ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భాగంగా సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఆరు పాయింట్లతో టీమిండియా సెమీఫైనల్‌కు చేరింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ మూడు గోల్స్ చేయగా... జ్యోతి, మోనిక రెండు గోల్స్ చొప్పున సాధించారు. వందన, మరియానా కుజుర్ ఒక్కో గోల్ చేశారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది.
మళ్లీ అగ్రస్థానానికి హైదరాబాద్ ఎఫ్‌సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఐదో విజయంతో మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుతో గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. హైదరాబాద్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నైజీరియా మాజీ ప్లేయర్ ఒగ్బెచె మూడు గోల్స్ (21వ, 44వ, 74వ ని.లో) చేయగా... అనికేత్ (45వ ని.లో) ఒక గోల్ సాధించాడు. 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఖాతాలో 20 పాయింట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment