బ్రిటన్ రాజవంశపు బుజ్జీ యువరాజు జార్జ్ తెలుసు కదా! ఆ బుడతడు తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోకు ఒక చిన్నపాటి షాకిచ్చాడు. కెనడా ప్రధాని ట్రుడో తనదైన విన్యాసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదేవిధంగా బుజ్జీ జార్జ్‌ను ఆకట్టుకోవడానికి ట్రుడో ప్రయత్నించాడు. ఆ బుజ్జాయిను మురిపించడానికి మోకాళ్లపై కూచోని షేక్‌హ్యాండ్ ఇవ్వమని కోరాడు. చేయి చాపి షేక్‌హ్యాండ్ ఇవ్వమని ఒకింత బతిమాలుకున్నాడు. అయినా.. బుజ్జీ జార్జ్ వింటే కదా.. 'నో' అంటూ అడ్డంగా తలూపాడు. ఇక లాభం లేదనుకొని ప్రధానిగారు పైకిలేచి ఈ చిన్నపాటి ఎదురుదెబ్బను దిగమింగుకున్నారు.
Published Mon, Sep 26 2016 3:14 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
Advertisement