
కకమిగహర (జపాన్): భారత మహిళల హాకీ జట్టు అసాధారణ విజయంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. శనివారం పూల్ ‘ఎ’లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10–0 గోల్స్‌తో సింగపూర్‌పై ఘన విజయం సాధించింది. నవ్‌నీత్ కౌర్ (3వ, 41వ నిమిషాల్లో), రాణి రాంపాల్ (15వ, 18వ ని.లో), నవజ్యోత్ కౌర్ (30వ, 50వ ని.లో) తలా రెండేసి గోల్స్ చేశారు.
లాల్‌రెమ్సియామి (18వ ని.లో), దీప్ గ్రేస్ ఎక్కా (25వ ని.లో), గుర్జీత్ కౌర్ (41వ ని.లో), సోనిక (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్ రాణి రాంపాల్ తన కెరీర్‌లో 100 గోల్స్‌ను పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment