
మస్కట్: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఈసారి కాంస్య పతకం కోసం పోరాడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున వందన (28వ ని.లో), లాల్‌రెమ్‌సియమి (54వ ని.లో)... కొరియా తరఫున చియాన్ (31వ ని.లో), సంగ్ జు లీ (45వ ని.లో), హెయెన్ చో (47వ ని.లో) గోల్స్ కొట్టారు. రెండో సెమీఫైనల్లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో చైనాతో భారత్, స్వర్ణం కోసం జపాన్‌తో కొరియా ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment