హాలీవుడ్ నటి కేథరిన్ జెటా జోన్స్‌కు బాలీవుడ్ అంటే ఎంతో ప్రీతి. బాలీవుడ్ సినిమాలను ఫాలో అవుతారో లేదో తెలీదు గానీ అందులో క్లిక్ అయ్యే పాటలను మాత్రం తప్పకుండా ఫాలో అవుతారు. ఫాలో అవడమేంటి నచ్చితే డాన్స్ చేస్తారు. దాన్ని అభిమానులతో పంచుకుంటారు. కేథరిన్ తన భర్త మైఖేల్ డగ్లస్‌తో కలిసి ఈ మధ్యే భారత పర్యటనకు వచ్చింది. ఆ జంట మనదేశానికి రావడం ఇది రెండోసారి. ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలను అప్పుడప్పుడూ అభిమానులతో చెబుతూనే వస్తోంది.