
Savita Punia To Lead Indian Women Hockey Team: సీనియర్ గోల్‌కీపర్ సవిత పూనియాను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అనుభవజ్ఞురాలైన సవితకు జట్టు పగ్గాలు అప్పగించారు.
ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఇందులో 16 మంది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి గోల్‌కీపర్ ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు
Champions keep playing until they get it right. 🏋️🏃♀️🏑#WeareTeamIndia #SavitaPunia #IndianWomenHockeyTeam #HockeyIndia #gymtime #sportswomen pic.twitter.com/pKTiurTrV1
— Savita Punia (@savitahockey) November 24, 2021