
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వరుసగా ఆరోసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత స్టార్ ‘ల్యూజ్’ క్రీడాకారుడు శివ కేశవన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. జర్మనీలోని అల్టెన్‌బర్గ్‌లో శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో శివ కేశవన్ అందరికంటే వేగంగా 55.60 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. లియెన్ తె అన్ (చైనీస్ తైపీ–56.12 సెకన్లు) రజతం... కిమ్ డాంగ్ క్యు (కొరియా–56.50 సెకన్లు) కాంస్యం గెలిచారు. వాస్తవానికి జపాన్‌లో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను సాంకేతిక కారణాలరీత్యా జర్మనీలో నిర్వహించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment