
PC: India Hockey
భారత మహిళల హాకీ జట్టుకు కాంస్యం
Indian Women Hockey Team Beat China 2- 0: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చైనా జట్టుతో శుక్రవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ రెండు గోల్స్ పెనాల్టీ కార్నర్‌ల ద్వారా రావడం విశేషం. ఆట 13వ నిమిషంలో షర్మిలా దేవి తొలి గోల్ చేయగా... 19వ నిమిషంలో గుర్జీత్ కౌర్ రెండో గోల్‌ను అందించిది.
ఇక ఫైనల్లో జపాన్ 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 10 సార్లు జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు రెండుసార్లు విజేతగా (2004, 2017), రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009), మూడుసార్లు మూడో స్థానంలో (1993, 2013, 2022) నిలిచింది.
చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు