om sai prakash
-
విడుదలకు సిద్ధమైన 'జన్మస్థానం'
-
మరో పవర్ఫుల్ పాత్ర
నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల్ని సక్రమంగా పెంచితే సమాజ శ్రేయస్సుతో పాటు దేశం అభివృద్ధి చెందే వీలు ఉంటుందన్న కథాంశంతో రాయన్న .కె నిర్మించిన చిత్రం ‘జన్మస్థానం’. శత చిత్ర దర్శకుడు ఓం సాయిప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ నెల 8న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయన్న మాట్లాడుతూ -‘‘వ్యవస్థను ప్రక్షాళన చేసే శక్తిమంతమైన పోలీసాధికారి పాత్రను సాయికుమార్ చేశారు. కాలేజీ నేపథ్యంలో కథ సాగుతుంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రభుత్వం నిర్భయ వంటి చట్టాలు తీసుకువచ్చినా పరిష్కారం లభించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలను సరైన రీతిలో పెంచకపోవడంతో కొంతమంది యువకుల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. తల్లిదండ్రులకు మాత్రమే కాదు.. పిల్లలకు కూడా సందేశం ఇచ్చే చిత్రం ఇది. నేరాలు ఆగాలంటే ఏం చేయాలి? అనే పరిష్కారం కూడా ఇందులో చూపిస్తున్నాం. సందర్భానుసారం సాగే పాటలకు సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’’ అని చెప్పారు. -
సమాజాన్ని ఆలోచింపజేస్తుంది
‘‘ఇప్పటివరకు నేనే పాత్ర చేసినా అందులో ఏదో ఒక సందేశం ఉండటం నా అదృష్టం. ఈ చిత్రంలో కూడా నా పాత్ర మంచి సందేశం ఇస్తుంది. నాది శక్తిమంతమైన పాత్ర. సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అని సాయికుమార్ చెప్పారు. ఆయన కీలక పాత్రలో ఓం సాయిప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న ‘జన్మస్థానం’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. భరత్ కలర్ ల్యాబ్ సమర్పణలో సువన్‌రాయ్ ప్రొడక్షన్ పతా కంపై కె. రాయన్న నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ స్వరాలందించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ బిగ్ సీడీని ఆవిష్కరించారు. రచయిత సుద్దాల అశోక్‌తేజ ఆడియో సీడీని ఆవిష్కరించగా, చిత్రదర్శకుడు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వందేమాతరం బాణీలు, అశోక్‌తేజ సాహిత్యం అద్భుతంగా ఉన్నాయి’’ అని చెప్పారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించామని, ఇలాంటి చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతకు ధైర్యం కావాలని దర్శకుడు తెలిపారు.