తమిళసినిమా : ఇప్పటికీ హీరోలతో రొమాన్సే చాలనుకుంటున్నాను అంటోంది నటి నిక్కీగల్రాణి. కోలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా పేరొందిన ఉత్తరాదిభామ ఈ జాణ. డార్లింగ్, కలగలప్పు–2 చిత్రాలతో తమిళ సినీరంగంలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణికి ఇటీవల నటించిన పక్కా చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం కీ, చార్లిన్‌చాప్లిన్–2 చిత్రాల్లో నటిస్తోంది. ప్రభుదేవాకు జంటగా చార్లిన్ చాప్లిన్–2 చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చిలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నిక్కీగల్రాణితో చిన్న ఇంటర్వ్యూ..
ప్ర: ప్రేమ, రొమాన్స్‌లాంటి పాత్రలతో పాటు యాక్షన్ కథా పాత్రల్లో నటించాలన్న ఆసక్తి లేదా?
జ: నిజం చెప్పాలంటే నేను కథ, నా పాత్ర బాగుండాలన్న కోణంలోనే ఆలోచిస్తాను. అందులో ప్రేమ, రొమాన్స్, సెంటిమెంట్, యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయా అన్నది ఆలోచించను. నచ్చిన కథా చిత్రాలను ఎంచుకుని నటించడం వల్లే వరుసగా అవకాశాలతో ముందుకు సాగుతున్నాను.
ప్ర: ప్రస్తుతం హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న కథలను తయారు చేసుకుంటున్న క్రియేటర్స్ అధికం అవుతున్నారు. అలాంటి కథా చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా?
జ: ప్రస్తుతానికి అలాంటి కథా చిత్రాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. మరొ కొన్నేళ్లు నేను హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నాను. నా చుట్టూ తిరిగే కథా చిత్రాలు ఇప్పుడే అవసరం అనుకోవడం లేదు. మరి కొన్ని ఏళ్లు హీరోలతో రొమాన్స్ చేసే పాత్రల్లో నటించి, ఆ తరువాత మీరంటున్న ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల గురించి ఆలోచిస్తాను.
ప్ర: ప్రస్తుతం నటిస్తున్న కీ, చార్లిన్ చాప్లిన్ 2 చిత్రాల గురించి?
జ: నిజం చెప్పాలంటే జీవాకు జంటగా నటించడానికి అంగీకరించింది కీ చిత్రంలోనే. అయితే ఆ తరువాత ఒప్పుకున్న కలగలప్పు–2 చిత్రం ముందుగా తెరపైకి వచ్చింది. కీ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉండడంతో ఆ చిత్ర విడుదల్లో జాప్యానికి కారణం అని నా అభిప్రాయం. ఇందులో చలాకీగా ఉండే యువతిగా నటిస్తున్నాను. నాకు ఏది అనిపిస్తే అది చేసే పాత్ర. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించని పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాను. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక చార్లిన్ చాప్లిన్–2 చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక్క పాటనే చిత్రీకరించాల్సి ఉంది. దర్శకుడు శక్తిచిదంబరం, ప్రభుదేవా వంటి జాలీ అయిన కాంబినేషన్‌లో నటిస్తున్నాను. చిత్ర షూటింగ్ పండగ వాతావరణంలో సాగింది. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగింది. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.
ప్ర: నెరుప్పుడా, పక్కా చిత్రాలు ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.దీనికి మీ స్పందన?
జ: చిత్రం విజయం సాధింస్తుందని భావించే 100 శాతం శ్రమిస్తాం. అలాంటి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందక పోతే బాధే కదా. అయితే దేశవ్యాప్తంగా ఏడాదికి 500లకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో నా చిత్రం ఒకటి అని సరిపెట్టుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment