మరో పవర్‌ఫుల్ పాత్ర | Janmasthanam Release on 8th August | Sakshi
Sakshi News home page

మరో పవర్‌ఫుల్ పాత్ర

Published Mon, Aug 4 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

మరో పవర్‌ఫుల్ పాత్ర

మరో పవర్‌ఫుల్ పాత్ర

 నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల్ని సక్రమంగా పెంచితే సమాజ శ్రేయస్సుతో పాటు దేశం అభివృద్ధి చెందే వీలు ఉంటుందన్న కథాంశంతో రాయన్న .కె నిర్మించిన చిత్రం ‘జన్మస్థానం’. శత చిత్ర దర్శకుడు ఓం సాయిప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ నెల 8న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయన్న మాట్లాడుతూ -‘‘వ్యవస్థను ప్రక్షాళన చేసే శక్తిమంతమైన పోలీసాధికారి పాత్రను సాయికుమార్ చేశారు.
 
  కాలేజీ నేపథ్యంలో కథ సాగుతుంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రభుత్వం నిర్భయ వంటి చట్టాలు తీసుకువచ్చినా పరిష్కారం లభించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలను సరైన రీతిలో పెంచకపోవడంతో కొంతమంది యువకుల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. తల్లిదండ్రులకు మాత్రమే కాదు.. పిల్లలకు కూడా సందేశం ఇచ్చే చిత్రం ఇది. నేరాలు ఆగాలంటే ఏం చేయాలి? అనే పరిష్కారం కూడా ఇందులో చూపిస్తున్నాం. సందర్భానుసారం సాగే పాటలకు సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement