నగరానికి చేరుకున్న వైఎస్ జగన్
ముగిసిన న్యూజిలాండ్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గతనెల 25వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా విమానా శ్రయంలో జగన్‌కు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, సైకం శ్రీనివాస రెడ్డి, పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు బసిరెడ్డి సిద్ధారెడ్డి, రామయ్య, గుడివాడ అమర్‌నాథ్‌లతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి జగన్ నేరుగా ఇంటికి చేరుకున్నారు.