William
-
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్‌లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్‌షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్‌షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
వరద దెబ్బకు ఏడుపాయల విలవిల
కూలిపోయిన బ్రిడ్జి.. పడి పోయిన గ్రిల్లింగ్ కొట్టుకుపోయిన హుండీలు..కూలిన స్తంభాలు వనదుర్గా ఆలయం అస్తవ్యస్తం సుమారు రూ.15 లక్షల నష్టం దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ, ఈఓ పాపన్నపేట:వరద ఉధృతికి ఏడుపాయల విలవిల్లాడింది. ఆలయం అంతా అస్తవ్యస్తంగా మారింది. కూలిపోయిన బ్రిడ్జి.. పడిపోయిన గ్రిల్లింగ్..కొట్టుకుపోయిన హుండీలు..కుప్పకూలిన క్యూలైన్లు..నేలకూలిన విద్యుత్ స్తంభాలు..విరిగిన ఫ్యాన్లు.. వారం రోజుల పాటు మంజీరా వరదల్లో మునిగి శుక్రవారం వెలుగు చూసిన ఏడుపాయల ఆలయ పరిస్థితి ఇది. ఈ వరదల విలయంలో దాదాపు రూ 15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలో తేలిందని ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.అనంతరం మెదక్ డీఎస్పీ నాగరాజు, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ సందీప్‌రెడ్డి ఏడుపాయల్లోని పరిస్థితులను పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేనివర్షాలు పడటం..అదే సమయంలో సింగూరు నుంచి నీరు సుమారు 1.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో మంజీరమ్మ మహోగ్రరూపందాల్చి ఘనపురం ఆనకట్టపై నుంచి 6 ఫీట్ల ఎత్తున పొంగిపొర్లింది. దిగువన ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తింది. దీంతో ఆలయం సుమారు 75 శాతం వరదల్లో మునిగి పోయింది. వరద తాకిడికి ఆలయం ముందు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.క్యూలైన్లు కుప్ప కూలాయి. ఆలయంలో చుట్టూర ఉన్న గ్రిల్లింగ్ కొట్టుకు పోయింది.అమ్మవారి హుండీలు కొట్టుకుపోయాయి. ఆలయంమధ్యలో ఉన్న గ్రానైట్‌రాళ్లు అడ్రస్ లేకుండా పోయాయి.ఆలయం గ్రిల్లింగ్ చుట్టు గడ్డి పేరుకు పోయింది.కాగా అమ్మవారి విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం జరుగలేదు. సుమారు రూ15 లక్షల ఆస్తినష్టం వరదల వల్ల సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.శుక్రవారం ఆయన మెదక్ డీఎస్పీ నాగరాజు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ సందీప్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను సందర్శించి నష్టాన్ని అంచనావేశారు. నిధుల మంజూరుకు డిప్యుటీ స్పీకర్ హామీ వరదల వల్ల దెబ్బతిన్న దుర్గమ్మ ఆలయానికి మరమ్మతులు చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరి చేయడానికి డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గాకే ఆలయానికి అనుమతి ఏడుపాయల ఆలయం ముందు పూర్తి నీటి ప్రవాహం తగ్గాకే భక్తులకు అనుమతి ఇస్తామని మెదక్ డీఎస్పీ నాగరాజు తెలిపారు.అంతలోగా ఆలయ మరమ్మతులు జరుగుతాయన్నారు. \ -
'పర్వాలేదు.. మా బిడ్డలాంటివాడేలే'
కజిరంగా: పసివాళ్లు దేవుళ్లు అంటారు. దేవుడంటే అందరినీ సమాన దృష్టితో చూసేవాడని చెప్తారు. చిన్నాపెద్ద, బీద, ధనిక బేధాలు అస్సలు ఆయనకు ఉండవని అంటుంటారు. అది నిజమేనేమో అని సంఘటన చూస్తే అర్థం అవుతుంది. సాధరణంగా రాజు, రాణి అనగానే మన మనసులో ఓభయం పొర్లుతుంది. లేదంటే ఏదో తెలియని ఆత్మన్యూనత వారికి దూరంగా ఉండేలా చేస్తుంది. కానీ అసోంలో మూడేళ్ల బాలుడికి మాత్రం వారిద్దరు అందరిలాంటి మాములు మనుషులుగానే కనిపించారేమో.. ఏకంగా వారి కాళ్లను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. అది ఒక్కసారి కాదు.. తన ప్రదర్శన అయిపోయేవరకు. బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించిన విషయం తెలిసిదే. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉండటంతో గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, చూశారు. అయితే, అంతకుముందు కేట్ దంపతులకు పార్క్‌లోకి స్వాగతం చెప్పేందుకు కొంతమంది సంప్రదాయ నృత్యం చేసేవారిని అక్కడికి పిలిపించారు. వీరిలో కాంఖాన్ బారువా మూడేళ్ల బుడతడు కూడా ఉన్నాడు. తన తల్లిదండ్రుల మాదిరిగానే ముచ్చటగొలిపే వేషధారణలో వచ్చి చక్కగా డప్పు దరువుకు నృత్యం చేశాడు. చేస్తూ చేస్తూ ఏమాత్రం భయపడకుండా కేట్ దంపతుల కాళ్లను తొక్కాడు. అది కూడా కావాలని అల్లరిఅల్లరిగా పదేపదే తొక్కాడు. అయితే, వాళ్లిద్దరు రాజు, రాణి కావడంతో భయపడిన తల్లిదండ్రులు తమ బిడ్డ తరుపున క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ పిల్లాడి చిందులు చూసి ముచ్చటపడిన విలియం, కేట్ ఏం పర్వాలేదని, కాంఖాన్ తమ కుమారుడు జార్జ్‌ని గుర్తు చేశాడని, కాంఖాన్ కూడా తమకు జార్జ్ మాదిరిగానే అని చెప్పారు. అతడిని ఆ ఇద్దరు దంపతులు తీసుకొని ముద్దుచేశారు. అతడి డ్యాన్స్‌కు మురిసిపోయి తెగ చప్పట్లుకొట్టేశారు. -
కజిరంగాలో ప్రిన్స్ జంట
కజిరంగా: బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉన్నాయి. గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులను చూశారు. పెద్ద పులులు ఉండే ప్రదేశాలను చూశారు. బిమోలీ క్యాంప్ వద్ద అల్పాహారం తీసుకున్నారు. ఖడ్గమృగాలు, ఏనుగుల గురించి అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేటగాళ్లను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా విలియం, కేట్లకు కజిరంగా సమాచార కేంద్రం వద్ద ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఏపీ పాండే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పార్కు సందర్శన అనంతరం వారు పరిసరాల్లోని గ్రామాల్లో పర్యటించారు. పార్కులోని ఏనుగుల రాకపోకలకు అంతరాయం కలగకుండా తమ ఇళ్లను ఇతర ప్రాంతాలకు మార్చుకున్న రోంగ్ టెరాంగ్ గ్రామస్తులను విలియం, కేట్లు కలుసుకున్నారు. తొలుత వారు గ్రామంలోని ‘నామ్‌ఘర్’ మందిరాన్ని సందర్శించారు. సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ రిహబిలిటేషన్, కజిరంగా డిస్కవరీ సెంటర్లకు వెళ్లారు. అక్కడ ఏనుగులు, ఇతర జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీని వీక్షించారు. -
కజరంగా పార్క్‌లో ప్రిన్స్ దంపతుల సందడి
అసోం: బ్రిటన్ యువరాజ్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు బుధవారం అసోంలోని కజరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లోని అధికారులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన దృశ్యాలను వీక్షిస్తూ సందడి చేశారు. బ్రిటన్ యువరాజు సతి సమేతంగా పార్క్‌కు రావడంతో అక్కడి అధికారులు ముందుగానే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ పార్క్‌కు సందర్శనానికి వచ్చిన బ్రిటన్ యువరాజు దంపతులను కలిసి మాట్లాడటం తమకు గొప్ప అనుభవమని అక్కడి అధికారుల్లో ఒకరు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, కజరంగా పార్క్‌లో ఫారెస్ట్ రేంజర్లు నిత్యం అవలభించే విధివిధానాల గురించి యువరాజు దంపతులు అడిగి తెలుసుకున్నారు. -
తాతలాగే పోజిస్తూ.. బడిబాటలో బుల్లి బ్రిటన్ రాజు
లండన్: బ్రిటన్ బుల్లి రాజు బడిబాట పట్టాడు. తల్లిదండ్రులు పలువురు ఉత్సాహవంతులు చూస్తుండగా రెండేళ్ల ప్రిన్స్ జార్జ్ వడివడిగా అడుగులు వేసుకుంటూ తన ఇంటికి సమీపంలోని వెస్ట్ కేర్ మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లాడు. రెండు గంటలు స్కూల్లో కూర్చొని బుద్దిగా మాష్టార్లతో పాఠాలు చెప్పించుకొని తిరిగి ఇంటికి వస్తుంటే తమ కుమారుడిని చూస్తూ కేంబ్రిడ్జ్ డ్యూక్, డ్యూషెస్ (విలియం, కేట్) మురిసిపోయారు. ఇక ఆ చుట్టుపక్కలవారైతే తమ బుజ్జి యువరాజు స్కూల్ డ్రెస్ లో ఎలా ఉన్నారో అనుకుంటూ దూరంనుంచే తెగ చూశారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తన తాతా ప్రిన్స్ జార్జ్ గతంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఎలాంటి ఫోజిస్తూ ఫొటోకు చిక్కారో అచ్చం అలాంటి ఫోజుతోనే చిట్టి యువరాజు తిరిగి కనిపించి అబ్బురపడేలా చేశాడు. ఈ ఫొటోను తీసింది ఏ ఫోటో గ్రాఫరో కాదు.. అతడి తల్లి విలియం కేట్. రెండు ఫొటోలు తీసి ఆమె నెట్టింట్లో పెట్టింది. చలితీవ్రత ఏమాత్రం తగలకుండా బ్లూరంగులో ఉన్న శెట్టర్ తొడుగుకున్న యువరాజు బంగారు వర్ణంలో ఉన్న జుట్లు తెల్లటి చర్మంతో నిజంగా స్కూల్ బాయ్ గా మెరిసిపోయాడు. -
