తాతలాగే పోజిస్తూ.. బడిబాటలో బుల్లి బ్రిటన్ రాజు
లండన్: బ్రిటన్ బుల్లి రాజు బడిబాట పట్టాడు. తల్లిదండ్రులు పలువురు ఉత్సాహవంతులు చూస్తుండగా రెండేళ్ల ప్రిన్స్ జార్జ్ వడివడిగా అడుగులు వేసుకుంటూ తన ఇంటికి సమీపంలోని వెస్ట్ కేర్ మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లాడు. రెండు గంటలు స్కూల్లో కూర్చొని బుద్దిగా మాష్టార్లతో పాఠాలు చెప్పించుకొని తిరిగి ఇంటికి వస్తుంటే తమ కుమారుడిని చూస్తూ కేంబ్రిడ్జ్ డ్యూక్, డ్యూషెస్ (విలియం, కేట్) మురిసిపోయారు.
ఇక ఆ చుట్టుపక్కలవారైతే తమ బుజ్జి యువరాజు స్కూల్ డ్రెస్ లో ఎలా ఉన్నారో అనుకుంటూ దూరంనుంచే తెగ చూశారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తన తాతా ప్రిన్స్ జార్జ్ గతంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఎలాంటి ఫోజిస్తూ ఫొటోకు చిక్కారో అచ్చం అలాంటి ఫోజుతోనే చిట్టి యువరాజు తిరిగి కనిపించి అబ్బురపడేలా చేశాడు. ఈ ఫొటోను తీసింది ఏ ఫోటో గ్రాఫరో కాదు.. అతడి తల్లి విలియం కేట్. రెండు ఫొటోలు తీసి ఆమె నెట్టింట్లో పెట్టింది. చలితీవ్రత ఏమాత్రం తగలకుండా బ్లూరంగులో ఉన్న శెట్టర్ తొడుగుకున్న యువరాజు బంగారు వర్ణంలో ఉన్న జుట్లు తెల్లటి చర్మంతో నిజంగా స్కూల్ బాయ్ గా మెరిసిపోయాడు.