భారత్‌ శుభారంభం | India Good start | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

Published Fri, Dec 16 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

India Good start

మలేసియాపై 235 పరుగుల
ఆధిక్యంతో విజయం


కొలంబో: ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. మలేసియాతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో టీమిండియా 235 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది.

ఓపెనర్‌ పృథ్వీ షా (89; 12 ఫోర్లు, ఒక సిక్స్‌), అభిషేక్‌ శర్మ (59; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), హీత్‌ జిగ్నేష్‌ పటేల్‌ (58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం మలేసియా 22.3 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కమలేశ్‌ నాగర్‌కోటి (4/12), యశ్‌ ఠాకూర్‌ (2/19), అభిషేక్‌ శర్మ (2/9) రాణించారు. శుక్రవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్‌ ఆడుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement