Kate
-
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
ఇదో వింత ‘జంట’
ఒలింపిక్స్‌లో పెళ్లైన జంటలు బరిలోకి దిగడం వింతేం కాదు.... అయితే ఈసారి ఒలింపిక్స్‌లో ఓ జంట మాత్రం విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం ఈ ఇద్దరూ మహిళలే మరి. ఇంగ్లండ్ మహిళల హాకీ జట్టు సభ్యులు కేట్, హెలెన్ రిచర్డ్సన్ ఇద్దరూ నిజ జీవిత భాగస్వాములు. 2008 నుంచి కలిసి మెలిసి ఆడుతూ... మూడేళ్ల క్రితం ఒక్కటయ్యారు. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీళ్లిద్దరూ నాలుగో సారి మాత్రం జంటగా రియోకు వచ్చారు. టీనేజ్ నుంచే కేట్, హెలెన్లిద్దరూ స్నేహితులు. 2008లో అప్పటి ఇంగ్లండ్ పురుషుల హాకీ జట్టు కెప్టెన్ బ్రెట్ గెరార్డ్‌తో కేట్ ఎంగేజ్మెంట్ జరిగింది. కారాణాలేవైనా పెళ్లిదాకా రాని ఈ నిశ్చితార్థం రద్దయ్యింది. ఆ సమయంలో కేట్, హెలెన్ల మధ్య ఉన్న పరిచయం కాస్తా తొలుత సహజీవనంగా... తదనంతరం వివాహ బంధంగా మారింది. మూడు పెనాల్టీలు... ఆరు గోల్స్‌గా వారి కాపురం సాగుతోంది. -
బాలీవుడ్ ప్రముఖులతో బ్రిటన్ రాజదంపతులు
-
తాతలాగే పోజిస్తూ.. బడిబాటలో బుల్లి బ్రిటన్ రాజు
లండన్: బ్రిటన్ బుల్లి రాజు బడిబాట పట్టాడు. తల్లిదండ్రులు పలువురు ఉత్సాహవంతులు చూస్తుండగా రెండేళ్ల ప్రిన్స్ జార్జ్ వడివడిగా అడుగులు వేసుకుంటూ తన ఇంటికి సమీపంలోని వెస్ట్ కేర్ మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లాడు. రెండు గంటలు స్కూల్లో కూర్చొని బుద్దిగా మాష్టార్లతో పాఠాలు చెప్పించుకొని తిరిగి ఇంటికి వస్తుంటే తమ కుమారుడిని చూస్తూ కేంబ్రిడ్జ్ డ్యూక్, డ్యూషెస్ (విలియం, కేట్) మురిసిపోయారు. ఇక ఆ చుట్టుపక్కలవారైతే తమ బుజ్జి యువరాజు స్కూల్ డ్రెస్ లో ఎలా ఉన్నారో అనుకుంటూ దూరంనుంచే తెగ చూశారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తన తాతా ప్రిన్స్ జార్జ్ గతంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఎలాంటి ఫోజిస్తూ ఫొటోకు చిక్కారో అచ్చం అలాంటి ఫోజుతోనే చిట్టి యువరాజు తిరిగి కనిపించి అబ్బురపడేలా చేశాడు. ఈ ఫొటోను తీసింది ఏ ఫోటో గ్రాఫరో కాదు.. అతడి తల్లి విలియం కేట్. రెండు ఫొటోలు తీసి ఆమె నెట్టింట్లో పెట్టింది. చలితీవ్రత ఏమాత్రం తగలకుండా బ్లూరంగులో ఉన్న శెట్టర్ తొడుగుకున్న యువరాజు బంగారు వర్ణంలో ఉన్న జుట్లు తెల్లటి చర్మంతో నిజంగా స్కూల్ బాయ్ గా మెరిసిపోయాడు.