విశాఖలో పనిచేయని సెల్ఫోన్లు
విశాఖపట్నం: హుదూద్ పెను తుఫాన్ నుంచి విశాఖ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తుపాను తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. క్రమంగా ఈదురుగాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి వస్తోంది. తుఫానుతో అతలాకుతలమైన విశాఖలో సోమవారం ఉదయం సహాయక చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ బలగాలతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు విశాఖలో నష్టాన్ని అంచనా వేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలు నగరంలో మకాం వేశాయి. మరోవైపు నగర ప్రజలు ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు. తాగునీరు, నిత్యావసరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇక అపార్ట్మెంట్లు, సెల్లార్లలో వర్షపునీరు నిలిచింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్‌లు కూలిపోయాయి. తుఫాను దాటికి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటంతో నగరం అంధకారంలోనే ఉంది. దాంతో సెల్ఫోన్లు కూడా పనిచేయటం లేదు. -
విశాఖ విలవిల
తీరమా..ఘోరమా.. చెదిరిన విశాఖ ముఖచిత్రం విశాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విలయం హుదూద్ ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి పెనుగాలులతో బీభత్సం,కుండపోతగా వర్షం జల దిగ్బంధంలో జిల్లా, నగరం పూడిమడక వద్ద తీరం దాటిన తుఫాన్ కరెంటు లేక అంతటా చిమ్మ చీకట్లే ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు ముగ్గురు వ్యక్తులు మృత్యువాత వేలాదిగా వృక్షాలు నేల మట్టం,భారీ విధ్వంసం బస్సు,రైలు, విమాన సర్వీసులన్నీ రద్దు హైవేలో ఎక్కడి వాహనాలు అక్కడే.. ‘పయోధర ప్రచండ ఘోష, ఝంఝానిల షడ్జధ్వానం’ విశాఖను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ‘హుదూద్’ పెను తుఫాన్ రూపంలో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుందర సాగర తీరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జిల్లా యావత్తూ అతలాకుతలం అయింది. దాదాపు 24 గంటలకుపైగా జనజీవనం స్తంభించి, జల జీవనంగా మారింది. ఎటు చూసినా చెట్లు కూలిన దృశ్యాలు, కరెంటు తీగలు తెగిపడిన విద్యుత్ స్తంభాలు, మొండి గోడలుగా మారిన పూరిళ్లు, శ్లాబులతో సహా నేల వాలిన పక్కా గృహాలు, ధ్వంసమైన వందలాది కార్లు, ద్విచక్రవాహనాలు..దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వందలాది మూగజీవాల మృత కళేబరాలు పడి ఉన్నాయి. జిల్లాలోని తీరప్రాంతమంతా ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో, హోరు గాలులతో భీకరాకారం దాల్చింది. శనివారం అర్ధరాత్రి మొదలైన ‘హుదూద్’ ప్రభావం ఆదివారం తెల్లవారుజామయ్యే సరికి విలయంగా మారింది. కాళరాత్రిగా మారి చెవులు చిల్లులు పడేలా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులకు తోడు కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఈ భయానక వాతావరణం దాదాపు 20 గంటలకుపైగా కొనసాగింది. విశాఖ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ప్రకృతి బీభత్సం చోటు చేసుకుంది. ముందే అధికార యంత్రాంగం మేలుకోవటంతో జననష్టం నివారించగలిగినా, ఆస్తి నష్టంభారీగానే జరిగింది. బంగాళాఖాతంలో జిల్లా నడిబొడ్డు పూడిమడకలో తీరం దాటిన వేళ ప్రచండ గాలులు భయకంపితుల్ని చేశాయి. సాక్షి, విశాఖపట్నం : గంటా, రెండు గంటలా? ఏకంగా 20 గంటల పాటు విశాఖ వణికిపోయింది. చెవులు చిల్లులుపడేలాంటి హోరుగాలులు, కుంభవృష్టితో హుదూద్ తుపాన్ విలయతాండవం చేసింది. చెట్లు, విద్యుత్ స్థంభాలను నేలకూల్చింది. అడుక్కో చెట్టు, స్తంభం కూల్చేసి అడుగు ముందుకు పడకుండా అడ్డుకట్టవేసింది. ఎన్నో ఇళ్లు, భవనాలను నేలమట్టం చేసేసింది. ముగ్గురిని మింగేసింది. అందరినీ ప్రాణభీతిలో అల్లాడించింది. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత బీభత్సాన్ని సృష్టించింది. అందాల నగరాన్ని కకావికలం చేసింది. ఇది మన వైజాగేనా? అనుకునేంత అందవిహీనంగా మార్చేసింది. వెరసి విశాఖ వాసులకు హర్రర్ సినిమాలో సన్నివేశాలను ప్రత్యక్షంగా చూపించింది! శనివారం అర్థరాత్రి నుంచే మొదలైన హదూద్ వికృతరూపం ఆదివారం ఉదయానికి మరింత ఉధృతమైంది. గంటగంటకూ ఉగ్రరూపం దాల్చడం మొదలైంది. మధ్యాహ్నానికి తీరం దాటే సమయంలో మరింత బీభత్సం సృష్టించింది. తీరం దాటాక ఫర్వాలేదనుకున్న వారికి ఆ ఆశలు తల్లకిందులు చేస్తూ విధ్వంసకాండను కొనసాగించింది. పెనుగాలులు ఒకపక్క చెట్లు, స్తంభాలు కూలుతుండగా, మరోపక్క ఇళ్ల పైకప్పుల రేకులు అరటి ఆకుల్లా ఎగిరిపడ్డాయి. ఎక్కడ చూసినా ఇవి ఆకాశంలో నాట్యం చేస్తూ కనిపించాయి. కిటికీల అద్దాలు, తలుపులు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ బీభత్సానికి పిల్లాపాపలతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే బందీలయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే విద్యుత్ సరఫరా లేక బయట ఏం జరుగుతుందో టీవీల ద్వారా తెలుసుకోలేకపోయారు. ఫోన్ల ద్వారానైనా తెలుసుకుందామంటే నెట్వర్క్ సమస్యతో అవికూడా మూగబోయాయి. కానీ విశాఖలో హదూద్ సృష్టిస్తున్న విలయానికి తమ వారికి ఏంజరుగుతుందోనన్న భయంతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు అతికష్టంపై క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతో రైళ్లు, బస్సు సర్వీసులు ఎక్కడివక్కకే నిలిచిపోయాయి. రైల్వే, బస్స్టేషన్లు బోసిపోయాయి. ఆటోలు, ఇతర వాహనాలు తిరిగే సాహసం చేయలేకపోయాయి. రోడ్లపై మనుషులకు బదులు చెట్లు, స్తంభాలే కనిపించాయి. మరోవైపు అడుగడుగుకీ చెట్లు కూలిపోయాయి. అనేకచోట్ల రోడ్లు తెగిపోయాయి. అత్యవసర పనులపై బయటకు వచ్చిన ఎంతదూరమైనా కాలినడకే శరణ్యమైంది. అయినా ఏ ముప్పు ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడింది. ఇక హైవేపై కూలిన చెట్లు పడకేసినట్టుగా కనిపించాయి. ఒక్క వాహనం కూడా వెళ్లకుండా అడ్డుకట్టవేశాయి. ఇలా అన్ని వైపులా హుదూద్ విజృంభించి విశాఖను అష్టదిగ్బంధనం చేసింది. విద్యుత్ సరఫరా లేక ఇటు నగరం, అటు జిల్లా అంధకారంలో మగ్గిపోయి శతాబ్దం కిందటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చింది. జిల్లాలో పరిస్థితి కూడా భయానకంగానే ఉంది. హుదూద్ ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల్లో వరిపంట నీట మునగగా, చెరకు పంట పెనుగాలుల తీవ్రతకు నేలవాలింది. తుపాన్ తీరం దాటినట్టుగా భావిస్తున్న అచ్యుతాపురం మండలం పూడిమడక ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తీరం దాటే సమయానికి తుపాను ఉధృతికి అక్కడ స్థానికులు, సహాయక చర్యల్లో ఉన్న అధికారులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎన్నో తుపాన్లను చవిచూసిన విశాఖ నగర, జిల్లా వాసులు హుదూద్ తుపాన్ అంతటి విపత్కర పరిస్థితిని ఎన్నడూ చవిచూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. ముగ్గురు మృత్యువాత కాగా హుదూద్ తుపాను కారణంగా ఆదివారం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో విశాఖ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో గాలులకు ఎగిరిపడ్డ రేకు పడి గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పద్మనాభం మండలం బీఆర్ పాలవలసలో వర్షం నీటిలో జారిపడి ఎర్రయ్య (58) మరణించాడు. అనకాపల్లి మండలం కూండ్రంగిలో చంద్రవతి అనే మహిళ మరణించింది.