
ప్రయాణికులతో సరదాగా..
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ క్యాథరీన్ బి. హడ్డా గురువారం మెట్రో జర్నీ చేశారు. రసూల్‌పురా–మెట్టుగూ డ మార్గం లో మెట్రోలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులతో సరదాగా గడి పారు. ఆమెకు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు కల్పించిన వసతులు, సౌకర్యాలను ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వివరించారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన ఆధునిక సాంకేతికత, పీపీపీ ఆర్థిక నమూన, అధిగమించిన ఇంజినీరింగ్ సవాళ్లను ఆయన వివరించారు. ఆమె వెంట అమెరికా రాయబార కార్యాలయం అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ఆకాశ్ సూరీ, ఇతర ఉన్నతాధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment