సినిమా: నాకు ఆయనతో సంబంధం అంటగడతారా అని మండి పడుతోంది నటి నిక్కీగల్రాణి. ఇటీవల కథానాయకిగా వెనుక పడ్డ ఈ అమ్మడు అబ్బే అదేం లేదు నేను బిజీగానే ఉన్నాను అని అంటోంది. కలగలప్పు–2, చార్లీచాప్లిన్–2 చిత్రాల తరువాత ఈ అమ్మడు నటించిన కీ చిత్రం 12న తెరపైకి రానుంది. ఇందులో జీవాతో రోమాన్స్ చేసింది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణితో చిట్‌చాట్
ప్ర: చిత్రం పేరు కీ అనగానే మీకేమనిపించింది?
జ:సాధారణంగా కీ అంటే తాళం కప్పకు వాడే చెవి అని అని అనుకున్నాను. అయితే దర్శకుడు చెప్పింది వేరు. మనం ఏ పని చేసినా మంచి జరగవచ్చు, లేదా చెడూ జరగవచ్చునని, దానికే కీ అని అర్థం అన్నారు. కథ విన్న తరువాత నాకూ కీ అనేదానికి అర్థం తెలిసింది.
ప్ర: కీ చిత్రంలో మీ పాత్ర గురించి?
జ: నేనిందులో దియా అనే యువతిగా నటించాను. ఈ నాగరిక కాలంలో మనం రకరకాల ఆధునిక సెల్‌ఫోన్లను వాడుతున్నాం. ఒక హ్యాకర్ ద్వారా మన జీవితాలు ఎలా బాధింపునకు గురవుతాయని చెప్పే చిత్రంగా కీ ఉంటుంది. మొబైల్ ఫోన్లు వాడే ప్రతివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుంది.
ప్ర:జీవాతో నటించిన అనుభవం?
జ: జీవాతో కలిసి నటించడం చాలా సంతోషం. మేమిద్దం కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. అయితే కలగలప్పు–2 చిత్రం ముందుగా విడుదలైంది. జీవా నేను చాలా జాలీగా ఉంటాం. షూటింగ్‌లో గొడవ పడుతూనే ఉంటాం. అదే విధంగా ఇతరులను ఆట పట్టిస్తాం. షూటింగ్‌లో అంత జాలీగా ఉంటుంది.
ప్ర:చిత్ర దర్శకుడు కలీస్ గురించి?
జ: కొత్త దర్శకుడు కలీస్. చాలా జాగ్రత్తగా ఈ కథను ఎంచుకున్నారు. అంతకంటే బాగా తెరకెక్కించారు. అదే విధంగా దీనికి విశాల్ చంద్రశేఖర్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో నాకు జీవాకు ఒక డ్యూయోట్ పాట ఉంది. అది మా ఇద్దరికీ చాలా నచ్చిన పాట.
ప్ర: హీరోయిన్లను అందంగా చూపించడానికి ఛాయాగ్రాహకులతో లింక్ పెట్టుకుంటారంటారు. అదే విధంగా మీరూ లింక్ పెట్టుకున్నారా?
జ: నాకు కెమెరామెన్‌కు ఎలాంటి లింకూ లేదు. నేను నా పని చేస్తాను. ఆయన తన పని చేసుకుంటారు. అందుకే తెరపై చూస్తున్నప్పుడు సన్నివేశాలు అందంగా ఉంటాయి. అందుకు కెమెరామెన్లతో లింకు పెట్టుకోవలసిన అవసరం ఉండదు. అలా అనడం కూడా సరికాదు.
ప్ర: చిత్రాలను ఎంచుకునేటప్పుడు మీరు తీసుకునే శ్రద్ధ గురించి ?
జ: చిత్రం అన్ని వర్గాల వారిని అలరించాలని నేను భావిస్తున్నాను.ముఖ్యంగా అందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అలాంటి కథలకే అధిక ప్రాముఖ్యతనిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment