Prince George
-
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు. -
బుల్లి యువరాజు హత్యకు కుట్ర..
లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ ముద్దుల కొడుకు ప్రిన్స్ జార్జ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది ఈ హత్యకు కుట్ర చేశాడు. దీంతో రషీదును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాను బుల్లి యువరాజు జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీదు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనికి 25 ఏళ్ల శిక్షను విధించారు. లండన్‌లోని వూల్విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలవరించారు. టెలిగ్రామ్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు. కాగా, జార్జ్‌ను హత్య చేస్తామంటూ గత అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బ్రిటన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు, చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘యుద్ధమనేది వస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని తెలిపారు. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
యువరాజు హత్యకు కుట్ర
లండన్ : బ్రిటన్ యువరాజు జార్జ్ ఐసిస్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ల తొలి సంతానం జార్జ్. నాలుగేళ్ల వయసున్న యువరాజును హతమారుస్తామని సోషల్‌మీడియా వేదికగా ఐసిస్ ప్రకటించడంతో బ్రిటన్‌లో కలకలం రేగింది. గత నెలలోనే జార్జ్ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. జార్జ్ స్కూల్‌కు వెళ్లేప్పుడు దాడి చేసి హతమార్చాలని ఐసిస్ యోచిస్తున్నట్లు తెలిసింది. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
రాకుమారుడి స్కూల్లో దొంగతనం.. టెన్షన్
లండన్ : బ్రిటన్ బుల్లి రాకుమారుడు చదువుతున్న పాఠశాలలో దొంగతనానికి పాల్పడిన ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె స్కూల్‌కు సంబంధించిన వివరాలను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. బ్రిటన్ రాకుమారుడైన నాలుగేళ్ల జార్జ్ అందులోనే చదువుతున్న నేపథ్యంలో పాఠశాల వివరాలు తస్కరించే ప్రయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. యువరాజు భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణనలోకి తీసుకొని తీవ్రంగా విచారణ చేపట్టారు. జార్జ్ గత వారం నుంచే థామస్ బ్యాటర్‌సీ అనే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విషయం తెలిసిందే. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్కూల్లో నాలుగు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన 540 మంది బాలబాలికలు చదువుతున్నారు. పిల్లల సత్ప్రవర్తనపై ప్రధానంగా శ్రద్ధ పెట్టే ఈ స్కూల్లో విద్యార్థులు బెస్ట్ ఫ్రెండ్స్ కలిగి ఉండటాన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తారు. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉండి.. ఉన్నత చదువుల కోసం వారి నుంచి వెళ్లిపోయే సమయంలో చిన్నారుల హృదయాలలో వెలిభావన ఏర్పడి.. గాయపడుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు. 'మేం థామస్ స్కూల్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఈ స్కూల్లోనే రాయల్ కుటుంబానికి చెందిన ప్రిన్స్ జార్జ్ చదువుతున్నారు. తాజా సంఘటన తర్వాత మేం భద్రత విషయాన్ని పునఃసమీక్షించబోతున్నాం' అని పోలీసులు తెలిపారు. అయితే, ప్రిన్స్ విలియమ్స్ ఆయన కుటుంబ సభ్యుల దీనిపై స్పందిస్తూ జరిగిన ఘటన తమకు తెలిసిందని, భద్రత విషయాల్లో మేం ఎలాంటి కామెంట్లు చేయబోమని అన్నారు. -
నో బెస్ట్ ఫ్రెండ్స్.. ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్స్!
బ్రిటన్ బుజ్జీ రాకుమారుడు జార్జ్ త్వరలో ప్రైవేటు పాఠశాలలో చేరబోతున్నాడు. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ తమ విద్యార్థులు ఉత్తమ మిత్రులను కలిగి ఉండటాన్ని నిరుత్సాహపరుస్తారు. 'దయతో ఉండాలన్నది' ఈ స్కూల్ మొదటి నిబంధన కాగా.. బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోవడమే మంచిది అనేది ఇక్కడి సిద్ధాంతం. బ్రిటన్ రాజవంశం నివాసముండే కేన్సింగ్టన్ ప్యాలెస్‌కు కొద్దిమైళ్ల దూరంలో ఉన్న థామస్ బ్యాటర్‌సీ పాఠశాలలో ప్రిన్స్ జార్జ్ చేరబోతున్నాడు. వచ్చే సెప్టెంబర్ నుంచి అతను బడికి వెళ్లబోతున్నాడని ఇప్పటికే కేన్సింగ్టన్ ప్యాలెస్ ట్విట్టర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్కూల్లో నాలుగు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన 540 మంది బాలబాలికలు చదువుతున్నారు. పిల్లల సత్ప్రవర్తనపై ప్రధానంగా శ్రద్ధ పెట్టే ఈ స్కూల్లో విద్యార్థులు బెస్ట్ ఫ్రెండ్స్ కలిగి ఉండటాన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తారు. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉండి.. ఉన్నత చదువుల కోసం వారి నుంచి వెళ్లిపోయే సమయంలో చిన్నారుల హృదయాలలో వెలిభావన ఏర్పడి.. గాయపడుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. -
ప్రధానికి చుక్కలు చూపించిన బుడ్డోడు!
