Shiva Kesavan
-
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం వేదికగా ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 92 దేశాల నుంచి 2,920 మంది క్రీడాకారులు 102 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (శివ కేశవన్, జగదీశ్) బరిలో ఉన్నారు. వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న శివ కేశవన్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా వ్యవహరించాడు. -
శివ కేశవన్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వరుసగా ఆరోసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత స్టార్ ‘ల్యూజ్’ క్రీడాకారుడు శివ కేశవన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. జర్మనీలోని అల్టెన్బర్గ్లో శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో శివ కేశవన్ అందరికంటే వేగంగా 55.60 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. లియెన్ తె అన్ (చైనీస్ తైపీ–56.12 సెకన్లు) రజతం... కిమ్ డాంగ్ క్యు (కొరియా–56.50 సెకన్లు) కాంస్యం గెలిచారు. వాస్తవానికి జపాన్‌లో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను సాంకేతిక కారణాలరీత్యా జర్మనీలో నిర్వహించాల్సి వచ్చింది. -
శివ కేశవన్‌కు స్వర్ణం
నగానో (జపాన్): భారత స్టార్ వింటర్ ఒలింపియన్ శివ కేశవన్ మరోసారి రాణించాడు. ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ అతను అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచాడు. గంటకు 130.4 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన అతను ఒక నిమిషం 39.962 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తనాకా షోహీ (జపాన్–1ని:44.874 సెకన్లు) రజత పతకాన్ని సంపాదించగా... లియెన్ తె ఆన్ (చైనీస్ తైపీ–1ని:45.120 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. 35 ఏళ్ల శివ కేశవన్ ఇప్పటివరకు వరుసగా ఐదు వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరంగా నిలిచిన కేశవన్... 2018లో కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, వరల్డ్ కప్ సర్క్యూట్ ఈవెంట్స్‌లో పాల్గొని ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని తెలిపాడు.