
హైదరాబాద్‌లోని ఫైనల్ షెడ్యూల్‌తో సందడి కంప్లీట్ అయ్యింది. కానీ సినిమాలో యాక్టర్స్ చేసిన సందడి థియేటర్లో ప్రేక్షకులను ఏ లెవెల్లో నవ్విస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగక తప్పదు. జీవా, జై, శివ, నిక్కీ గల్రానీ, కేథరిన్ ముఖ్య తారలుగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలకలప్పు–2’. ఐదేళ్ల క్రితం సుందర్. సి దర్శకత్వంలోనే వచ్చిన ‘కలకలప్పు’ చిత్రానికి ఇది సీక్వెల్. చిత్రీకరణ పూర్తయింది.
వచ్చే ఏడాది మొదట్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కలకలప్పు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. థియేటర్‌లో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా సుందర్ తెరకెక్కించారు. లవ్లీ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు హీరో జీవా. ఇంతకీ కలకలప్పు అంటే ఏంటో తెలుసా? సందడి అని అర్థం. ఇక్కడున్న ఫొటోలో తారలు ఎలా సందడి చేశారో చూస్తున్నారుగా. షూటింగ్ చివరి రోజు స్టిల్ ఇది. సినిమాలో డబుల్ సందడి ఉంటుందట.
Comments
Please login to add a commentAdd a comment