-
ప్రధానికి చుక్కలు చూపించిన బుడ్డోడు!
బ్రిటన్ రాజవంశపు బుజ్జి యువరాజు జార్జ్ తెలుసు కదా! ఆ బుడతడు తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోకు ఒక చిన్నపాటి షాకిచ్చాడు. కెనడా ప్రధాని ట్రుడో తనదైన విన్యాసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదేవిధంగా బుజ్జి జార్జ్‌ను ఆకట్టుకోవడానికి ట్రుడో ప్రయత్నించాడు. ఆ బుజ్జాయిను మురిపించడానికి మోకాళ్లపై కూచోని షేక్‌హ్యాండ్ ఇవ్వమని కోరాడు. చేయి చాపి షేక్‌హ్యాండ్ ఇవ్వమని ఒకింత బతిమాలుకున్నాడు. అయినా.. బుజ్జి జార్జ్ వింటే కదా.. 'నో' అంటూ అడ్డంగా తలూపాడు. ఇక లాభం లేదనుకొని ప్రధానిగారు పైకిలేచి ఈ చిన్నపాటి ఎదురుదెబ్బను దిగమింగుకున్నారు. బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం ఓ వారంపాటు విహరించడానికి కెనడాకు వెళ్లింది. రాజకుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో ఆదివారం బ్రిటిష్ కొలంబియా విమానాశ్రయానికి వచ్చారు. ఆయనతోపాటు పలువురు కెబినెట్ మంత్రులు కూడా విమానాశ్రయానికి హాజరయ్యారు. వారు కేమ్బ్రిడ్జ్ డ్యూక్, డ్యూచెస్ దంపతులకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో ప్రిన్స్ విలియమ్-కేట్ దంపతుల పిల్లలు ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ చార్లెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా బుజ్జి జార్జ్‌ను ఆకట్టుకోవడానికి, అతనితో షేక్‌హ్యాండ్ తీసుకోవడానికి ప్రధాని ట్రుడో చాలా ప్రయత్నించాడు. కానీ, ట్రుడో చేష్టలు జార్జ్‌కు ఏమాత్రం నచ్చన్నట్టు ఉన్నాయి. ఆయన ప్రధాని అనీ, ఒక దేశ పర్యటనకు వచ్చినప్పుడు దౌత్యపరమైన మర్యాదలు పాటించాలన్న సంగతి ఆ బుజ్జాయికి తెలిసి ఉండదేమో! అందుకే తనకు నచ్చని ట్రుడోకు ఏకంగా షాకిచ్చాడు. రాచరిక వారసుడైన జార్జ్ ప్రపంచ నేతలతో ఇలా ఆటాడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసినప్పుడు జార్జ్‌ను కలిసినప్పుడు కూడా ఇలాగే వార్తల్లో నిలిచాడు. పైజామా ధరించి ఒబామాకు ఈ బుజ్జి జార్జ్ 'హాయ్' చెప్పాడు. పైజామా ధరించి ఒక దేశాధ్యక్షుడితో ముచ్చటించడమంటే అది 'ప్రోటోకాల్' ఉల్లంఘనే. బుజ్జి జార్జ్ దుస్తులు 'లాగి చెంప మీద కొట్టినట్టు' ఉన్నాయని అప్పట్లో ఒబామా జోక్ కూడా చేశారు. -
బుజ్జి రాకుమారుడిపై విమర్శలు!
బ్రిటన్ రాజవంశానికి చెందిన బుజ్జి రాకుమారుడు జార్జ్‌పై ఫేస్బుక్లో బ్రిటిష్ కౌన్సిల్ సీనియర్ ఉద్యోగిని చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజవంశానికి చెందినవాడు కావడంతో ఏ కాయకష్టం చేయకుండా ప్రజలసొమ్ముపై ఆధారపడి ప్రిన్స్ జార్జ్ బతుకుతున్నాడని బ్రిటిష్ కౌన్సిల్ గ్లోబల్ చారిటీ హెడ్ ఏంజెలా గిబన్స్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ఆ చిన్నారి గురించి కొన్ని అనుచితమైన దూషణలు చేశారు. జార్జ్‌లో ఇప్పటికే తాను రాజవంశానికి చెందిన సంపన్నుడినన్న గర్వం కనిపిస్తున్నదని, అదే మూడేళ్ల సిరియా శరణార్ధి పిల్లాడు జార్జ్లా గర్వంగా ఎదగగలడా అని ఆమె ప్రశ్నించారు. అయితే, ఈ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్రిటిష్ కౌన్సిల్ స్పష్టం చేసింది. తమ ఉద్యోగి తన వ్యక్తిగత ఫేస్బుక్ అకౌంట్లో చేసిన ఈ వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని తెలిపింది. బ్రిటిష్ కౌన్సిల్ దాదాపు వందదేశాల్లో ఇంగ్లిష్ భాష కోర్సులను అందజేస్తున్నది. -
తాతలాగే పోజిస్తూ.. బడిబాటలో బుల్లి బ్రిటన్ రాజు
లండన్: బ్రిటన్ బుల్లి రాజు బడిబాట పట్టాడు. తల్లిదండ్రులు పలువురు ఉత్సాహవంతులు చూస్తుండగా రెండేళ్ల ప్రిన్స్ జార్జ్ వడివడిగా అడుగులు వేసుకుంటూ తన ఇంటికి సమీపంలోని వెస్ట్ కేర్ మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లాడు. రెండు గంటలు స్కూల్లో కూర్చొని బుద్దిగా మాష్టార్లతో పాఠాలు చెప్పించుకొని తిరిగి ఇంటికి వస్తుంటే తమ కుమారుడిని చూస్తూ కేంబ్రిడ్జ్ డ్యూక్, డ్యూషెస్ (విలియం, కేట్) మురిసిపోయారు. ఇక ఆ చుట్టుపక్కలవారైతే తమ బుజ్జి యువరాజు స్కూల్ డ్రెస్ లో ఎలా ఉన్నారో అనుకుంటూ దూరంనుంచే తెగ చూశారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తన తాతా ప్రిన్స్ జార్జ్ గతంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఎలాంటి ఫోజిస్తూ ఫొటోకు చిక్కారో అచ్చం అలాంటి ఫోజుతోనే చిట్టి యువరాజు తిరిగి కనిపించి అబ్బురపడేలా చేశాడు. ఈ ఫొటోను తీసింది ఏ ఫోటో గ్రాఫరో కాదు.. అతడి తల్లి విలియం కేట్. రెండు ఫొటోలు తీసి ఆమె నెట్టింట్లో పెట్టింది. చలితీవ్రత ఏమాత్రం తగలకుండా బ్లూరంగులో ఉన్న శెట్టర్ తొడుగుకున్న యువరాజు బంగారు వర్ణంలో ఉన్న జుట్లు తెల్లటి చర్మంతో నిజంగా స్కూల్ బాయ్ గా మెరిసిపోయాడు. -
బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి వచ్చి చేరింది. ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ శనివారం సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:34 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, పాప 3.7 కేజీల బరువు ఉందని కెన్సింగ్టన్ ప్యాలస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేట్ ప్రసవ సమయంలో ఆమె భర్త విలియం అక్కడే ఉన్నారని తెలిపింది. కేట్ 2013 జూలైలో ఇదే ఆస్పత్రిలో తన తొలి బిడ్డ ప్రిన్స్ జార్జికి జన్మనిచ్చారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ విలియం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఫారిన్ టూర్ లో బుల్లి ప్రిన్స్ హల్ చల్!
బ్రిటన్ బుల్లి యువరాజు జార్జ్ బయటకు అడుగుపెట్టిన తొలి రోజునే ఆకట్టుకోవడమే కాకుండా, పతాక శీర్షికలోకెక్కాడు. ప్రిన్స్ విలియమ్, కేథరిన్ ల ముద్దుల తనయుడు జార్జ్ న్యూజిలాండ్ లో తొలి అధికార పర్యటనను చేశాడు. వెల్లింగ్టన్ లో బలమైన గాలులు, వర్షం, మసక చీకటి స్వాగత పలికినా.. బుల్లి యువరాజు ముఖంలో నవ్వు చెక్కుచెదరలేదు. మూడు వారాల పర్యటనలో భాగంగా తన తల్లితండ్రులతో కలిసి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బుడతడు పర్యటించనున్నాడు. జూలై 22 తేదిన జన్మించిన తర్వాత జార్జ్ బహ్యప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. -
రాయల్ బేబీ ప్రిన్స్ జార్జ్