సాక్షి,ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం,అర్జున అవార్డు గ్రహీత మైఖేల్ ఖిండో(73) ఇకలేరు. వయసు సంబంధిత ఇబ్బందితోపాటు, కొంతకాలంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న మైఖేల్ గురువారం తుది శ్వాస తీసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నామని తెలిపారు. అటు ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మైఖేల్ ఖిండో మృతిపై సంతాపం ప్రకటించారు. హాకీ లెజెండ్ ఖిండో కన్నుమూతపై హాకీ ఇండియా, ఒడిశా స్పోర్ట్స్, మాజీ ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. కాగా కౌలాలంపూర్‌లో 1975లో హాకీ ప్రపంచ కప్, 1972 ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నారు మైఖేల్. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
Deeply saddened to know the passing away of hockey legend and Arjuna Awardee #MichaelKindo, a tribal icon and part of India's World Cup winning team of 1975. My thoughts are with his family and fans.
— Naveen Patnaik (@Naveen_Odisha) December 31, 2020
You'll live forever in our hearts, Michael!🙏#RIPMichaelKindo💙 pic.twitter.com/Sd1CYHRxB3
— Team India (@WeAreTeamIndia) December 31, 2020
Comments
Please login to add a commentAdd a comment