన) ►మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్ పురుషుల సెమీస్ ►మధ్యాహ్నం 3:15 నుంచి రెజ్లింగ్ మహిళల సెమీస్ సాయంత్రం 5 గంటలకు పురుషుల 4x400 మీటర్ల హీట్స్ -
కరోనాను జయించి.. కనకంతో మెరిసి..
టోక్యో: బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్ టామ్ డియాన్ ఒకటి కాదు... రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడ్డాడు. స్వదేశంలోనే అతనిపై ఏమాత్రం అంచనాలు లేవు. కరోనాతోనే సరిపోతుంది... టోక్యోదాకా ఏం వెళతాడులే! అని కొందరంటే... అతనికి ఈ నేషనల్ ట్రయల్సే ఎక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ టామ్ డియాన్ అలాంటి అభిప్రాయాలను, అనుమానాలను పటాపంచలు చేశాడు. అంచనాల్ని తారుమారు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో టామ్ బంగారు పతకం గెలుపొందాడు. గత సెప్టెంబర్‌లో తొలిసారి అతనికి కోవిడ్ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే ఈ జనవరిలోనూ వైరస్ బారిన పడ్డాడు. ఈసారి కరోనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు ఓ పట్టాన తగ్గనేలేదు. అందుకే అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోయింది. కానీ ఇక్కడ మాత్రం అతనే విజేత! పోటీని టామ్ అందరికంటే ముందుగా 1ని:44.22 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు డన్కన్ స్కాట్ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్ స్విమ్మర్ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచాడు. వందేళ్లలో బ్రిటన్ స్విమ్మర్లు ఒకే ఈవెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా ఇదే మొదటిసారి. 1908 లండన్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ స్విమ్మర్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. ఆ తర్వాత తాజాగా టోక్యోలోనే దీన్ని పునరావృతం చేశారు. -
కరోనా: భారత హాకీ దిగ్గజం ఇక లేరు
సాక్షి, లక్నో: కరోనా మహమ్మారి మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60) కరోనా కారణంగా శనివారం కన్నుమూశారు. ఏప్రిల్ 24న కరోనా సోకడంతో లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే వైరస్ నుంచి కోలుకొని సాధారణ వార్డుకు చేర్చిన అనంతరం శుక్రవారం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. రవీందర్ పాల్ మరణంపై హాకీ ఇండియా ట్విటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసింది. క్రీడా మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. ఒక గోల్డెన్ క్రీడాకారుడిని కోల్పోయిదంటే ట్వీట్ చేశారు. క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ నివాళులర్పించారు. కాగా 1980లో మాస్కో ఒలింపిక్ విజేత జట్టులో రవీందర్ పాల్ సింగ ఉన్నారు. అలాగే కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్ జూబ్లీ కప్ (హాంకాంగ్), 1982 ప్రపంచకప్ (ముంబై, 1982 ఆసియా కప్ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1984 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. లక్నోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! Saddened to learn about the loss of former India International who was part of the Gold Medal winning Indian squad at the 1980 Moscow Olympics, Mr. Ravinder Pal Singh. Hockey India sends its condolences to his family and loved ones. 🙏#IndiaKaGame pic.twitter.com/vHjIQlrDqW — Hockey India (@TheHockeyIndia) May 8, 2021 Deeply saddened by the passing of Ravinder Pal Singh sir, member of the 1980 Gold-winning Olympics team. It was a unit which taught generations of us the value of dream, dedication and hard work. May his soul rest in peace. #COVIDSecondWave #Indianhockey 📷 Lucknow Tribune pic.twitter.com/r4RqBMv3Ns — SV Sunil | ಎಸ್.ವಿ. ಸುನಿಲ್ (@SVSunil24) May 8, 2021 -
హాకీ లెజెండ్ కన్నుమూత: సీఎం సంతాపం
సాక్షి,ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం,అర్జున అవార్డు గ్రహీత మైఖేల్ ఖిండో(73) ఇకలేరు. వయసు సంబంధిత ఇబ్బందితోపాటు, కొంతకాలంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న మైఖేల్ గురువారం తుది శ్వాస తీసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నామని తెలిపారు. అటు ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మైఖేల్ ఖిండో మృతిపై సంతాపం ప్రకటించారు. హాకీ లెజెండ్ ఖిండో కన్నుమూతపై హాకీ ఇండియా, ఒడిశా స్పోర్ట్స్, మాజీ ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. కాగా కౌలాలంపూర్‌లో 1975లో హాకీ ప్రపంచ కప్, 1972 ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నారు మైఖేల్. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. Deeply saddened to know the passing away of hockey legend and Arjuna Awardee #MichaelKindo, a tribal icon and part of India's World Cup winning team of 1975. My thoughts are with his family and fans. — Naveen Patnaik (@Naveen_Odisha) December 31, 2020 You'll live forever in our hearts, Michael!🙏#RIPMichaelKindo💙 pic.twitter.com/Sd1CYHRxB3 — Team India (@WeAreTeamIndia) December 31, 2020 -
ఇ-వ్యర్థాలతో ఒలింపిక్ మెడల్స్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా 2020లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల్లో గెలుపొందినవారికి ఈసారి ప్రత్యేక పతకాలను ఇవ్వనున్నారు. అంటే... స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇవ్వరా? అని అడక్కండి. ఎందుకంటే.. ఎప్పటిలాగే బంగారు, వెండి, కాంస్య పతకాలే ఇస్తారు. అయితే పతకాల తయారీకి ఈ లోహాలను సేకరించడం మాత్రం గతంలోకంటే భిన్నం. ఇ-వ్యర్థాల నుంచి సేకరణ సాధారణంగా మనం ఉపయోగించే ప్రతి ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలుంటాయ నే విషయం తెలిసిందే. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల మదర్ బోర్డుల్లో పూతగా ఈ లోహాలను వినియోగిస్తారు. ఈ గ్యాడ్జెట్ల వినియోగం బాగా పెరగడంతో.. పాడైపోయిన వాటిని రిపేర్ చేయించుకొనే పరిస్థితి లేదు. పక్కన పడేసి కొత్తవి కొంటున్నారు. దీంతో ఏటా లక్షల టన్నుల్లో ఇ–వేస్ట్ పోగవుతోంది. గుట్టల్లా పేరుకుపోతున్న ఇ–వ్యర్థాలు మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. దీంతో ఇ–వ్యర్థాల వల్ల తలెత్తే విపత్తుపై అవగాహన కల్పించడానికి టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కమిటీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పతకాల తయారీకి అవసరమైన లోహాలను ఇ-వ్యర్థాలను రీసైకిల్ చేసి సేకరించాలని నిర్ణయించారు. జపాన్‌లోని స్థానిక కంపెనీల నుంచి ఇ-వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహాకులు తెలిపారు. మార్చి నెలాఖరునాటికి పతకాల తయారీకి అవసరమైనస్థాయిలో ఇ–వ్యర్థాలను సేకరిస్తామని, ఆ తర్వాత వాటి నుంచి బంగారం, వెండి, ఇతర లోహాలను వేరుచేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. -
ప్రభాస్ అంటే పిచ్చి: అరుణా రెడ్డి
‘నా లక్ష్యం 2020 ఒలింపిక్స్. ఇక నుంచి నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. మరో ఆరేళ్లు పెళ్లి గురించి ఆలోచించను. ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటలు, షాపింగ్ చేస్తుంటాను. కారులో తిరుగుతూ సిటీలో రౌండ్స్ వేయడమంటే మరీఇష్టమ’ని చెప్పింది జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు.. హిమాయత్‌నగర్ :‘పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒలింపిక్స్ మీదనే. నా వయసు కూడా చాలా చిన్నదే కాబట్టి ఇప్పుడే పెళ్లేంటని ఆలోచిస్తున్నాను. సో... సిక్స్ ఇయర్స్ వరకు నో మ్యారేజ్. ఆరేళ్ల తర్వాతే పెళ్లి. అది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది అప్పుడే చెబుతాను. అప్పటి వరకు సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చింది జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి. కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. శుక్రవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ... నాకు టైమ్ దొరికితే ఫ్యామిలీతోనే ఉంటాను. మా అక్క, బావ, వారి పిల్లలతో ఎంజాయ్ చేస్తాను. పిల్లలు పూర్వీ, నిషాంత్‌లతో ఆడుకుంటాను. వాళ్లే నా ప్రపంచం. ప్రతిరోజు అమ్మ సుభద్ర, అక్క పావని నాకోసం వెరైటీ వంటలు చేస్తుంటారు. వారికి రెస్ట్ ఇచ్చేందుకు అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తుండేదాన్ని. అలా అలా వంటలు నేర్చుకున్నాను. ఎక్కువగా ‘బ్రౌనీస్’ చేస్తుంటాను. వీకెండ్స్‌లో చికెన్, మటన్, ఫిష్ కర్రీ వండి ఇంట్లో వాళ్లపైనే ట్రై చేస్తుంటాను (నవ్వుతూ). అవి ఎలా ఉంటాయో వాళ్లు చెప్పరు. కానీ సూపర్ ఉందని మాత్రం అంటారు. డ్రైవింగ్.. షాపింగ్ ఈ మధ్య డ్రైవింగ్‌పై ఇష్టం పెరిగింది. సిటీలోని ఇరుకు రోడ్లపై డ్రైవింగ్ చేయడం థ్రిల్‌గా అనిపిస్తుంది. మొదట్లో డ్రైవింగ్ చేయాలంటే భయం వేసేది. కానీ ఆటల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అమ్మాయిలు డ్రైవింగ్ చేయడం చూశాను. నేనెందుకు నేర్చుకోకూడదని, ఇంటికి వచ్చాక నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను (నవ్వూతూ). టైమ్ దొరికితే చాలు.. షాపింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యమిస్తా. స్పోర్ట్స్ డ్రెస్సెస్ ధరించడంతో అవే అలవాటు అయ్యాయి. దీంతో ప్రతిసారి ప్రముఖ బ్రాండ్ల టీషర్టులను కొనుక్కుంటాను. నా దగ్గర దాదాపు 100కు పైగా టీషర్టులు ఉన్నాయి. చీరలు కట్టుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఒక్క చీర కూడా కొనుక్కోలేదు. అక్క చీరలన్నీ కట్టి పడేస్తూ విసుగు తెప్పిస్తుంటాను (నవ్వుతూ). పండగల సమయంలో చీరలు కట్టుకుంటాను. సిటీలో రౌండ్స్ స్కూల్ టైమ్ నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మొదట్లో ఏదైనా సినిమా చూడాలనిపిస్తే నాన్నకి చెప్పేదాన్ని. నాన్న ప్రాక్టీస్ అయిపోయాక తీసుకెళ్లేవారు. నాన్న మరణించాక అక్క, బావ వాళ్లతో వెళ్తున్నాను. హీరో ప్రభాస్ అంటే పిచ్చి. అనుష్క అంటే కూడా అభిమానం. బాలీవుడ్లో సారా అలీఖాన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నైట్‌లో మన సిటీ చాలా అందంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మన సిటీని బాగా మిస్సవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆ టైమ్‌లో అక్కకి, బావకి చెప్పి కారులో సిటీ మొత్తం రౌండ్స్ వేస్తాం. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, చార్మినార్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాల్లో తిరుగుతుంటాం. ఫిట్నెస్... ఫిట్నెస్ కోసం చాలా కష్టపడతాను. ప్రారంభంలో చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలవాటై పోయింది. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. 10 నిమిషాలు వ్యాయామం చేశాక... లెమన్ వాటర్ తీసుకొని ప్రాక్టీస్‌కి వెళ్తాను. మళ్లీ 9గంటలకు ఇంటికి వస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్ కర్రీ విత్ చపాతీ తింటాను. ఆ తర్వాత రెండు గంటలు నిద్రపోతాను. లంచ్‌లో లైట్‌గా రైస్, నాన్‌వెజ్‌తో రోటీ తీసుకుంటాను. మళ్లీ మూడు గంటలకు జిమ్‌కి వెళ్తాను. ఆ తర్వాత ప్రాక్టీస్. రాత్రి ఇంటికి వచ్చాక రోటీ తిని పడుకుంటాను. ప్రతిరోజు 6–7గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టార్గెట్ ఒలింపిక్స్.. ఇప్పుడే గాయం నుంచి కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది. అక్టోబర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ చివరి క్వాలిఫయర్‌లో హాజరవుతాను. అందులో కచ్చితంగా ఎంపికై 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటాను. పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. గాయం నాలో మరింత కసి, పట్టుదలను పెంచింది. ఇప్పుడు నా దృష్టంతా ఒలింపిక్స్ పైనే. -
పచ్చడి అన్నంతో ఒలింపిక్స్ పతకం చేజారింది!
తిరువనంతపురం : అలనాటి పరుగుల రాణి పీటీ ఉష 1984లో లాస్ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్స్‌లో పతకం చేజారడానికి కారణాలు చెబుతూ ఆవేదనం వ్యక్తం చేశారు. కేవలం పచ్చడి కలిపిన అన్నం మాత్రమే తనకు ఆహారంగా ఇవ్వడంతో శక్తికి మించి పరుగులు తీసినా భారత్‌కు పతకాన్ని అందించలేక పోయానని తెలిపారు. 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ప్రతి రౌండ్లో అద్భుత ప్రదర్శన ఇస్తూ ఫైనల్స్‌కు వెళ్లారు. ‘ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించానని సంతోషించేలోపే ఆమె ఆనందం ఆవిరైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కొజోకరు కూడా అదే సమయంలో ఈవెంట్ పూర్తి చేశారు. ఇంకా చెప్పాలంటే పీటీ ఉష కంటే సెకన్లో వందో వంతు సమయం ముందుగానే హర్డిల్స్ పూర్తి చేశారని ప్రకటింగానే తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని చెప్పారు. ఒలింపిక్ గ్రామంలో కేవలం అమెరికా వంటకాలు, ఆహారం మాత్రమే దొరుకుతుందని ముందుగా మాకు ఎవరు చెప్పలేదు. ఒలింపిక్ విలేజ్‌లో పోషకాలున్న ఆహారం నాకు ఇవ్వలేదు. కేవలం మామాడికాయ పచ్చడి, అన్నం మాత్రే ఆహారంగా ఇచ్చారు. చికెన్, బంగాళాదుంపలు వంటి ఆహారాన్ని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ కారణంగా నా ఎనర్జీ లెవల్స్ చాలా తగ్గిపోయాయి. తొలి 45 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 6.2 సెకన్లలో పూర్తిచేసి అద్భుతంగా ఆరంభించా. శాయశక్తులా యత్నించినా చివరి 35 మీటర్ల రేసులో కాస్త నెమ్మదించాను. ఎందుకంటే తగినంత పోషకాహారం తీసుకోని కారణంగా మూడో స్థానాన్ని సైతం వెంట్రుకవాసిలో కోల్పోయి పతకాన్ని చేజార్చుకున్నానని’ లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో జరిగిన అనుభవాలను పీటీ ఉష నెమరువేసుకున్నారు. ప్రస్తుతం ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌పై పూర్తిగా దృష్టిసారించానని చెప్పారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మెరుగైన అథ్లెట్లను తయారు చేసి దేశానికి పతకాలు అందించడమే తన లక్ష్యమని పీటీ ఉష వివరించారు. -
కడప గడపలో క్రీడా పద్మం మల్లేశ్వరి
కడప జన్మభూమిగా.. శ్రీకాకుళం కర్మభూమిగా భావిస్తానని.. తెలుగు ఆడపడచుగా తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయి పతకాలు సాధించి చూపుతానంటున్నారు పద్మశ్రీ కరణం మల్లేశ్వరి.. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కడప నగరానికి విచ్చేశారు.. ఈమెను సాక్షి పలుకరించగా పలు విషయాలు వెల్లడించారు. కడప స్పోర్ట్స్:అమ్మాయిలకు ఆటలేంటి... అన్న వారే అదరహో.. అన్నారు.. సన్నగా ఉన్నావు బరువులెత్తే వెయిట్లిఫ్టింగ్కు పనికిరావు అన్న వారే.. భారతదేశపు.. పరువు నీవేనన్నారు.. తర్వాత కాలంలో.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి.. అర్జున, రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి మరెన్నో పురస్కారాలు ఈమెను వరించాయి.. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని.. తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని అంటోంది క్రీడా పద్మం కరణం మల్లేశ్వరి. గురువారం కడప నగరానికి విచ్చేసిన ఆమె సాక్షితో పలు విషయాలను పంచుకుంది. సాక్షి :చరిత్రలో నిలిచేలా తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళా క్రీడాకారిణిగా మీ స్పందన..? మల్లేశ్వరి : క్రీడలు అంటే తక్కువగా తెలిసిన సమయంలో.. ఒలంపిక్స్ అంటే ఏందో సరిగా తెలియని సమయంలో ఎన్నో ఆటుపోట్ల మధ్య క్రీడాసాధన సాగింది. దేశానికి పతకం సాధించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోవడం సంతోషంగా గర్వంగా ఉంది. అయితే అప్పటితో పోల్చితే నేడు మౌలిక సదుపాయాలు పెరిగాయి. సాక్షి :ప్రభుత్వం నుంచి లభించిన ప్రోత్సాహం..? మల్లేశ్వరి :సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించడంతో ప్రభుత్వం రూ.35 లక్షలు నగదు ప్రోత్సాహం అందించారు. హైదరాబాద్‌లో స్థలం కేటాయించారు. అయితే తర్వాత నేను ఏథెన్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించడంతో స్థలం తీసుకోలేకపోయాను. తర్వాత ప్రయత్నించినప్పటికీ స్థలం లభించలేదు. అప్పట్లో ప్రభుత్వం కనీసం ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు. సాక్షి :ఇప్పుడు ప్రభుత్వం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి నగదు బహుమతి, గ్రూప్–1 కేడర్ ఉద్యోగాలు ఇస్తోంది కదా.. మీ స్పందన..? మల్లేశ్వరి : క్రీడలను ప్రోత్సహించేందుకు నగదు బహుమతి, స్థలం, ఉద్యోగం ఇవ్వడం సంతోషకరమే. అయితే ఈ ప్రోత్సాహం అన్ని క్రీడల్లో రాణించే వారికి కూడా ఇవ్వడంతో పాటు అన్ని క్రీడలను సమానంగా చూస్తే బాగుంటుంది. సాక్షి :ఆంధ్రా ఆడపడుచుగా తెలుగు రాష్ట్రాల్లో అకాడమీ ఏర్పాటు చేసి వెయిట్‌లిఫ్టింగ్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందా..? మల్లేశ్వరి : రాయలసీమలో పుట్టి.. ఉత్తరాంధ్రలో పెరిగిన నాకు ఇక్కడి క్రీడాకారులకు ఎంతో చేయాలని ఉంది. ప్రభుత్వం తగినంత స్థలం కేటా యించి, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే అకాడమీని ఏర్పాటు చేసి సేవలందిస్తా. సాక్షి :రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు కదా.. అక్కడ ఏమైనా అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా..? మల్లేశ్వరి : తొలి పతకం సాధించిన మహిళా వెయిట్ లిఫ్టర్‌ను నేను. అయితే ప్రభుత్వాలు ఈ విషయంలో మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మా సహకారం కోరితే తప్పకుండా అందిస్తాం. 20 సంవత్సరాల అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాక్షి : భవిష్యత్తులో భారత్ నుంచి ఒలింపిక్ మెడల్స్ మరిన్ని ఆశించవచ్చా..? మల్లేశ్వరి : 130 కోట్లు ఉన్న భారతదేశంలో మనకు లభిస్తున్న పతకాల సంఖ్య తక్కువే. దీర్ఘకాలిక వ్యూహంతో పాటు చక్కటి ప్రోత్సాహం ఇస్తే అసాధ్యమేమీ కాదు. రానున్న కాలంలో మంచి ఫలితాలు, పతకాలు వస్తాయనుకుంటున్నా. సాక్షి : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు ప్రభుత్వాలు ఇటీవల తీసుకున్న చర్యలు ఎటువంటి ఫలితాలు ఇస్తుందనుకుంటున్నారు..? మల్లేశ్వరి :కేంద్ర క్రీడల మంత్రి ఒలింపిక్ మెడలిస్టు కావడం సంతోషం. ఇటీవల ఖేలోఇండియాతో పాటు పలు టాలెంట్‌హంట్ స్కీంలు చక్కగానే ఉన్నాయి. ఇందులో సైతం క్రీడల్లో రాణించిన వారినే సభ్యులుగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నా. సాక్షి : క్రీడలు ముఖ్యమా.. చదువు ముఖ్యమా.. అన్న డైలమా చాలా మందిలో ఉంది.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు..? మల్లేశ్వరి :ఖచ్చితంగా చదువుకు ప్రాధాన్యత ఉంది. 8 నుంచి 25 సంవత్సరాల దాకా చదువుకు, క్రీడల సాధనకు ఎంతో విలువైన సమయం. వారి శారీరక, మానసిక స్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. క్రీడలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యత ఇస్తే కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది. సాక్షి : క్రీడల అభివృద్ధికి మీరిచ్చే సూచన..? మల్లేశ్వరి :ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన, పతకాలు సాధించిన వారి సలహాలు తీసుకుంటే బాగుంటుంది. రాజధానిలో నిర్మిస్తున్న క్రీడానగరంలో ఏర్పాటు చేసే అంశాలపై కూడా చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి :మీ పిల్లలు మీ వారసులుగా క్రీడల్లోకి తీసుకువస్తున్నారా..? మల్లేశ్వరి : మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు (10వ తరగతి) రైఫిల్షూటింగ్లోను, చిన్నబాబు (6వ తరగతి) ఫిట్నెస్ సాధించేందుకు జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నారు. వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా స్వేచ్చనిచ్చాం. సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సందేశం..? మల్లేశ్వరి : మనదేశంలో యువశక్తి చాలా ఉంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానిని సాధించేందుకు కష్టపడాలి. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతో సాధన చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు తాము అబలం.. కాదు.. ఆదిశక్తి అంశమన్న విషయం గుర్తుంచుకోవాలి. దేశానికి పతకం తీసుకువచ్చిన వారిలో అమ్మాయిలే అగ్రస్థానంలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. సాక్షి :మీ అకాడమీ నుంచి ఒలింపిక్స్‌లో పతకాలు ఆశించవచ్చా..? మల్లేశ్వరి :హర్యానాలో నిర్వహిస్తున్న అకాడమీ నుంచి రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయనుకుంటున్నా. రానున్న 2024, 2028 ఒలంపిక్స్‌లో పతకాలే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం. సాక్షి :కడపతో మీకున్న అనుబంధం..? మల్లేశ్వరి :కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయపల్లె మా అమ్మగారి ఊరు. కాబట్టి కడప జిల్లాను నా జన్మభూమిగా భావిస్తా. నాన్నది చిత్తూరు జిల్లా. శ్రీకాకుళం నేను పెరిగిన ప్రాంతం కాబట్టి అది నా కర్మభూమిగా భావిస్తా. సాక్షి : మళ్లీ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ మనదేశం నుంచి ఆశించవచ్చా..? మల్లేశ్వరి :వాస్తవానికి లైట్ వెయిట్ కేటగిరీలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఒలింపిక్ పతకం సాధించడం కాస్త కష్టపడితే సాధ్యమే. ఖచ్చితంగా పతకం వచ్చే విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్ ఒకటి. -
శివ కేశవన్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వరుసగా ఆరోసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత స్టార్ ‘ల్యూజ్’ క్రీడాకారుడు శివ కేశవన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. జర్మనీలోని అల్టెన్బర్గ్లో శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో శివ కేశవన్ అందరికంటే వేగంగా 55.60 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. లియెన్ తె అన్ (చైనీస్ తైపీ–56.12 సెకన్లు) రజతం... కిమ్ డాంగ్ క్యు (కొరియా–56.50 సెకన్లు) కాంస్యం గెలిచారు. వాస్తవానికి జపాన్‌లో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను సాంకేతిక కారణాలరీత్యా జర్మనీలో నిర్వహించాల్సి వచ్చింది. -
ఇషిత.. బ్యాడ్మింటన్‌లో చిరుత
పి.వి.సింధు భారత బ్యాడ్మింటన్ సంచలనం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించిన తెలుగు క్రీడాకారిణి. ఆమె అందించిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చిన్నారులు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదే స్ఫూర్తితో జిల్లాలోని గుంతకల్లుకు చెందిన ఇషిత బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడే అయిన తండ్రి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైంది. అనంతపురం సప్తగిరి సర్కిల్: గుంతకల్లుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సురేష్‌కుమార్, నర్మద దంపతుల కుమార్తె ఇషిత. పి.వి.సింధు స్ఫూర్తితో తండ్రి బాటలోనే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుంది. తాను ఎంచుకున్న లక్ష్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. తల్లిదండ్రుల తోడ్పాటు, కోచ్ ఫణికుమార్ అందించిన మెలకువలు తనను అండర్–14 విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యేలా చేశాయి. ప్రతిభకు పదును.. గుంతకల్లు పట్టణంలో కోచ్‌లు మౌళి, రహీమ్ వద్ద గేమ్ నేర్చుకున్న ఇషిత ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు అనంతపురంలోని స్మాష్ అకాడమీలో చేరింది. ఏడాదిన్నర వ్యవధిలోనే కోచ్ ఫణికుమార్ అందించిన మెలకువలతో ఉన్నత స్థాయికి చేరింది. ప్రత్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ సైడ్ డ్రాప్, హాఫ్ స్మాష్, ట్రిపుల్స్ ద్వారా ఆటలో పైచేయి సాధిస్తోంది. షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ల ద్వారా నిర్వహించే ర్యాంకింగ్ టోర్నీల్లో ప్రతిభ కనబరిచి మినీ స్టేట్ టోర్నీలో డబుల్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. చీరాలలో నిర్వహించిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఎంపికలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో జాతీయస్థాయి సింగిల్స్ విభాగంలో ఎంపికైంది. ఈనెలలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒలింపిక్సే లక్ష్యం పి.వి.సింధు లాగా ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. జాతీయస్థాయికి ఎంపికే దీనికి మొదటి అడుగుగా భావిస్తాను. రోజూ 4 నుంచి 5 గంటలపాటు సాధన చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ నేర్పిస్తున్న మెలకువలతోనే బ్యాడ్మింటన్‌లో రాణించగలుగుతున్నాను. ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటాను. – ఇషిత -
మరి నా సంగతేంటి!
ఒలింపిక్స్ ప్రోత్సాహకమే అందలేదు సైనా నెహ్వాల్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: సానియామీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన వివాదం కొనసాగుతుండగానే ... మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి మరో రకంగా తన అసంతృప్తిని బయట పెట్టింది. ఆ ప్లేయర్ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కావటం విశేషం. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం ఇప్పటికీ అందలేదని ఆమె వ్యాఖ్యానించింది. సానియా ‘అంబాసిడర్’ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ మాట అనడం గమనార్హం. ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా ఎంపిక కావడం సంతోషకరం. తెలంగాణ పట్ల నేను కూడా గర్వపడుతున్నాను. కానీ రెండేళ్ల క్రితం ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాను. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నగదు ప్రోత్సాహకమే రాష్ట్ర ప్రభుత్వంనుంచి దక్కకపోవడం నన్ను కలిచి వేసింది’ అని సైనా ట్వీట్ చేసింది. ఇంకెన్నాళ్లు..: ప్రభుత్వం తరఫునుంచి ఇన్నాళ్లుగా ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే తాను ఇప్పుడు బహిరంగంగా తన బాధ వెల్లడించాల్సి వచ్చిందని సైనా ‘సాక్షి’తో చెప్పింది. సమైక్య రాష్ట్రంలో పతకం గెలిచానని, ఇప్పుడు తనకు ఎవరు క్యాష్ అవార్డు ఇస్తారో కూడా తెలియని సందిగ్ధత ఉందని, దీనికి ఎవరూ సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆవేదనగా చెప్పింది. ‘నా అంతట నేనుగా చెప్పకూడదని ఇప్పటి వరకు అనుకున్నాను. ఇంకెన్నాళ్లు ఆగమంటారు. రెండేళ్లు గడిచిపోయాయి. సానియాకో మరొకరికో ఏదైనా ఇవ్వడం పట్ల నాకు బాధ లేదు. కానీ మాకు న్యాయంగా, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందైనా అందించాలిగా’ అని సైనా వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైనాకు రూ. 50 లక్షలు బహుమతి ప్రకటించారు.