కజరంగా పార్క్లో ప్రిన్స్ దంపతుల సందడి | Prince William, Kate Middleton at Kaziranga National Park in Assam | Sakshi
Sakshi News home page

కజరంగా పార్క్లో ప్రిన్స్ దంపతుల సందడి

Published Wed, Apr 13 2016 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

కజరంగా పార్క్లో ప్రిన్స్ దంపతుల సందడి

కజరంగా పార్క్లో ప్రిన్స్ దంపతుల సందడి

బ్రిటన్ యువరాజ్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు బుధవారం అసోంలోని కజరంగా నేషనల్ పార్క్ను సందర్శించారు.

అసోం: బ్రిటన్ యువరాజ్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతులు బుధవారం అసోంలోని కజరంగా నేషనల్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్లోని అధికారులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన దృశ్యాలను వీక్షిస్తూ సందడి చేశారు. బ్రిటన్ యువరాజు సతి సమేతంగా పార్క్కు రావడంతో అక్కడి అధికారులు ముందుగానే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలో నేషనల్ పార్క్కు సందర్శనానికి వచ్చిన బ్రిటన్ యువరాజు దంపతులను కలిసి మాట్లాడటం తమకు గొప్ప అనుభవమని అక్కడి అధికారుల్లో ఒకరు సంతోషం వ్యక్తం చేశారు. కాగా,  కజరంగా పార్క్లో ఫారెస్ట్ రేంజర్లు నిత్యం అవలభించే విధివిధానాల గురించి యువరాజు దంపతులు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement