'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్ | Chowkidar Movie Naana Anthem Song | Sakshi

Chowkidar Movie: 'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్

Jun 1 2025 7:42 PM | Updated on Jun 1 2025 7:42 PM

Chowkidar Movie Naana Anthem Song

నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'చౌకీదార్'. తెలుగు, కన్నడ భాషల్లో తీస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. డా. కల్లహల్లి చంద్ర శేఖర్ ఈ మూవీ నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)

నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది. తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement