లండన్ : బ్రిటన్ యువరాజు జార్జ్ ఐసిస్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్‌టన్‌ల తొలి సంతానం జార్జ్. నాలుగేళ్ల వయసున్న యువరాజును హతమారుస్తామని సోషల్‌మీడియా వేదికగా ఐసిస్ ప్రకటించడంతో బ్రిటన్‌లో కలకలం రేగింది.
గత నెలలోనే జార్జ్ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. జార్జ్ స్కూల్‌కు వెళ్లేప్పుడు దాడి చేసి హతమార్చాలని ఐసిస్ యోచిస్తున్నట్లు తెలిసింది. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment