ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కొలంబో: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అఫ్ఘానిస్తాన్‌తో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 77 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత భారత్ 49.1 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హిమాన్షు రాణా (123 బంతుల్లో 130; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం.
295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 217 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో కమలేశ్, యశ్, రాహుల్ చహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది.